గుండెపోటుతో ప్రిసైడింగ్‌ అధికారి మృతి | Bihar Presiding Officer Died of Heart Attack | Sakshi
Sakshi News home page

గుండెపోటుతో ప్రిసైడింగ్‌ అధికారి మృతి

Published Mon, May 13 2024 8:19 AM | Last Updated on Mon, May 13 2024 8:19 AM

Bihar Presiding Officer Died of Heart Attack

బీహార్‌లో లోక్‌సభ ఎన్నికల నాలుగో దశ పోలింగ్‌ ప్రారంభమయ్యింది. ఇంతలో ముంగేర్‌లోని చకాసిం ఇబ్రహీం శంకర్‌పూర్ మిడిల్ స్కూల్‌లోని బూత్ నంబర్ 210లో విషాదం చోటుచేసుకుంది. డ్యూటీ చేస్తున్న ప్రిసైడింగ్ అధికారి ఓంకార్ చౌదరి గుండెపోటుతో మృతి చెందారు. అతని ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. అతన్ని ఆసుపత్రికి తరలించేలోగానే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

దర్భంగాలోని హోలీ క్రాస్ స్కూల్‌లోని ఆదర్శ్ పోలింగ్ సెంటర్  ఉత్సాహంగా ఓటింగ్ జరుగుతోంది. ముందుగా ఇద్దరు పెద్దలు తమ ఓటు వేసి, యువత  తప్పక ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఈ పోలింగ్‌ కేంద్రం ముందు పెద్ద సంఖ్యలో ఓటర్లు బారులు తీరారు. జిల్లా కేంద్రానికి ఆనుకుని ఉన్న బహదూర్‌పూర్ బ్లాక్‌లోని బహదూర్‌పూర్ పోలింగ్ నంబర్ 120 వద్ద ఈవీఎంలో అవాంతరం తలెత్తింది. దీంతో కొద్దిసేపు ఓటింగ్ నిలిచిపోయింది.

బీహార్‌లోని ఐదు స్థానాల్లో నాలుగో దశ పోలింగ్ ప్రారంభమైంది. 9,447 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరుగుతోంది. చాలా చోట్ల ఉదయం ఆరు గంటలకే ఓటర్లు బూత్‌లకు చేరుకున్నారు. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ తన సొంత జిల్లా బర్హియాలోని 34వ నంబర్ బూత్‌కు చేరుకుని ఓటు వేశారు.

ఈ దశ పోలింగ్‌లో కేంద్రమంత్రులు గిరిరాజ్ సింగ్, నిత్యానంద్ రాయ్, జనతాదళ్ యునైటెడ్ మాజీ జాతీయ అధ్యక్షుడు రాజీవ్ రంజన్ అలియాస్ లలన్ సింగ్, బీహార్  మంత్రి అశోక్ చౌదరి కుమార్తె శాంభవి చౌదరి, మంత్రి మహేశ్వర్ హజారీ కుమారుడు సన్నీ హజారీతో సహా 55 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement