presiding officer
-
ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేసు నమోదు
హైదరాబాద్, సాక్షి: బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేసు నమోదైంది. పోలింగ్ సందర్భంగా ప్రిసైడింగ్ అధికారితో దురుసుగా ప్రవర్తించారనే అభియోగాలు నమోదు అయ్యాయి. దీంతో.. మంగళ్ హట్ పోలీస్ స్టేషన్లో రాజాసింగ్‌పై కేసు నమోదు చేశారు. -
గుండెపోటుతో ప్రిసైడింగ్ అధికారి మృతి
బీహార్‌లో లోక్‌సభ ఎన్నికల నాలుగో దశ పోలింగ్ ప్రారంభమయ్యింది. ఇంతలో ముంగేర్‌లోని చకాసిం ఇబ్రహీం శంకర్పూర్ మిడిల్ స్కూల్లోని బూత్ నంబర్ 210లో విషాదం చోటుచేసుకుంది. డ్యూటీ చేస్తున్న ప్రిసైడింగ్ అధికారి ఓంకార్ చౌదరి గుండెపోటుతో మృతి చెందారు. అతని ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. అతన్ని ఆసుపత్రికి తరలించేలోగానే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.దర్భంగాలోని హోలీ క్రాస్ స్కూల్లోని ఆదర్శ్ పోలింగ్ సెంటర్ ఉత్సాహంగా ఓటింగ్ జరుగుతోంది. ముందుగా ఇద్దరు పెద్దలు తమ ఓటు వేసి, యువత తప్పక ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఈ పోలింగ్ కేంద్రం ముందు పెద్ద సంఖ్యలో ఓటర్లు బారులు తీరారు. జిల్లా కేంద్రానికి ఆనుకుని ఉన్న బహదూర్‌పూర్ బ్లాక్‌లోని బహదూర్‌పూర్ పోలింగ్ నంబర్ 120 వద్ద ఈవీఎంలో అవాంతరం తలెత్తింది. దీంతో కొద్దిసేపు ఓటింగ్ నిలిచిపోయింది.బీహార్‌లోని ఐదు స్థానాల్లో నాలుగో దశ పోలింగ్ ప్రారంభమైంది. 9,447 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరుగుతోంది. చాలా చోట్ల ఉదయం ఆరు గంటలకే ఓటర్లు బూత్‌లకు చేరుకున్నారు. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ తన సొంత జిల్లా బర్హియాలోని 34వ నంబర్ బూత్‌కు చేరుకుని ఓటు వేశారు.ఈ దశ పోలింగ్‌లో కేంద్రమంత్రులు గిరిరాజ్ సింగ్, నిత్యానంద్ రాయ్, జనతాదళ్ యునైటెడ్ మాజీ జాతీయ అధ్యక్షుడు రాజీవ్ రంజన్ అలియాస్ లలన్ సింగ్, బీహార్ మంత్రి అశోక్ చౌదరి కుమార్తె శాంభవి చౌదరి, మంత్రి మహేశ్వర్ హజారీ కుమారుడు సన్నీ హజారీతో సహా 55 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. -
మహారాష్ట్రలో బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్
ముంబై: బీజేపీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలను ఏడాదిపాటు సభ నుంచి బహిష్కరిస్తూ మహారాష్ట్ర అసెంబ్లీలో సోమవారం తీర్మానాన్ని ఆమోదిం చింది. వారు స్పీకర్ చాంబర్లో ప్రిసైడింగ్ అధికారి భాస్కర్ జాదవ్‌తో అనుచితంగా ప్రవర్తించారని ప్రభుత్వం ఆరోపించింది. ఆ 12 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తూ సభా వ్యవహారాల మంత్రి అనిల్ పరబ్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అసెంబ్లీ ఆమోదించింది. సస్పెన్షన్ అమల్లో ఉన్నంతకాలం 12 మంది ఎమ్మెల్యేలు ముంబై, నాగపూర్‌లోని రాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణాల్లోకి అడుగు