సాక్షి, హైదరాబాద్ : నాంపల్లి లేబర్ కోర్టు ప్రిసైడింగ్ అధికారి ఇంట్లో ఏసీబీ దాడులు నిర్వహిస్తోంది. నాంపల్లి కోర్టులో పనిచేస్తున్న గాంధీ ఆదాయానికి మించి అస్తులున్నాయనే అరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో హైకోర్టు అనుమతితో ఏసీబీ అధికారులు శనివారం దాడులు చేపట్టారు. హైదరాబాద్, గోదావరి జిల్లాల్లోని ఆయన ఇళ్లతో పాటు బంధువుల ఇంటిపైన సోదాలు చేస్తున్నారు.
ఇప్పటి వరకు జరిగిన తనిఖీల్లో రూ. 3 కోట్ల ఆస్తులు గుర్తించినట్టు ఏసీబీ జాయింట్ డైరెక్టర్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరంలో వ్యవసాయ భూములతో పాటు 30 తులాల బంగారం, ఓ లాకర్‌ను కనుగొన్నట్టు ఆయన వెల్లడించారు. ఏడు చోట్లు తనిఖీలు కొనసాగుతున్నాయని, ఆస్తులు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment