textbook
-
ఆ పుస్తకంలో నెహ్రూ ఫోటో తప్పించి సావర్కర్..
పనాజీ : పదో తరగతి సోషల్ బుక్‌లో మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఫోటో స్ధానంలో ఆరెస్సెస్ సహవ్యవస్ధాపకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు వినాయక్ సావర్కర్ ఫోటో ముద్రించడంపై ఎన్ఎస్యూఐ అభ్యంతరం తెలపడం గోవాలో వివాదానికి తెరలేచింది. పాఠ్యపుస్తకంలో పండిట్ నెహ్రూ ఫోటోను తొలగించి సావర్కర్ ఫోటోను చేర్చడం బాధాకరమని ఎన్ఎస్యూఐ గోవా చీఫ్ అహ్రజ్ ముల్లా ఆందోళన వ్యక్తం చేశారు. భారత్- ప్రజాస్వామిక రాజకీయాలు అనే పేరుతో పదోతరగతి సాంఘిక శాస్త్రం పుస్తకంలోని 68వ పేజీలో 1935లో మహారాష్ట్ర సేవాగ్రమ్ ఆశ్రమ్‌లో మహాత్మ గాంధీ, నెహ్రూ, మౌలానా ఆజాద్ ఉన్నప్పటి ఫోటోలున్నాయని, అయితే అదే పుస్తకం తర్వాతి ఎడిషన్‌లో నెహ్రూ ఫోటోను తొలగించి, ఆ స్ధానంలో సావర్కర్ ఫోటోను ముద్రించారని ఆయన చెప్పారు. స్వాతంత్ర్య పోరాటంలో కాంగ్రెస్ పాత్రను తొలగించి చరిత్రను మార్చే కుట్రలో భాగంగానే బీజేపీ ఇలా వ్యవహరిస్తోందని ఆరోపించారు. రేపు మహాత్మా గాంధీ ఫోటోను సైతం బీజేపీ తొలగించి 60 ఏళ్లలో కాంగ్రెస్ దేశానికి ఏం చేసిందని ప్రశ్నిస్తుందని అన్నారు. బీజేపీ ఎన్ని కుట్రలు పన్నినా చరిత్రను మార్చలేదని, స్వాతంత్ర్య సముపార్జనలో కాంగ్రెస్ పాత్రను చెరిపివేయలేదని స్పష్టం చేశారు. -
పాఠ్య పుస్తకం మరింత ప్రియం!
‘విక్రయించే’ పుస్తకాల ధరలపై జీఎస్టీ ప్రభావం రాష్ట్రంలో పాఠ్య పుస్తకాల ధరలపైనా జీఎస్టీ ప్రభావం పడుతోంది. వచ్చే విద్యా సంవత్సరం ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల కోసం అందుబాటులో ఉంచే ‘సేల్’ పాఠ్య పుస్తకాల ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. కాగితం, ఇంకు ధరలు, నిర్వహణ వ్యయం పెరిగాయంటూ పబ్లిషర్లు ఈ విద్యా సంవత్సరమే సేల్ పాఠ్య పుస్తకాల ధరలను 13 శాతం వరకు పెంచారు. తాజాగా జీఎస్టీ ప్రభావంతో వచ్చే ఏడాది కూడా ధరలు పెరగనున్నాయి. దాదాపు 1.8 కోట్ల పాఠ్య పుస్తకాలకు అవసరమైన కాగితం కొనుగోలుపై జీఎస్టీ ప్రభావం పడనుందని, దానివల్ల ధరలు పెంచక తప్పని పరిస్థితి ఉంటుందని విద్యాశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో 31 లక్షల మంది విద్యార్థులపై భారం పడనుంది. మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే దాదాపు 29 లక్షల మంది విద్యార్థు లకు అవసరమైన 1.65 కోట్ల పాఠ్య పుస్తకాలపైనా జీఎస్టీ ప్రభావం ఉంటుందా, ఉండదా? అన్న అంశంపైనా పరిశీలన జరుపుతు న్నారు. విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న పాఠ్య పుస్తకా లకు అవసరమైన కాగితంపై వ్యాట్ మినహాయింపు ఉందని.. తాజాగా జీఎస్టీ మినహాయింపు వచ్చే అవకాశముందని భావిస్తున్నారు. దీనిపై ప్రభుత్వంతో మాట్లాడాలని నిర్ణయించారు. – సాక్షి, హైదరాబాద్ ‘పెరుగుదల’పై కసరత్తు ప్రైవేటు స్కూళ్లలో విద్యార్థులకు అవసరమయ్యే పుస్తకాల కోసం పబ్లిషర్లు గతేడాది ఎన్ని టన్నుల కాగితాన్ని వినియోగించారు, జీఎస్టీకి ముందు ధరలు ఎలా ఉన్నాయి, జీఎస్టీ అమల్లోకి వచ్చాక ధరలు ఏ మేరకు పెరిగాయన్న అంశాలపై విద్యా శాఖ కసరత్తు చేస్తోంది. తద్వారా ధరల పెరుగుదల ఎలా ఉంటుందన్నది అంచనా వేయనుంది. అయితే మొత్తానికి సేల్ పాఠ్య పుస్తకాల ధరల పెరుగుదల తప్పకపోవచ్చని భావిస్తున్నారు. జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేయించండి: కమిషనర్ ప్రభుత్వ పాఠ్య పుస్తకాల ముద్రణాలయానికి జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేయించాలని పాఠశాల విద్యా కమిషనర్ కిషన్ ముద్రణాలయం అధికారులకు సూచించారు. కాగితంపై, ముద్రణపై ఎంతెంత జీఎస్టీ ఉంది, మినహాయింపులేమైనా ఉన్నాయా, భారం ఎంత ఉంటుందన్న అంశాలపై సమగ్ర వివరాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. వచ్చే విద్యా సంవత్సరానికి అవసరమైన పాఠ్య పుస్తకాల ముద్రణకు సంబంధించిన టెండర్ల ప్రక్రియపై సోమవారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కాగితంపై 18 శాతం, ముద్రణపై 5 శాతం జీఎస్టీ ఉందని అధికారులు ఈ సందర్భంగా వివరించారు. ఇప్పటివరకు ఉచిత పాఠ్య పుస్తకాలపై వ్యాట్ మినహాయింపు ఉందని.. జీఎస్టీ ఎలా ఉంటుందన్న విషయంపై కసరత్తు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర గేయం లేకుండానే పుస్తకాలు తెలంగాణ ఏర్పడి మూడేళ్లు గడు స్తున్నా రాష్ట్ర గేయం ఏమిటన్నది ఇంకా పూర్తిస్థాయిలో ఖరారు కాలేదు. దాంతో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్న తెలుగు పాఠ్య పుస్తకాల్లో రాష్ట్ర గేయం లేకుండానే, రాష్ట్ర గేయం ఆలపించకుండానే పాఠ్యాంశాల బోధన కొనసాగుతోంది. 2014 జూన్ 2న రాష్ట్రం ఏర్పాటయ్యే నాటికి 2014–15 విద్యా సంవత్సరానికి అవసరమైన పాఠ్య పుస్తకాల ముద్రణ పూర్తయిపోయింది. దాంతో రాష్ట్ర గేయాన్ని మార్చలేదు. ఇక 2015–16కు అవసరమైన పాఠ్య పుస్తకాల ముద్రణ కోసం విద్యాశాఖ 2014 సెప్టెంబర్‌లోనే చర్యలు చేపట్టింది. కానీ రాష్ట్ర గేయం ఏమిటన్న సందిగ్ధం, ప్రభుత్వం కూడా త్వరగా ఏమీ తేల్చకపోవడంతో... అప్పటివరకు పాఠ్య పుస్తకాల్లో ఉన్న ఉమ్మడి రాష్ట్ర గేయాన్ని (మా తెలుగుతల్లికి మల్లెపూదండ..) మాత్రం తొలగించి పాఠ్య పుస్తకాలను ముద్రించింది. తర్వాత 2016–17 సంవత్స రానికి గాను 2015 సెప్టెంబర్‌లోనే కసరత్తు మొదలుపెట్టింది. రాష్ట్ర గేయం పై స్పష్టత కావాలని.. ‘జయజయహే తెలంగాణ.. జనని జయ కేతనం..’.. గేయాన్ని రాష్ట్ర గేయంగా ముద్రించాలా వద్దా అని ప్రభుత్వాన్ని కోరింది. అయినా సర్కారు స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుత (2017–18) విద్యా సంవ త్సరానికి పుస్తకాల ముద్రణపై 2016 డిసెంబర్ నాటికి కూడా స్పష్టత రాలేదు. అయినా ‘జయజయహే..’ గేయంలో 10 జిల్లాల ప్రస్తావనే ఉందని, ఇప్పుడు తెలంగాణలో 31 జిల్లాలు అయ్యాయని.. దీనిపై తరువాత నిర్ణయం తీసుకుందా మని పక్కన పెట్టారు. దీనిపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. వచ్చే విద్యా సంవత్సరానికి పుస్తకాల టెండర్ల ప్రక్రియపై ప్రస్తుతం విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఈసారైనా రాష్ట్ర గేయంపై స్పష్టత వస్తుందా, రాదా? అన్న సందేహం నెలకొంది. -
చిన్నారుల పుస్తకాల్లో అవి చూసి పేరెంట్స్ షాక్!
బీజింగ్: సెక్స్ ఎడ్యుకేషన్ విషయంలో చైనా చాలా కాలంగా విమర్శలు ఎదుర్కొంటుంది. విద్యార్థులకు లైంగిక విద్య పట్ల కనీస అవగాహన కల్పించడం లేదని చైనాపై విమర్శలున్నాయి. పాఠశాల సిలబస్ తదితర విద్యాకార్యక్రమాల్లో లైంగిక విద్యను ప్రవేశపెట్టాలని చాలా కాలంగా అక్కడ డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో బీజింగ్ నార్మల్ యూనివర్సిటీ.. సెక్స్ ఎడ్యుకేషన్‌తో కూడిన పాఠ్యపుస్తకాలను ఇటీవల రూపొందించింది. అయితే.. అందులో వాడిన గ్రాఫిక్స్ వివాదాస్పదం అయ్యాయి. బీజింగ్‌లోని 18 ఎలిమెంటరీ పాఠశాలల్లో 6 నుంచి 13 సంవత్సరాల మధ్య వయసు గల విద్యార్థులకు సెక్స్ ఎడ్యుకేషన్ బోధించడానికి ఈ పుస్తకాలను వాడుతున్నారు. అయితే.. బుక్స్ పరిశీలించిన తల్లిదండ్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పుస్తకాల్లోని గ్రాఫిక్స్ తమ పిల్లలను చెడగొట్టేలా ఉన్నాయని వారు వాపోతున్నారు. సెక్స్ ఎడ్యుకేషన్ అవసరమే గానీ.. అది విద్యార్థులకు అందించే విధానం మాత్రం ఇది కాదంటూ విమర్శిస్తున్నారు. పుస్తకాల్లోని విషయాలు చూడటానికే సిగ్గేస్తుందని ఓ విద్యార్థి తల్లి సోషల్ మీడియాలో వాపోయింది. కాగా.. అభ్యంతరాలపై స్పందించిన బీజింగ్ నార్మల్ యూనివర్సిటీ.. పాఠ్యపుస్తకాలను పలు దశలు పరిశీలించి.. విద్యార్థుల తల్లిదండ్రులతో చర్చించాకే రూపొందించామని చెబుతోంది. గతంలో యూనివర్సిటీ విద్యకు వెళ్లేంతవరకు సెక్స్ ఎడ్యుకేషన్ ఉండేది కాదని.. ఇది ఆహ్వనించదగిన పరిణామం అని సోషల్ మీడియాలో కొందరు సపోర్ట్ చేస్తున్నారు. -
గాంధీ పాఠ్యాంశాలు తొలగించిన త్రిపుర బోర్డు
అగర్తల: ఇటీవల రాజస్థాన్ ఎడ్యుకేషన్ బోర్డు తమ కరికులం నుంచి నెహ్రూకు సంబంధించిన పాఠ్యాంశాలను తొలగించిన విషయం మరువక ముందే ఇప్పుడు త్రిపుర బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (టీబీఎస్ఈ) మహాత్మా గాంధీ్కి సంబంధించిన పాఠ్యాంశాలను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. తోమ్మిదో తరగతి సెలబస్ లో గాంధీకి సంబంధించిన పాఠ్యాంశాన్ని తొలగిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. కమ్మూనిష్ట్ ప్రభత్వం ఉన్న ఈ రాష్ట్రంలో కారల్ మార్క్స్, అడాల్ఫ్ హిట్లర్, సోవియట్ , ప్రెంచ్ విప్లవాలు, క్రికెట్ పుట్టుక ఇంకా చాలా పాఠ్యాంశాలున్నాయి. కానీ భారత జాతీయోధ్యమానికి సంబంధించిన విషయాలు లేవని త్రిపుర హిస్టరీ సొసైటీ మెంబర్ సంతోష్ షా తెలిపారు. దీనిపై స్పందించిన టీబీఎస్ఈ బోర్డు చైర్మన్ మిహిర్ దెబ్ తాము సీబీఎస్ఈ మార్గదర్శకాల ప్రకారమే పాఠ్యాంశాలను రూపొందించినట్టు తప్పులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాల్సిందిగా ఆయన కోరారు. -
మహాత్మా గాంధీ,తిలక్ లు లౌకిక వాదానికి వ్యతిరేకులు
ముంబై: ఇటీవల రాజస్థాన్ లోని పాఠ్యపుస్తకాల్లో ప్రథమ ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ కు సంబంధించిన వివాదం ఇంకా మరచిపోకముందే మరో వివాదం మొదలైంది. ముంబై యూనివర్సిటీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లర్నింగ్ బుక్స్ లో ఉన్న అంశాలు మరోసారి వివాదాస్పదమయ్యాయి. నెహ్రూకు సంబంధించిన విషయాలను వదిలేశారు. మహాత్మా గాంధీ, బాలగంగాధర తిలక్ లను లౌకిక వాదానికి వ్యతిరేకమని పాఠ్య పుస్తకాల్లో ఉంది. యూనివర్సిటీకి చెందిన సివిక్స్, పాలిటిక్స్ డిపార్ట్ మెంట్ ఈ బుక్కును సంకలనం చేసింది. ఇటీవల రాజస్థాన్ లోని ఎనిమిదవ తరగతి పాఠ్యపుస్తకాల్లో జవహర్ లాల్ నెహ్రూకు సంబంధించి వివాదాస్పద అంశాలు ఉండంటం పట్ల కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. కాషాయీకరనలోభాగంగానే ఇదంతా జరుగుతుందని ఆరోపించింది. -
ఆత్మకథ కాదు...పాఠ్యగ్రంథం
ఆత్మకథలు అనేక రకాలు. కొన్ని కేవలం సంచలనం కోసం రాసేవి. మరికొన్ని భవిష్యత్తరాల్లో కూడా స్ఫూర్తినీ, దీప్తినీ నింపేవి. క్రీడాకారుల ఆత్మకథలు మనకు కొత్తేం కాదు. కపిల్, గవాస్కర్, గోపీచంద్... ఇలా అనేకమంది క్రీడాకారుల ఆత్మకథలు ఇప్పటికే మార్కెట్లో ఉన్నాయి. అయితే క్రికెట్ క్రీడాభిమానుల ఆరాథ్యదైవం సచిన్ టెండూల్కర్ ఆత్మకథ ‘ప్లేయింగ్ ఇట్ మై వే’ కోసం మాత్రం ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూసింది. గతంలో సచిన్‌పై అనేక పుస్తకాలు వచ్చాయి. రెండు దశాబ్దాలకు పైగా కెరీర్లో ఆయన తనకు తానై మీడియాకు ఎన్నో విషయాలు చెప్పాడు. ఇంకా సచిన్ గురించి అభిమానులకు తెలియనిదేమైనా ఉంటుందా? అయినా ఆయన ఆత్మకథపై అంత ఆసక్తి ఎందుకంటే... క్రికెట్ దేవుడి జీవితంలో మనకు తెలియని సంఘటనలు ఉన్నాయేమో తెలుసుకోవాలనే! పుస్తకాన్ని వివాదాస్పద అంశాలతో నింపడం...