సాక్షి, హైదరాబాద్ : కీసర తహశీల్దార్ అవినీతి కేసులో విచారణ కొనసాగుతోంది. కరోనా నేపథ్యంలో ఏసీబీ అధికారులు పీపీఈ కిట్ ధరించి నిందితులను విచారిస్తున్నారు. మొత్తం నలుగురు నిందితులను వేర్వేరు గదుల్లో ఉంచి అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. విచారణ మొత్తాన్ని అధికారులు వీడియో రికార్డ్ చేస్తున్నారు. అయితే ఏసీబీ అధికారులకు ఎమ్మార్వో నాగరాజు ఏమాత్రం సహకరించడం లేదని తెలుస్తోంది. అధికారులు అడిగిన ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు చెబుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. (చదవండి :కీసర ఎమ్మార్వో నాగరాజు కేసులో కొత్త కోణం!)
బ్యాంకు లాకర్లపై ఇప్పటిరవరకు నాగరాజు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని తెలుస్తోంది. కోటి 10 లక్షల రూపాయలపై నిందితులను నుండి అన్ని కోణాల్లో అధికారులు విచారిస్తున్నారు. చంచల్ గూడ జైళ్లో ఉన్న నలుగురు నిందితులు నాగరాజు, శ్రీనాథ్, అంజిరెడ్డి, విఆర్ఏ సాయిరాజులను కస్టడీ నిమిత్తం ఏసీబీ కోర్టు అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. ఈ 27 వరకు కొనసాగే ఏసీబీ కస్టడీ నేపథ్యంలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. వారిని బుధవారం కస్టడీలోకి తీసుకొని ఏసీబీ అధికారులు విచారించనున్నారు. (చదవండి : కీసర : నలుగురు నిందితుల కస్టడీకి అనుమతి)
Comments
Please login to add a commentAdd a comment