గాంధీ చూపిన మార్గంలో నడవాలి | to follow the gandhi | Sakshi
Sakshi News home page

గాంధీ చూపిన మార్గంలో నడవాలి

Published Sun, Oct 2 2016 11:25 PM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM

గాంధీ చూపిన మార్గంలో నడవాలి - Sakshi

గాంధీ చూపిన మార్గంలో నడవాలి

నల్లగొండ (నల్లగొండ రూరల్‌) : గాంధీ చూపిన మార్గంలో నడవడం ద్వారా చక్కటి సమాజం నిర్మితం అవుతుందని హైకోర్టు న్యాయమూర్తులు శివశంకర్‌రావు, రాజశేఖర్‌రెడ్డిలు అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా ఆదివారం స్థానిక కోర్టులో బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వారు గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసిన అనంతరం మాట్లాడారు. అహింస, సత్యమే గాంధీ ప్రధాన సూత్రాలన్నారు. న్యాయవాదులు నిరంతరం కొత్త కొత్త చట్టాలను అధ్యయనం చేస్తూ, న్యాయస్థానాల తీర్పులను పరిశీలిస్తూ నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. అంతకుముందు న్యాయశాఖ అభివృద్ధి భవనాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా జడ్జి కె.రాధారాణి, జేసీ సత్యనారాయణ, ఎస్పీ ఎన్‌.ప్రకాశ్‌రెడ్డి, న్యాయమూర్తులు శైలజాదేవి, సత్యనారాయణ, బార్‌అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు కల్లూరి యాదయ్యగౌడ్, కొండ శ్రీనివాస్, శ్రీనివాసులు, ఎన్‌.నర్సింహారెడ్డి, అమరేందర్‌రెడ్డి, పాదం శ్రీనివాస్, సంధ్యారాణి, బీమార్జున్‌రెడ్డి, లెనిన్‌బాబు పాల్గొన్నారు. 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement