Abhiyan
-
చిన్నారులతో పాటు చీపురు పట్టిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: నేడు (బుధవారం) దేశవ్యాప్తంగా గాంధీ జయంతి వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్ ప్రచారంలో పాల్గొన్నారు. ఢిల్లీలో స్కూల్ పిల్లలతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ చీపురు పట్టి, పరిసరాలను పరిశుభ్రపరిచారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ప్రజలంతా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ‘స్వచ్ఛతా హి సేవా 2024’ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ గాంధీజీ కలలుగన్న భారత దేశాన్ని అందరం కలిసి సాకారం చేద్దామన్నారు. అందుకు ఈరోజు మనకు ఈ స్ఫూర్తిని అందిస్తుందన్నారు. నేటితో స్వచ్ఛ భారత్ మిషన్ ప్రయాణం 10 సంవత్సరాల మైలురాయిని చేరుకుందని ప్రధాని పేర్కొన్నారు.గత పక్షం రోజుల్లో దేశవ్యాప్తంగా కోట్లాది మంది ‘స్వచ్ఛతా హి సేవా’ కార్యక్రమాల్లో పాల్గొన్నారన్నారు. నిరంతర కృషితోనే మన భారతదేశాన్ని పరిశుభ్రంగా మార్చుకోగలం. ఈ రోజున పరిశుభ్రతకు సంబంధించిన సుమారు 10 వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు కూడా ప్రారంభమయ్యాయన్నారు. మిషన్ అమృత్ కింద దేశంలోని పలు నగరాల్లో మురుగునీటి శుద్ధి ప్లాంట్లు నిర్మించనున్నామన్నారు. ఇది స్వచ్ఛ భారత్ మిషన్‌ను మరో మైలురాయి దాటిస్తుందన్నారు.ఇది కూడా చదవండి: మహాత్మా గాంధీకి ప్రధాని మోదీ నివాళులు -
ఆకలి కేకలు
విజయనగరం :నింగిని తాకే ధరలతో నిత్యం బతుకు పోరాటం చేయాల్సిన రోజులివి. జీతం ఒకటి.. రెండ్రోజులు ఆలస్యమైతే విలవిల్లాడిపోతారు. మరి ఆరు నెలలుగా జీతాలకు నోచకపోతే ఏం తినాలి.. ఎలా బతకాలి.. ఐసీడీఎస్ శాఖ నిర్వహిస్తున్న పోషణ్ అభియాన్ కార్యక్రమంలో పనిచేస్తున్న బ్లాక్ ప్రాజెక్టు అసిస్టెంట్ల దీనావస్థ ఇది. ఐసీడీఎస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోషణ్ అభియాన్ కార్యక్రమంలో బ్లాక్ ప్రాజెక్టు అసిస్టెంట్లు పనిచేస్తున్నారు. జిల్లాలో 17 ప్రాజెక్టుల్లో 16 మంది పని చేస్తున్నారు. ఒక పోస్టు ఖాళీగా ఉంది. ఐసీడీఎస్ పీడీ కార్యాలయంలో ఒక బ్లాక్ ప్రాజెక్టు అసిస్టెంట్ పనిచేస్తున్నారు. వీరిలో 9 మందికి గత ఏడాది జూలై నెల నుంచి జీతాలు అందలేదు. జిల్లాలో ఐసీడీఎస్ ప్రాజెక్టులు గంట్యాడ, వియ్యంపేట, ఎస్.కోట, నెల్లిమర్ల, భద్రగిరి, కురుపాం, పార్వతీపురం, సాలురు రూరల్, సాలురు అర్బన్, బొబ్బిలి రూరల్, బొబ్బిలి అర్బన్, బాడంగి, భోగాపురం, విజయనగరం అర్బన్, చీపురుపల్లి, పాచిపెంట, గజపతినగరం ప్రాజెక్టులున్నాయి. జిల్లా కేంద్రంలో ప్రాజెక్టు డైరెక్టర్ కార్యాలయం ఉంది. వీటిలో భద్రగిరి, కురుపాం, పార్వతీపురం, బొబ్బిలి రూరల్, పాచిపెంట, బాడంగి, భోగాపురం, నెల్లిమర్ల, విజయనగరం పీడీ కార్యాలయం బ్లాక్ ప్రాజెక్టు అసిస్టెంట్లు జూలై నెల నుంచి జీతాలు అందలేదు. పండగ రోజూ పస్తులు ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న బ్లాక్ ప్రాజెక్టు అసిస్టెంట్లకు నెలకు ఒక్కొక్కరికి జీతం రూ.15 వేలు, పీడీ కార్యాలయంలో పనిచేస్తున్న బ్లాక్ ప్రాజెక్టు అసిస్టెంట్‌కు నెలకు రూ.18 వేలు ఇస్తున్నారు. ఆరు నెలలుగా జీతాలు లేకపోవడంతో కుటుంబ పోషణ కూడా ఇబ్బందిగా ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లల స్కూలు ఫీజులు కట్టడానికి అప్పులు చేస్తున్నామని వాపోతున్నారు. బ్లాక్ ప్రాజెక్టు అసిస్టెంట్ పనిచేసే పోషణ అభియాన్ కార్యక్రమంలో ఇటీవల జాతీయ స్థాయి అవార్డు కూడా వచ్చింది. అయినప్పటికీ వీరికి మాత్రం జీతాలు అందలేదు. బ్లాక్ అసిస్టెంట్ల విధులు ప్రాజెక్టు కార్యాలయాల్లో రిపోర్టులు రాయడం, ఆన్లైన్లో వివరాలు నమోదు చేయడం, సీమంతాలు, అన్న ప్రాశన తదితర కార్యక్రమాల్లో పాల్గొనాలి. గర్భిణులు తీసుకోవలసిన ఆహారం, జాగ్రత్తలను వివరించాలి. కలెక్టర్‌కు నివేదన కొనసాగింపు ఉత్తర్వులు రాకపోవడం వల్ల వారికి జీతాలు రాలేదు. మిగిలిన చోట్ల ఖజానా శాఖ అభ్యంతరాలు తెలపకపోవడం వల్ల జీతాలు చెల్లించారు. జీతాలు రాని వారికి కొనసాగింపు ఉత్తర్వుల కోసం కలెక్టర్‌కు ఫైల్ పెట్టాం.– శాంతకుమారి,ఏపీడీ, ఐసీడీఎస్ -
ఆశ్రమ పాఠశాలల్లో గిరిపోషణ
సాక్షి, హైదరాబాద్: గిరిపుత్రుల్లో పౌష్టికాహార లోపాల్ని అధిగమించేందుకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమమైన ‘పోషణ్ అభియాన్’పథకాన్ని మరింత విస్తృతం చేస్తూ ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకొస్తోంది. ప్రస్తుతం పోషణ్ అభియాన్ పథకాన్ని ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి జిల్లాల్లో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ద్వారా అమలు చేస్తున్నారు. ఈ మూడు జిల్లాల్లోని దాదాపు 15వేల మంది చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. అయితే ఈ సంఖ్య తక్కువగా ఉండడంతో పౌష్టికాహార లోపాల్ని అధిగమించడం కష్టమని భావించిన యంత్రాంగం... ఏజెన్సీలోని అన్ని ప్రాంతాల్లోనూ పౌష్టికాహారం పంపిణీ చేపట్టాలని భావించింది. గిరిపోషణ పేరిట చేపట్టే ఈ కొత్త కార్యక్రమానికి సంబంధించి ఆ శాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది. రాష్ట్రంలో మైదాన ప్రాంతాల్లో కంటే గిరిజన ప్రాంతాల్లోనే పౌష్టికాహారలోపం ఎక్కువగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీంతో ముందుగా గిరిపోషణ కార్యక్రమాన్ని ఏజెన్సీ ప్రాంతాల్లోనే అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆశ్రమ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలల్లో గిరిపోషణను అమలు చేయనున్నారు. ప్రస్తుతం ఆశ్రమ పాఠశాలల్లో పిల్లలకు పూర్తిస్థాయిలో వసతి, భోజన సౌకర్యాన్ని కల్పిస్తుండగా... ప్రభుత్వ పాఠశాలల్లో కేవలం మధ్యాహ్న భోజన పథకాన్నే అమలు చేస్తున్నారు. తాజాగా గిరిపోషణతో ఆయా విద్యార్థులకు అదనంగా చిరుతిళ్లను అందిస్తారు. చిరుతిళ్ల కింద తేనె, పల్లీపట్టి, బిస్కట్లు, చాక్లెట్లు, చిరుధాన్యాలతో చేసిన ఆహార పదార్థాలను ఇవ్వనున్నారు. జీసీసీ ఉత్పత్తులే... గిరిపోషణ ద్వారా పంపిణీ చేసే పదార్థాలన్నీ సహజసిద్ధంగా ఉండాలని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం గిరిజన సంక్షేమ శాఖలో భాగంగా ఉన్న గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ (జీసీసీ) పలు రకాల ఉత్పత్తులు చేస్తోంది. ఇందుకు సంబంధించి తయారీ యూనిట్లు సైతం ఉన్నాయి. దీంతో గిరిజన విద్యార్థులకు పంపిణీ చేసే పౌష్టికాహారమంతా జీసీసీ ద్వారా సరఫరా చేయాలని యంత్రాంగం భావిస్తోంది. గురుకుల పాఠశాలల్లోని విద్యార్థులకు సబ్బులు, డిటర్జెంట్లు, షాంపూలను జీసీసీ విజయవంతంగా సరఫరా చేస్తోంది. మరోవైపు ఆహార ఉత్పత్తులు, తృణ ధాన్యాలతో కూడిన పదార్థాలను కూడా తయారు చేస్తుండడంతో గిరిపోషణ బాధ్యతలను జీసీసీకి ఇవ్వనుంది. -
సర్వశిక్షా అభియాన్ నిధులు విడుదల చేయాలి
నల్లగొండ టూటౌన్: రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం సర్వశిక్షా అభియాన్, రాష్ట్రీయ మాధ్యమిక విద్య నిధులు విడుదల చేయలేదని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎ. నర్సిరెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక యూటీఎప్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 60 శాతం నిధులు విడుదల చేసిందని, రాష్ట్రం నుంచి 40 శాతం విడుదల చేయాల్సి ఉండగా నేటికి విడుదల చేయకపోవడంతో కేంద్రం నుంచి రావల్సిన రూ.1830 కోట్లు ఆగిపోయాయని తెలిపారు. ప్రభుత్వం నిధులను త్వరగా విడుదల చేసి అవసరమైన పాఠశాలలకు ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. కంప్యూటర్ విద్యకు నిధులు అదనంగా విడుదల చేయాలని కోరారు. జిల్లాలో 700 ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెట్టారని, ఆయా పాఠశాలలు అస్తవ్యస్తంగా ఉన్నాయని తెలిపారు. వచ్చే విద్యాసంవత్సరం కేజీ నుంచి ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టేందుకు ఇప్పటి నుంచే ప్రణాళిక రూపొందించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్ కోసం ప్రత్యేకాధికారిని నియమించాలని కోరారు. మధ్యాహ్నాం భోజన ఏజన్సీలకు పారితోషికం పెంచాలని, విద్యార్థులకు మెస్ చార్జీలను పెంచాలని హైస్కూల్ విద్యార్థులకు రూ.12, ప్రాథమిక విద్యార్థులకు రూ.10లకు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సీహెచ్. రాములు, జిల్లా అధ్యక్షుడు ఎం. రాజశేఖర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎడ్ల సైదులు, వెంకటేశం, ఎం. యాదయ సైదులు, శ్రీనివాసాచారి, అనిల్, మురళయ్య, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
మెగా లోక్‌అదాలత్ సాక్షరత రథయాత్ర ప్రారంభం
రాయచూరు, న్యూస్‌లైన్ : నగరంలో మెగా లోక్ అదాలత్ న్యాయసేవా సాక్షరత రథయాత్రను ఆదివారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవ ప్రాధికారం అధ్యక్షుడు,జిల్లా జడ్జి పీ.కృష్ణభట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కడికక్కడే తమ కేసులను పరిష్కరించుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దేశ వ్యాప్తంగా లోక్ అదాలత్ జరుగుతోందన్నారు. న్యాయమూర్తులు, సిబ్బంది కొరత కారణంగా పెండింగ్‌లో ఉన్న ఎన్నో కేసులు పరిష్కారానికి నోచుకోవడం హర్షనీయమన్నారు. జిల్లాలో 35 శాతం ప్రజలు వెనుకబడిన వర్గాలకు చెందిన వారేనని, నిరుపేదలైన వీరికి చట్టంపై అవగాహన కల్పించడం చాలా అవసరమన్నారు. న్యాయం, చట్ట పరిజ్ఞానాన్ని అందించేందుకు ఈజాతాను ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే లింగసూగూరు, దేవదుర్గలలో అభియాన్ పూర్తయింది. ప్రస్తుతం రాయచూరులో ప్రారంభమైందని, జిల్లాలో 15 రోజుల పాటు అభియాన్ కొనసాగుతుందన్నారు. చట్ట పరిజ్ఞానం ఉంటే వివిధ సమస్యలను పరిష్కరించుకునేందుకు అవకాశం కలుగుతుందన్నారు. అస్కిహాళ్, గోనాళ్, యక్లాసపూర్లో ఆదివారం రథయాత్ర జరిగింది. జిల్లా సెషన్స్ న్యాయమూర్తి సతీష్‌సింగ్, న్యాయమూర్తి మహ్మద్ ముజాయిద్ ఉల్లా, అదనపు న్యాయమూర్తి సత్యనారాయణచార్, ప్రభుత్వ న్యాయవాది రాఘవేంద్ర, జిల్లా న్యాయాధీశుల సంఘం అధ్యక్ష, కార్యధ్యక్షులు భానుజ్, ప్రభుదేవ్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.