
హైదరాబాద్ : జాతిపిత మహాత్మాగాంధీ 148వ జయంతి సందర్భంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. మహాత్మాగాంధీ జీవితం స్ఫూర్తిదాయకమని, ప్రతి ఒక్కరిలోనూ ఆ స్ఫూర్తి నిండాలని వైఎస్ జగన్ పేర్కొన్నారు. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుందామంటూ ట్వీట్ చేశారు. అదేవిధంగా దివంగత మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా వైఎస్ జగన్ ట్విట్టర్‌లో నివాళులర్పించారు. నిరాడంబర వ్యక్తిత్వం, సమర్థ నాయకత్వానికి మారుపేరైన లాల్ బహదూర్ శాస్త్రి 'జై జవాన్, జై కిసాన్' అన్న ప్రసిద్ధ నినాదాన్ని ఇచ్చిన విషయాన్ని వైఎస్ జగన్ గుర్తుచేశారు. ఆయన నిజమైన పరిపాలకుడని, యువతే కాదు దేశ నిర్మాతలకు సైతం ఆయన స్ఫూర్తి అని కొనియాడారు. దేశ స్వాతంత్ర్య పోరాటంలోనూ శాస్త్రి పాల్గొన్నారని స్మరించుకున్నారు.
వైఎస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఎంపీ విజయసాయిరెడ్డి, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మహాత్మాగాంధీ, లాల్ బహదుర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
Remembering Mahatma Gandhiji on his 148th jayanthi. His life is an inspiration and should be emulated by each one of us.
— YS Jagan Mohan Reddy (@ysjagan) 2 October 2017
My tributes to Lal Bahadur Shastriji on his jayanthi. pic.twitter.com/y30fdonIqV
— YS Jagan Mohan Reddy (@ysjagan) 2 October 2017