తెలుగుదేశం ప్రభుత్వానికి మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ విజయవాడలో వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు మహాత్ముడికి గురువారం వినతిపత్రం సమర్పించారు.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తలపెట్టిన నిరవధిక దీక్షకు ఆటంకాలు కల్పిస్తున్న తెలుగుదేశం ప్రభుత్వానికి మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ విజయవాడలో వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు మహాత్ముడికి గురువారం వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఆ పార్టీ ఫ్లోర్ లీడర్ పుణ్యశీల మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా కోసం మాట్లాడే వారిపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. రాష్ట్రానికి మేలు చేయాలని జరుగుతున్న ఆందోళనలపై తెలుగుదేశం ప్రభుత్వం రాజకీయం చేస్తోందని ఆరోపించారు. కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు.