న్యూఢిల్లీ: నేడు (బుధవారం) దేశవ్యాప్తంగా గాంధీ జయంతి వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్ ప్రచారంలో పాల్గొన్నారు. ఢిల్లీలో స్కూల్ పిల్లలతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ చీపురు పట్టి, పరిసరాలను పరిశుభ్రపరిచారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ప్రజలంతా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.
‘స్వచ్ఛతా హి సేవా 2024’ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ గాంధీజీ కలలుగన్న భారత దేశాన్ని అందరం కలిసి సాకారం చేద్దామన్నారు. అందుకు ఈరోజు మనకు ఈ స్ఫూర్తిని అందిస్తుందన్నారు. నేటితో స్వచ్ఛ భారత్ మిషన్ ప్రయాణం 10 సంవత్సరాల మైలురాయిని చేరుకుందని ప్రధాని పేర్కొన్నారు.
గత పక్షం రోజుల్లో దేశవ్యాప్తంగా కోట్లాది మంది ‘స్వచ్ఛతా హి సేవా’ కార్యక్రమాల్లో పాల్గొన్నారన్నారు. నిరంతర కృషితోనే మన భారతదేశాన్ని పరిశుభ్రంగా మార్చుకోగలం. ఈ రోజున పరిశుభ్రతకు సంబంధించిన సుమారు 10 వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు కూడా ప్రారంభమయ్యాయన్నారు. మిషన్ అమృత్ కింద దేశంలోని పలు నగరాల్లో మురుగునీటి శుద్ధి ప్లాంట్లు నిర్మించనున్నామన్నారు. ఇది స్వచ్ఛ భారత్ మిషన్‌ను మరో మైలురాయి దాటిస్తుందన్నారు.
ఇది కూడా చదవండి: మహాత్మా గాంధీకి ప్రధాని మోదీ నివాళులు
Comments
Please login to add a commentAdd a comment