అగర్తల: ఇటీవల రాజస్థాన్ ఎడ్యుకేషన్ బోర్డు తమ కరికులం నుంచి నెహ్రూకు సంబంధించిన పాఠ్యాంశాలను తొలగించిన విషయం మరువక ముందే ఇప్పుడు త్రిపుర బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (టీబీఎస్ఈ) మహాత్మా గాంధీ్కి సంబంధించిన పాఠ్యాంశాలను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. తోమ్మిదో తరగతి సెలబస్ లో గాంధీకి సంబంధించిన పాఠ్యాంశాన్ని తొలగిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. కమ్మూనిష్ట్ ప్రభత్వం ఉన్న ఈ రాష్ట్రంలో కారల్ మార్క్స్, అడాల్ఫ్ హిట్లర్, సోవియట్ , ప్రెంచ్ విప్లవాలు, క్రికెట్ పుట్టుక ఇంకా చాలా పాఠ్యాంశాలున్నాయి.
కానీ భారత జాతీయోధ్యమానికి సంబంధించిన విషయాలు లేవని త్రిపుర హిస్టరీ సొసైటీ మెంబర్ సంతోష్ షా తెలిపారు. దీనిపై స్పందించిన టీబీఎస్ఈ బోర్డు చైర్మన్ మిహిర్ దెబ్ తాము సీబీఎస్ఈ మార్గదర్శకాల ప్రకారమే పాఠ్యాంశాలను రూపొందించినట్టు తప్పులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాల్సిందిగా ఆయన కోరారు.