శశిథరూర్ (ఫైల్ ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ : భారత తొలి హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ విగ్రహంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్‌నేత శశిథరూర్ పలు వ్యాఖ్యలు చేశారు. జాతిపిత మహాత్మా గాంధీకి దేశంలో ఎక్కాడా అంతపెద్ద విగ్రహం లేదని.. గాంధీకి కట్టని విగ్రహం పటేల్‌కు ఎందుకు కట్టారని కేంద్రాన్ని ఆయన ప్రశ్నించారు. బుధవారం ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యాలు చేశారు. పటేల్ చాలా సాధారణమైన వ్యక్తని.. గాందేయవాదైన పటేల్‌కు గంభీరమైన రూపంగల విగ్రహాన్ని నిర్మించడం సబబేనా అన్నారు. గాంధీకి పటేల్ శిష్యుడు వంటివాడని.. శిష్యుడికి 182 మీటర్ల విగ్రహం ఎందుకని థరూర్ ప్రశ్నించారు.
గాంధీ పెద్ద విగ్రహం పార్లమెంట్‌లోనే ఉందని.. గురువుని కాదని శిశ్యుడికి అతిపెద్ద విగ్రహం నిర్మించడం సరికాదని అన్నారు. పటేల్ తన జీవితకాలమంతా గాంధీ సిద్దాంతాలతో, కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారని ఆయన గుర్తుచేశారు. బీజేపీ కావాలనే పటేల్‌ను వారి నాయకుడిగా వర్ణించుకుంటున్నారని మండిపడ్డారు. కాగా సర్దార్ వల్లభ్‌భాయ్ అతిపెద్ద విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఆవిష్కరించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment