
మహాత్ముడికి ఘన నివాళులు
న్యూఢిల్లీ: నేడు జాతిపిత మహాత్మా గాంధీ 147వ జయంతి. ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ నివాళులర్పించారు. అలాగే కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పలువురు కేంద్రమంత్రులు, కాంగ్రెస్ నాయకులు గాంధీ జయంతి సందర్భంగా రాజ్‌ఘాట్ వద్ద నివాళులర్పించారు.
నేడు మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, కేంద్రమంత్రులు, వివిధ పార్టీల నేతలు నివాళులర్పించారు.