విడుదలకు ముందు వాటిని బయటపెట్టడం ఈమధ్యకాలంలో తరచుగా కనిపిస్తున్న మార్కెటింగ్ వ్యూహం. సచిన్ కూడా ఆ పనే చేశాడా? గ్రెగ్ చాపెల్ నిరంకుశత్వం గురించి పుస్తకం విడుదలకు ముందే వెల్లడించడం అందులో భాగమా? 24 ఏళ్ల కెరీర్లో ఏనాడూ వివాదాల జోలికి పోని మాస్టర్... తన పుస్తకం ప్రచారం కోసం ఓ కోచ్‌పై వ్యాఖ్యలు చేయాల్సిన పనిలేదు. సచిన్ పుస్తకం అనేక అంశాలను స్పృశించింది. ఆస్ట్రేలియాలో మంకీగేట్ వివాదం, దక్షిణాఫ్రికాలో బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు, ప్రపంచకప్‌లో విజయాలు, ఘోర పరాజయాలు... ఇలా అన్ని విషయాలపైనా ఏదో ఒక సమయంలో మీడియా ద్వారా తన అభిప్రాయాలను వెల్లడించాడు. అయితే మనసు లోపల దాచుకున్న, వివాదాలను దరి చేరనీయకూడదని భావించిన అంశాలను మాత్రం పుస్తకంలో ప్రస్తావించాడు. ముల్తాన్ టెస్టులో తాను డబుల్ సెంచరీకి చేరువైన సమయంలో కెప్టెన్ డిక్లేర్ చేయడం గురించి తొలిసారి మనసులో మాట బయటపెట్టాడు. ఆ రోజు తాను బాధపడ్డాడనే విషయం ఇప్పుడు చెప్పాడు. అలాగే కపిల్‌దేవ్ కోచ్‌గా పనికిరాలేదని చెప్పడానికి చాలా తెగువ ఉండాలి. సచిన్ ఆ తెగువనూ చూపాడు. నిజాల్ని నిర్భయంగా చెబితేనే అది నిజమైన ఆత్మకథ అవుతుంది. మ్యాచ్ ఫిక్సింగ్ గురించి సచిన్ ఏం చెబుతాడో అని కూడా క్రికెట్ వర్గాలు ఎదురుచూశాయి. కానీ దీని గురించి సచిన్ పెద్దగా స్పందించలేదు. బాధ్యతగల ఓ క్రికెటర్ 24 ఏళ్ల కెరీర్లో ఒక్క సంఘటన కూడా ఎదుర్కోలేదా అనే ప్రశ్న ఉత్పన్నమైంది. పుస్తకంలో దీనికి జవాబుంది. ‘నేను నేరుగా చూసిన విషయాలు, నాకు తెలిసిన విషయాలు మాత్రమే నేను మట్లాడతా. వేరే వాళ్లు చెప్పిన మాటల ఆధారంగా ఓ అభిప్రాయాన్ని ఎప్పుడూ ఏర్పరుచుకోను’ అని రాశాడు. ఈ పుస్తకంలో వివాదాల గురించి మాత్రమే చర్చ జరుగుతోందిగానీ... ఓ కుర్రాడు ముంబై వీధుల్లో చేసిన అల్లరి, ఆట కోసం పడ్డ కష్టం, ఓ తండ్రి ప్రోత్సాహం, ఓ అన్న మార్గనిర్దేశనం, ఓ గురువు క్రమశిక్షణ.. ఇలా అనేక అంశాలు పుస్తకంలో ఉన్నాయి. ఓ మధ్యతరగతి కుర్రాడు... ప్రపంచం ఆరాధించే వ్యక్తిగా మారడం వెనక దాగి ఉన్న కృషి, పట్టుదల ఉన్నాయి. ఒక వ్యక్తి వరుసగా రెండు రోజులపాటు జరిగిన రెండు శస్త్రచికిత్సల తర్వాత నెల రోజుల్లోనే కోలుకుని బ్యాట్ పట్టుకోవాలంటే ఎంత ఫిట్నెస్ ఉండాలో అంతకు మించిన మానసిక దృఢత్వం ఉండాలి. తండ్రి చనిపోయిన బాధను గుండెల్లో దాచుకుని కోట్లాది మందిని తన బ్యాటింగ్‌తో ఉర్రూతలూగించడానికి ఆత్మస్థైర్యం ఉండాలి. ఇవన్నీ రాత్రికి రాత్రే సచిన్‌కు రాలేదు. వీటన్నిటి గురించి మాస్టర్ ఈ పుస్తకంలో రాశాడు. ఊహ తెలిసినప్పటి నుంచి ఆటే జీవితంగా బతికిన వ్యక్తి... 41 ఏళ్ల వయసులో పాత జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుని చెప్పడం చాలా కష్టం. అందులోనూ ఏడాదిలో 300 రోజుల పాటు ప్రపంచాన్ని చుట్టే వ్యక్తికి ఇది చాలా కష్టం. అందుకే ఈ పుస్తకం కోసం మాస్టర్ మూడు సంవత్సరాలు తీసు కున్నాడు. తొలిసారి సైకిల్ ఎక్కినప్పుడు సచిన్ కిందపడి దెబ్బ తగిలించుకు న్నాడు. కానీ నెల రోజుల్లోనే తమ కాలనీలో అందరికంటే వేగంగా సైకిల్ తొక్కే కుర్రాడిగా పేరు తెచ్చుకున్నాడు. తనలోని పట్టుదల, పోరాటతత్వం పెరగడానికి చిన్నప్పుడు జరిగిన ఇలాంటి సంఘటనలే కారణం అని సచిన్ చెప్పాడు. మరి కెప్టెన్‌గా సచిన్ వైఫల్యానికి కారణాలేమిటి? ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెటర్‌గా పేరు తెచ్చుకున్న వ్యక్తి తన జట్టుకు అత్యుత్తమ నాయకుడు ఎందుకు కాలేకపోయాడు? ఆత్మకథలో ఇలాంటి ప్రశ్నలకూ జవాబుంది.ఎంచుకున్న వృత్తిలో అత్యున్నత శిఖరాలకు చేరాలంటే ప్రతి రోజూ నిత్య విద్యార్థిగా ఉండాలని ఆయన జీవితాన్ని చూస్తే అర్థమవుతుంది. తన కెరీర్ చివరి రోజుల్లో కూడా కొత్తగా వచ్చిన యువ ఆటగాళ్ల దగ్గర షాట్స్ నేర్చుకోవడం సచిన్ ఉన్నత వ్యక్తిత్వానికి నిదర్శనం. ఓ వ్యక్తి ఎదిగిన తర్వాత కూడా ఎంత హుందాగా మెలగాలో, దేశానికి ప్రాతినిధ్యం వహించే వ్యక్తి ఎంత బాధ్యతగా వ్యవహరించాలో ఈ పుస్తకం నేర్పుతుంది. విజయాలను మహాద్భుతమని పొగిడినా...వైఫల్యాలపై కటువుగా విమర్శించినా మాస్టర్ స్థితప్రజ్ఞతను ప్రదర్శించాడు. విజయాలను ఆస్వాదిం చినట్టే, వైఫల్యాలనుంచి గుణపాఠాలు నేర్చుకున్నాడు. దాదాపు రెండున్నర దశాబ్దాల పాటు దేశంలో క్రికెట్ అభిమానులకు ఆనందాన్ని పంచిన మాస్టర్... ఆ క్రమంలో తాను కోల్పోయిన వ్యక్తిగత జీవితం చాలా ఉంది. ఈ రోజు భారతరత్న స్థాయికి మాస్టర్ చేరడానికి తన కుటుంబం చేసిన త్యాగాలు, పడ్డ కష్టం ప్రతి వ్యక్తికీ స్ఫూర్తినిచ్చేవే. అందువల్లే ‘ప్లేయింగ్ ఇట్ మై వే’ యువతలో స్ఫూర్తిని పెంచే గ్రంథం. ఈ తరం క్రికెటర్లకూ... ఆ మాటకొస్తే ఏ రంగంలో పనిచేసేవారికైనా సచిన్ ఆత్మకథ ఓ పాఠ్యగ్రంథంలాంటిది.