పెట్టడానికి వీల్లేదని అనిల్ పరబ్ స్పష్టం చేశారు. అయితే, ప్రభుత్వ ఆరోపణలను ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవిస్ ఖండించారు. తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తమ సభ్యులను సస్పెండ్ చేయడం కాదు, సభా వ్యవహారాలను తామే బహిష్కరిస్తామని చెప్పారు. స్థానిక సంస్థల్లో ఓబీసీ కోటా అమలు విషయంలో ప్రభుత్వ నిర్వాకాన్ని తాము బయ టపెడుతు న్నామని, అందుకే సభలో ప్రతిపక్ష బలాన్ని తగ్గించేందుకు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. ప్రిసైడింగ్ అధికారి భాస్కర్ జాదవ్‌ను బీజేపీ ఎమ్మెల్యేలు దూషించలేదన్నారు. అధికార శివసేన ఎమ్మెల్యేలే ఆయన పట్ల అనుచితంగా ప్రవర్తించారని ఫడ్నవిస్ చెప్పారు. భాస్కర్ జాదవ్ ఘటనపై సోమవారం మహారాష్ట్ర అసెంబ్లీ అట్టుడికింది. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో నాలుగు సార్లు సభ వాయిదా పడింది. -
ప్రిసైడింగ్ ఆఫీసర్‌గా ట్రాన్స్‌జెండర్ ఉమన్
ఓకే ఒక రోజుకు పోలింగ్ ఆఫీసర్. వచ్చేది లేదు, పోయేది లేదు. ‘చేస్తావా అమ్మా!’ అంది ఎలక్షన్ కమిషన్. ‘అమ్మా’ అన్నందుకైనా చేయాలనుకుంది.అమ్మ, మేడమ్, అమ్మాయ్.. మోనిక కోరుకున్న జెండర్ ఐడెంటిటీ! దేశంలోనే తొలిసారిగా.. ప్రిసైడింగ్ ఆఫీసర్ డ్యూటీ చేయబోతున్న ట్రాన్స్‌జెండర్ ఉమన్ మోనిక! బిహార్ ఎన్నికల్లో రెండో విడత పోలింగ్‌లో ఆమె కనిపిస్తారు. ట్రాన్స్ ఉమెన్‌కు గౌరవాన్ని తెచ్చిపెట్టి..తన బ్యాంక్ డ్యూటీకి తను వెళ్లిపోతారు. ఉద్యోగం వచ్చాక మోనికాదాస్ జీవితమే మారిపోయింది. ఆఫీస్‌లో అంతా ఆమెను గౌరవంగా చూస్తున్నారు. గౌరవంగా చూడదగని వ్యక్తేమీ కాదు ఆమె. అయితే గౌరవం అనే మాట ఎందుకు వచ్చింది? సమాజం తననొక స్త్రీగా గుర్తించాలని మోనికాదాస్ కోరుకుంది. స్త్రీలాగే బట్టలు వేసుకుంది. స్త్రీలా అలంకరించుకుంది. స్త్రీ సహజసిద్ధమైన కోమలత్వంలోకి తనని తను ఇముడ్చుకుంది. గోపాల్ కుమార్ అనే ఒక అబ్బాయి మోనికాదాస్ అనే అమ్మాయిగా కళ్లముందే మారిపోతూ ఉంటే ఆమెను ఏదో ఒకటి అనకుండా ఆమె జీవితాన్ని ఆమెకే వదలిపెట్టడానికి సమాజానికి చాలానే సమయం పట్టింది. ఎంత సమయం అంటే, ఆమె తన 27వ యేట పాట్నాలోని కంకర్‌బాగ్ కెనరా బ్యాంక్ బ్రాంచి ఆఫీసర్‌గా ఉద్యోగంలో చేరేవరకు! 2015లో ఆమె ఆ ఉద్యోగంలోకి వచ్చారు. ఆ క్రితం ఏడాదే ఆమె తన పేరును అధికారికంగా మోనికాదాస్ అని మార్చుకున్నారు. ఆఫీస్‌కి, ఆఫీస్ బయటికి తొలిరోజే వ్యత్యాసాన్ని గమనించారు మోనిక. ‘మేడమ్..టీ’ అన్నాడు ఆఫీస్ బాయ్ వచ్చి, సంశయంగానే అయినా సవినయంగా ఆమె కేబిన్‌లో టీ కప్పును పెడుతూ! అదెంతో సంతోషాన్నిచ్చింది మోనికకు. మిగతా స్టాఫ్ కూడా ఆమెతో చాలా మర్యాద గా ఉన్నారు. అక్కడికి దగ్గర్లోని కంకర్‌బాగ్ ఆటో స్టాండ్ సమీపంలోని సాయి మందిర్ దగ్గర ఉంటుంది మోనిక కుటుంబం. అమ్మ నాన్న, ఒక తమ్ముడు. పెద్ద తమ్ముడి పెళ్లి ఈ మధ్య జరిగింది. ఆ తమ్ముడి పెళ్లికి చీరకట్టుకునే వెళ్లారు మోనిక. ఎవరూ అభ్యంతరపెట్టలేదు. తను అమ్మాయిగానే ఉంటాను అన్నప్పుడు ఆమెను సపోర్ట్ చేసింది మొదట ఆమె తల్లిదండ్రులే. ఐదేళ్ల క్రితం బిహార్‌లో తొలి ట్రాన్స్‌జెండర్ మహిళా బ్యాంకు ఉద్యోగిగా గుర్తింపు పొందిన మోనికాదాస్ ఈసారి దేశంలోనే తొలిసారి పోలింగ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ విధులను నిర్వహించబోతున్న ట్రాన్స్‌జెండర్ ఉమన్‌గా వార్తల్లోకి వచ్చారు! పాట్నా యూనివర్శిటీలో ‘లా’ చేశారు మోనికాదాస్. ‘లా’లో గోల్డ్ మెడలిస్ట్. పాట్నా నవోదయ విద్యాలయలో స్కూల్ చదువు. స్కూల్లో ‘బ్రిలియంట్ బాయ్’ అనే వారు తనను. ఆ ప్రశంసను ‘బ్రిలియంట్’ అన్నంత వరకే ఆమె స్వీకరించగలిగేది. బాయ్స్‌లా బట్టలు వేసుకోబట్టే కదా తనను అంతా బాయ్ అంటున్నారని బాధపడేది. ఆడపిల్లలా స్కూల్‌కి తయారై రావాలని, ఆడపిల్లల్తో కలిసి కూర్చోవాలని తపించేది. ‘అది అసాధ్యం బాబూ..’ అని ఎప్పటికప్పుడు ఆమెకు ఎవరో ఒకరు చూపులతో, మాటలతో తెలియబరుస్తూనే ఉండేవారు. కాలేజ్‌లో కూడా అంతే. ఉద్యోగం లో చేరాక మాత్రమే ఆమెకు పూర్తి స్వేచ్ఛ లభించింది. మనసా వాచా పూర్తిగా ఒక యువతిలా మారిపోయేందుకు వీలైంది. ఇప్పుడీ కొత్త గుర్తింపుతో (దేశంలోనే తొలి ట్రాన్స్‌జెండర్ ఉమన్ ప్రిసైడింగ్ ఆఫీసర్ అనే గుర్తింపు) బిహార్‌లో ఉన్న నలభై వేల మంది ట్రాన్స్జెండర్లకు ప్రత్యేక గౌరవం లభిస్తుందని మోనికా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గుర్తింపు, గౌరవం మాత్రమే కాదు, ‘మేము ఫలానా’ అని ధైర్యంగా బయటికి వచ్చి చెప్పుకునే ఆత్మవిశ్వాసం కూడా వారికి తన వల్ల చేకూరుతుందని ఆమె ఆశిస్తున్నారు. అసలందుకే.. ‘చేస్తావా? అమ్మా’ అని ఎలక్షన్ కమిషన్ అడగ్గానే ప్రిసైడింగ్ ఆఫీసర్‌గా చేయడానికి ముందుకు వచ్చారు మోనికాదాస్. పోలింగ్ ప్రిసైడింగ్ ఆఫీసర్‌గా మోనికాదాస్ ఈ కోవిద్ సమయంలో అత్యంత కీలకమైన బాధ్యతలు నిర్వర్తించవలసి ఉంటుంది. బిహార్‌లో అక్టోబర్ 28, నవంబర్ 3,7 తేదీలలో మూడు విడతలుగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. మోనికాదాస్ రెండో విడత పోలింగ్‌లో పాట్నాలోని ఏదైనా ఒక బూత్‌కు పర్యవేక్షణ అధికారిగా ఉంటారు. పోలింగ్ సజావుగా జరిగేలా చూడటం, ఈవీఎంల పనితీరును ఎప్పటికప్పుడు చెక్ చేస్తుండటం, జిల్లా ఎన్నికల అధికారి జారీ చేసిన ఉత్తర్వులను తు.చ.తప్పకుండా అమలు అయ్యేలా చర్యలు తీసుకోవడం, బ్యాలెట్ బాక్సుల భద్రత.. ఇవన్నీ ఆమె చూసుకోవలసి ఉంటుంది. ఇందుకోసం అక్టోబర్ 8న పట్నాలోని గర్దానీబాగ్లో మోనికాదాస్తోపాటు మరికొందరు ఆఫీసర్లకు ఎన్నికల సంఘం శిక్షణ ఇవ్వబోతోంది. ప్రజాస్వామ్య వ్యవస్థాపనకు అత్యంత ముఖ్యమైన ఎన్నికల ప్రక్రియలో భాగస్వామ్యం పొందడాన్ని ఒక ట్రాన్స్పౌరురాలిగా నేను గర్విస్తున్నాను’’ అని అంటున్నారు మోనికాదాస్. తొలిసారి 2016 పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో రియా సర్కార్ అనే ట్రాన్స్‌జెండర్ ఉమన్ కోల్‌కతాలో పోలింగ్ ఆఫీసర్‌గా చేశారు. మోనికాదాస్ ప్రిసైడింగ్ ఆఫీసర్. -
పోలింగ్ అధికారిని చితకబాదారు
లక్నో : యూపీలో మంగళవారం లోక్‌సభ ఎన్నికల మూడో విడత పోలింగ్‌లో చెదురుమదురు ఘటనలు చోటుచేసుకున్నాయి. మొరదాబాద్‌లోని బిలారిలో ఓ పోలింగ్ బూత్ వద్ద బీజేపీ కార్యకర్తలు ప్రిసైడింగ్ అధికారిని తోసివేస్తూ భౌతిక దాడికి పాల్పడ్డారు. సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను ప్రిసైడింగ్ అధికారి కోరారని ఆయనపై దాడికి తెగబడ్డ బీజేపీ కార్యకర్తలు ఆరోపించారు. యూపీలో బీఎస్పీతో పొత్తుతో పోటీ చేస్తున్న సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) గుర్తు సైకిల్ కావడం గమనార్హం. ఎస్పీ గుర్తు సైకిల్ బటన్‌ను ప్రెస్ చేయాలని ప్రిసైడింగ్ అధికారి మహ్మద్ జుబైర్ మహిళా ఓటర్లను ఒత్తిడి చేయడంతో తాము అడ్డగించామని బీజేపీ కార్యకర్తలు తెలిపారు. బీజేపీ నేతల ఫిర్యాదుతో సదరు అధికారిని పోలింగ్ విధుల నుంచి తప్పించారు. మరోవైపు ఇటావాలోనూ ప్రిసైడింగ్ అధికారులు ఓటర్లను సైకిల్ బటన్‌ను ప్రెస్ చేయాలని సూచించారని, యోగేష్ కుమార్ అనే అధికారిని ఈ ఆరోపణలపై పోలింగ్ బూత్ నుంచి బయటకు పంపారు. ఇక బీజేపీ అభ్యర్ధిగా జయప్రద బరిలో నిలిచిన రాంపూర్ నియోజకవర్గంలో 300కిపైగా ఈవీఎంలు పనిచేయలేదని, నియోజకవర్గ ఓటర్లను అధికారులు బెదిరిస్తున్నారని ఎస్పీ నేత ఆజం ఖాన్ కుమారుడు అబ్దుల్లా ఆజం ఖాన్ ఆరోపించారు. -
ఎన్నికల అధికారి దారుణ హత్య
కోల్కత్తా : పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో జరిగిన దారుణం ఆలస్యంగా వెలుగుచూసింది. ఎన్నికల విధులు నిర్వహించడానికి వచ్చిన ఓ ప్రిసైడింగ్ అధికారి దారుణ హత్యకు గురయ్యారు. ఉత్తర దినాజ్పూర్లో జరిగిన ఈ సంఘటన రాష్ట్రం వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. రహత్‌పూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న రాజ్‌కుమార్ రాయ్, రాయ్‌గంజ్‌లోని ఇతహార్ ప్రాంతానికి ఎన్నికల ప్రిసైడింగ్ అధికారిగా వెళ్లారు. పోలింగ్ జరిగే సమయంలో కొందరు అడ్డుకొవడానికి ప్రయత్నించగా ఆయన వారిని ప్రతిఘటించారు. అయితే పోలింగ్ పూర్తైన అనంతరం రాయ్ అకస్మాత్తుగా అదృశ్యమై పోయారు. ఎన్నికల రోజు తన భర్త రాయ్ పోలింగ్ బూత్‌లో ఉండగా రాత్రి 8 గంటలకు మాట్లాడానని, ఆతరువాత మాట్లాడటానికి ప్రయత్నించిన కుదరలేదని ఆయన భార్య అర్పిత తెలిపారు. దీంతో అనుమానం వచ్చి రాయ్ కిడ్నాప్ అయ్యారని ఇతహర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. మరుసటి రోజు సోనాదంగి రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు పట్టలేనంత స్థితిలో రాయ్ మృతదేహం ముక్కలు ముక్కలుగా పడివుంది. రాయ్ మరణంపై ఆమె పలు అనుమానాలు వ్యక్తం చేశారు. పథకం ప్రకారం రాయ్ ప్రాణాలు తీశారని, దీనిపై సీబీఐ విచారణ చేయాలని అర్పిత డిమాండ్ చేశారు. రాజ్‌కుమార్ రాయ్ దారుణ హత్యపై ఇతర ఎన్నికల అధికారులు, పాఠశాల ఉద్యోగులు బుధవారం నిరసనకు దిగారు. రాయ్ మరణంపై తగిన న్యాయం చేయాలంటూ రోడ్లను దిగ్భందించారు. రాయ్ హత్యపై ఫిర్యాదు చేస్తే పోలీసులు తిరస్కరించారని వారు ఆరోపించారు. హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం జరిగిందన్నారు. అయతే దీనిపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం స్పందించింది. కేసు విచారణను సీఐడీకి అప్పగించనున్నట్లు సమాచారం. -
ప్రిసైడింగ్ అధికారి ఇంటిపై ఏసీబీ దాడులు
సాక్షి, హైదరాబాద్ : నాంపల్లి లేబర్ కోర్టు ప్రిసైడింగ్ అధికారి ఇంట్లో ఏసీబీ దాడులు నిర్వహిస్తోంది. నాంపల్లి కోర్టులో పనిచేస్తున్న గాంధీ ఆదాయానికి మించి అస్తులున్నాయనే అరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో హైకోర్టు అనుమతితో ఏసీబీ అధికారులు శనివారం దాడులు చేపట్టారు. హైదరాబాద్, గోదావరి జిల్లాల్లోని ఆయన ఇళ్లతో పాటు బంధువుల ఇంటిపైన సోదాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన తనిఖీల్లో రూ. 3 కోట్ల ఆస్తులు గుర్తించినట్టు ఏసీబీ జాయింట్ డైరెక్టర్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరంలో వ్యవసాయ భూములతో పాటు 30 తులాల బంగారం, ఓ లాకర్‌ను కనుగొన్నట్టు ఆయన వెల్లడించారు. ఏడు చోట్లు తనిఖీలు కొనసాగుతున్నాయని, ఆస్తులు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. -
...అను నేను కార్పొరేటర్‌గా..
♦ నేడు కొలువు దీరనున్నఖమ్మం కార్పొరేషన్ పాలకవర్గం ♦ ఉదయం 11 గంటలకు ముహూర్తం ♦ సీల్డ్ కవర్లో మేయర్, డిప్యూటీ మేయర్ల పేర్లు ♦ ఫాం- ఏ సమర్పించిన పార్టీల అధినేతలు ♦ మార్గదర్శకాలు రాలేదని కోఆప్షన్ ఎన్నిక వాయిదా ♦ సర్వం సిద్ధం చేసిన జిల్లా యంత్రాంగం ఖమ్మం: ఖమ్మం కార్పొరేషన్ నూతన పాలకవర్గం మంగళవారం ఉదయం కొలువుదీరనుంది. సరిగ్గా ఉదయం 11 గంటలకు ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్ కార్పొరేటర్లు, మేయర్, డిప్యూటీ మేయర్ చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఎన్నికైన కార్పొరేటర్లు, ఎక్స్అఫీషియో సభ్యులకు ఇప్పటికే ఆహ్వానం పంపారు. ప్రమాణ స్వీకారోత్సవ ఏర్పాట్లను అధికారులు పూర్తి చేయించారు. కౌన్సిల్ కొలువు దీరేదిలా.. 50 డివిజన్లలో గెలుపొందిన కార్పొరేటర్లు ఉదయం 11 గంటల కల్లా కార్పొరేషన్‌లోని సమావేశ మందిరానికి వస్తారు. వీరితో కలెక్టర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ‘మేయర్ ఎన్నిక నిర్వహిస్తాం.. పోటీలో నిలిచే వారు నామినేషన్ ప్రకటించాలి’ అని కోరుతారు. మేయర్ పదవి కోసం ఒక్క అభ్యర్థి మాత్రమే నామినేషన్ వేస్తే పోటీ లేదని భావించి ఏకగ్రీవ ంగా నియమిస్తారు. ఒకవేళ పోటీ ఉంటే చేతులు ఎత్తే పద్ధతిలో ఎన్నిక నిర్వహిస్తారు. మెజార్టీ సభ్యులు ఆమోదించిన వారిని మేయర్‌గా ప్రకటిస్తారు. మేయర్‌ను ఎంపిక చేసే పద్ధతిలోనే డిప్యూటీ మేయర్‌నూ ఎంపిక చేస్తారు. ఎంపికైన మేయర్, డిప్యూటీ మేయర్లకు ప్రిసైడింగ్ అధికారి నియామక పత్రాలు అందజేస్తారు. కొత్తగా నియమితులైన వారితో కోరం (25 మంది సభ్యుల కంటే ఎక్కువ) ఉంటే కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తారు. కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం నిర్వహించే నాటికి ప్రమాణ స్వీకారం చేయని కార్పొరేటర్లు తిరిగి సర్వసభ్య సమావేశం నిర్వహించే వరకు వేచిచూడక తప్పదు. అప్పటి వరకు కార్పొరేటర్లుగా పరిగణించే అవకాశం ఉండదు. కాబట్టి సభ్యులందరూ సకాలంలో హాజరయ్యేందుకు సిద్ధమవుతున్నారు. కవర్లోనే ర హస్యం.. కార్పొరేషన్ ఎన్నికలప్పటి నుంచి మేయర్ అభ్యర్థి నియామకం దాదాపుగా ఖాయమైందని అధికార పార్టీ చెబుతోంది. కానీ సోమవారం రాత్రి వరకు కూడా మేయర్, డిప్యూటీ మేయర్ల విషయమై అధికారికంగా ఎటువంటి ప్రకటన వెలువడలేదు. సీల్డ్ కవర్లోనే మేయర్, డిప్యూటీ మేయర్ల గుట్టు ఉన్నట్లు తెలుస్తోంది. మేయర్ పదవిని ఆశిస్తున్న వారిలో డాక్టర్ పాపాలాల్, రామ్మూర్తి పేర్లు వినిపిస్తున్నాయి. డిప్యూటీ మేయర్ పదవికి విపరీతమైన పోటీ ఉంది. ఎక్కువ సంఖ్యలో ఆశావహులు ఈ పదవి కోసం పోటీ పడుతున్నారు. ‘తామే డిప్యూటీ మేయరంటే.. తామే..’ అంటూ అనుచరుల వద్ద ప్రగల్భాలకు పోతున్నారు. సీఎం కేసీఆర్ ఆమోదంతో ప్రకటించిన మేయర్, డిప్యూటీ మేయర్ల పేర్లు సీల్డ్ కవర్లో ఉంచి మంగళవారం రిటర్నింగ్ అధికారికి ఇవ్వనున్నట్లు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు షేక్ బుడాన్‌బేగ్ ప్రకటించారు. ఫాం ఏ సమర్పణ కార్పొరేషన్ కౌన్సిల్ నియామకానికి సంబంధించిన ఫాం-ఏను టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బేగ్ కలెక్టర్‌కు సో మవారం అందజేశారు. కౌన్సిల్ ఏర్పాటుకు తమ పార్టీకి మెజార్టీ సభ్యులున్నారని తెలిపారు. మేయర్, డిప్యూటీ మేయర్ల పేర్లు వెల్లడించే ఫాం-బీని మంగళవారం ఉదయం అందజేసేందుకు టీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది. కో-ఆప్షన్ వాయిదా రాష్ట్ర ఎన్నికల కమిషన్ నుంచి ఆదేశాలు రాలేదన్న కారణంతో కోఆప్షన్ సభ్యుని నియామకాన్ని వాయిదా వేసినట్లు కార్పొరేషన్ అధికారులు ప్రకటించారు. ఖమ్మం కార్పొరేషన్ స్థాయికి అనుగుణంగా మొత్తం ఐదుగురు కో-ఆప్షన్ సభ్యులను నియమించే అవకాశం ఉంది. వీరిలో ఇద్దరు మైనార్టీలు, ముగ్గురు కార్పొరేషన్ పాలనా వ్యవహారాలపై అనుభవం ఉన్నవారు ఉంటారు. కౌన్సిల్ ప్రారంభమైన 60 రోజుల లోపు కోఆప్షన్ సభ్యుల నియామకం చేపట్టవచ్చనే నిబంధన ఉంది. ఈ మేరకు తిరిగి కౌన్సిల్ సమావేశం నాటికి సభ్యుల ఎంపిక జరగనుంది. ఎక్స్ అఫీషియో సభ్యులకూ ఆహ్వానం.. కౌన్సిల్ సమావేశం, ప్రమాణస్వీకారోత్సవం కార్యక్రమానికి ఎక్స్అఫిషియో సభ్యులకూ ఆహ్వానం పంపారు. స్థానిక ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాజ్యసభ సభ్యులు రేణుకాచౌదరి, ఎమ్మెల్సీ, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, బాలసాని లక్ష్మీనారాయణ, పల్లా రాజేశ్వరరెడ్డి కౌన్సిల్ సమావేశానికి హాజరుకానున్నారు. ప్రమాణ స్వీకారం, ఎంపిక కార్యక్రమాలు జిల్లా ఎన్నికల పరిశీలకులు ఇలంబరితి, కలెక్టర్ లోకేష్‌కుమార్ పర్యవేక్షణలో జరగనున్నాయి. -
జీ.. హుజూర్
సాక్షి ప్రతినిధి, కడప:ప్రభుత్వ అధికారులమనే భావనను వారు మరచిపోతున్నారు. పచ్చ కండువా కప్పుకోకుండానే అధికార పార్టీ నేతలకు జీ.. హుజూర్ అంటున్నారు. రాజభక్తి ప్రదర్శించడంలో పోటీలు పడుతున్నారు. నిబంధనలు, ప్రభుత్వ ఉత్తర్వులను గాలికి వదిలేస్తున్నారు. జమ్మలమడుగు ఆర్డీఓ మొదలు జెడ్పీ సీఈఓ వరకూ వారి పరిధిలో సరికొత్త నాటకాలకు తెరలేపుతున్నారు. ప్రజాప్రతినిధులను విస్మరిస్తూ వింతపోకడలు ప్రదర్శిస్తున్నారు.వైఎస్సార్ జిల్లాలో అధికార యంత్రాంగం ఏకపక్ష ధోరణిలో పయనిస్తోంది. కాదు...కాదు... ఏకపక్షంగా పనిచేసి తీరాలంటూ తెలుగుతమ్ముళ్లు ఆదేశిస్తున్నారు. వారి ఆదేశాలను యంత్రాంగం తుచ తప్పకుండా పాటిస్తోంది. ఇటీవల చోటు చేసుకుంటున్న ఘటనలు ఇందుకు తాత్కారంగా నిలుస్తున్నాయి. జమ్మలమడుగు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించిన ఆర్డీఓ రఘునాథరెడ్డి డ్రామా ఆర్టిస్ట్‌ను మరిపించారు.ఎన్నికలు నిర్వహిస్తే చైర్మన్‌గిరీ వైఎస్సార్సీపీ వశమవుతుందని గ్రహించిన తెలుగుతమ్ముళ్లు తెరవెనుక ఆదేశాలు అందజేయడంతో తెరముందు అనారోగ్య సమస్యను ఆర్డీఓ ఆవిష్కరించారు. కొద్దిసేపటి క్రితం వరకూ చలాకీగా ఉన్న ఆయన తెలుగుతమ్ముళ్ల మెప్పు కోసం అనారోగ్య డ్రామాను రక్తి కట్టించారు. జెడ్పీ స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికల సందర్భంగా అధికారుల నాటకం మారోమారు బహిర్గతం అయింది. టీడీపీ సభ్యులు, వారి మద్దతుదారులు పత్రాలు చింపేయడం, వెంటనే అక్కడి నుంచి సీఈఓ మాల్యాద్రి జారుకోవడం టీడీపీ నేతల స్క్రిప్ట్ ప్రకారమే జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. క్రమం తప్పకుండా... జమ్మలమడుగు ఉద ంతం తర్వాత అధికారులు అధికార పార్టీ మెప్పుపొందడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నిబంధనల మేరకు వేదికపై ప్రొద్దుటూరు ఎమ్మెల్యేకు సీటు కేటాయించకుండా కమిషనర్ వెంకటకృష్ణ టీడీపీ నేతల మెప్పు కోసం తాపత్రయపడ్డారు. టీడీపీ నేతల ఆదేశాలకు అనుగుణంగా జెడ్పీ సీఈఓ మాల్యాద్రి చెప్పాపెట్టకుండా జారుకోవడంతో డీప్యూటీ సీఈఓ స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికలను నిర్వహించాల్సి వచ్చింది. దీంతో రాష్ట్రంలో ఎక్కడా పనిచేయలేవంటూ డిప్యూటీ సీఈఓ బాలసరస్వతీదేవిని అధికార పార్టీ నేత ఒకరు బెదిరించినట్లు సమాచారం. అధికారులు అంతా చూస్తుండటానే టీడీపీ నేత ఫోన్లో డీప్యూటీ సీఈఓపై బెదిరింపులకు దిగినట్లు తెలుస్తోంది. తలాడించకుంటే బదిలే ... అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ తమకు అనుకూలంగా లేని అధికారులను బదిలీ చేయడం ప్రారంభించింది. అందులో భాగంగా కలెక్టర్ కోన శశిధర్, ఎస్పీ అశోక్‌కుమార్‌ను అనతికాలంలోనే బదిలీ చేయించారు. దీంతో అధికారులు టీడీపీ నేతలు ఆదేశిస్తే జీ హుజూర్ అనడం అలవాటు చేసుకుంటున్నారు. నిబంధనలు అడ్డువస్తున్నాయని కొంతమంది అధికారులు వివరిస్తే వారిని దూషించడం మొదలు పెడుతున్నారు. జిల్లాలో సోదరులైన టీడీపీ నేతలు ఇష్టానుసారంగా అధికారులను దూషిస్తున్నట్లు పలువురు చెప్పుకొస్తున్నారు. దీంతో టీడీపీ నేతల ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవడాన్ని యంత్రాంగం అలవాటుగా చేసుకుంటోంది. కిందిస్థాయి యంత్రాంగం అయితే అధికార పార్టీ నేతల ఆదేశాలను తక్షణమే ఆచరిస్తున్నారు. ఇందుకు ఒంటిమిట్ట తహశీల్దారు ఈశ్వరయ్య శైలి నిదర్శనంగా నిలుస్తోంది. -
సిబ్బంది..ఇబ్బంది
సార్వత్రిక ఎన్నికలకు ఉద్యోగుల కొరత విధుల్లో పాల్గొనలేమని అనేకమంది విజ్ఞప్తులు శారీరక సమస్యలతో మొరపెట్టుకుంటున్న ఉద్యోగులు కాదు..కూడదంటున్న జిల్లా యంత్రాంగం నిబంధనల మార్పుతో అధికారుల తర్జనభర్జన నల్లగొండ, న్యూస్‌లైన్, సార్వత్రిక ఎన్నికల నిర్వహణ కు సిబ్బంది కొరత ఓ వైపు వేధిస్తుంటే...మరోవైపు వివిధ కారణాల వల్ల తాము ఎన్నికల విధుల్లో పాల్గొనలేమని అనేకమంది ఉద్యోగులు జిల్లా యంత్రాంగానికి మొరపెట్టుకుంటున్నారు. ఎన్నికల విధులు కేటాయించడంలో ఈ సారి ఎన్నికల కమిషన్ నిబంధనలు మార్చడంతో అధికారులకు ఎటూ పాలుపోవడం లేదు. ఈ నెల 30న జరిగే సార్వత్రిక ఎన్నికలకు అన్ని కేటగిరీల్లో కలిపి సుమారు 20వేల మంది సిబ్బంది అవసరం ఉంది. దీంట్లో ప్రిసైడింగ్ అధికారులు (పీఓ), అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు (ఏపీఓ), పోలింగ్ క్లర్క్‌లు ఎక్కువ సంఖ్యలో అవసరం ఉంటారు. ప్రస్తుతం పీఓ, ఏపీఓల నియామకం పూర్తికాగా, పోలింగ్ క్లర్క్‌ల నియామకం ఇంకా పూర్తికాలేదు. గెజిటెడ్ హోదా కలిగిన అధికారులను పీఓ, ఏపీఓలుగా నియమిస్తుండగా, వివిధ శాఖల సిబ్బందిని పీసీలుగా నియమిస్తున్నారు. నిబంధనలు కఠినం.. గతంలో ఒక్కో పోలింగ్ కేంద్రానికి పీఓ, ఏపీఓ, ముగ్గురు పీసీలతోనే ఎన్నికలు నిర్వహించారు. ఈసారి పోలింగ్ కేంద్రానికి పీఓ, ఏపీఓలతో పాటు ఆరుగురు పీసీలను నియమించాలని ఎన్నికల కమిషన్ పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగులనే నియమించాలని, ఆశా వర్కర్లు, అంగన్వాడీ ఉద్యోగులు, ప్రైవేటు టీచర్లను నియమించడానికి వీల్లేదన్న ఆదేశాలున్నాయి. గతంలో వారందరినీ విధులకు వాడుకునే అవకాశం ఉండేది. ఇప్పుడా పరిస్థితి లేకపోవడంతో ఎన్నికల నిర్వహణకు సరిపడా సిబ్బంది లభించక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు కొందరు ఉద్యోగులు సుముఖంగా లేరు. పీసీలుగా ఏఈ, డీఈలను కూడా నియమించాల్సి వస్తోంది. దీంతో గెజిటెడ్ హోదా కలిగిన వారిని పీసీలుగా బాధ్యతలు అప్పగించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. తప్పని తిప్పలు... ఎన్నికల విధుల్లో పాల్గొనడం ఇష్టంలేని ఉద్యోగులు నేరుగా ఏజేసీకి దరఖాస్తు చేసుకోవాల్సి వస్తోంది. గతంలో ఈ ఆక్షేపణలు ఆర్డీఓ స్థాయిలోనే పరిష్కారం చేశారు. కనీసం తమ స్థానంలో మరొకరికి బాధ్యతలు అప్పగించే వెసులుబాటు కూడా ఉద్యోగులకు కల్పిం చడం లేదు. అనారోగ్యంతో బాధపడుతున్న వారినీ కనికరించడం లేదు. ఆధారాలతో సహా బాధితులు విజ్ఞప్తులు చేస్తున్నా కఠినంగానే వ్యవహరిస్తున్నారు.