గాంధీజీకి గవర్నర్, సీఎం నివాళులు
సాక్షి, హైదరాబాద్ : జాతిపిత మహాత్మాగాంధీకి గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఘనంగా నివాళులర్పించారు. గాంధీ జయంతి సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో బాపూ ఘాట్‌లోని సమాధి వద్ద పుష్పగుచ్చాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఆ తర్వాత టూరిజం శాఖ గాంధీ మెమోరియుల్ హాల్‌లో మహాత్ముని డాక్యుమెం ట్లు, పుస్తకాలు, ప్రచురణలను సందర్శించారు. అనంతరం వివిధ మత గురువులతో కలసి సర్వమత ప్రార్థనలు చేశారు.
మహాత్మునికి నివాళులర్పించిన వారిలో రాష్ట్ర శాసన సభ స్పీకర్ మధుసూదనాచారి, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, మండలిచైర్మన్ స్వామిగౌడ్, వుంత్రులు హరీ శ్వర్‌రావు, జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యద ర్శి రాజీవ్‌శర్మ, ఎంపీలు జితేందర్‌రెడ్డి, బండారు దత్తాత్రేయ, టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మ య్య, ఎమ్మెల్సీలు నేతి విద్యాసాగర్, కర్నె ప్రభాకర్, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, ప్రభుత్వ సలహాదారులు కె.వి.రమణాచారి, విద్యాసాగర్‌రావు, కాం గ్రెస్ నేతలు నాగేందర్, హనువుంతరావు, హైదరాబాద్ జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ ఎన్. శ్రీధర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్, ఏజేసీ సంజీవయ్య ,చింతల వెంకటేశ్వర్‌రెడ్డి ఉన్నారు.