
స్ఫూర్తిదాత మహాత్మాగాంధీ
న్యూఢిల్లీ: గాంధీజీపై తనకున్న అభిమానాన్ని అనేక సందర్భాల్లో ప్రస్తావించిన ఒబామా.. ఆదివారం రాజ్‌ఘాట్ వద్ద మహాత్ముడికి ఘనంగా నివాళులర్పించారు. గాంధీ ప్రపంచానికి లభించిన గొప్ప బహుమతి అని కొనియాడారు. గాంధీజీ సమాధి వద్ద పుష్పగుచ్ఛం ఉంచి ముకుళిత హస్తాలతో కాసేపు మౌనం పాటించారు. ‘డాక్టర్ మార్టిన్ లూథర్‌కింగ్ జూనియర్ అన్న మాటలు అక్షర సత్యాలై నిలుస్తున్నాయి. గాంధీ స్ఫూర్తి భారత్‌లో నేటికీ సజీవంగా ఉంది. ఆ స్ఫూర్తి ప్రపంచానికి అపురూప కానుక. దానితో దేశాలు, ప్రజల మధ్య ప్రేమ విరాజిల్లాలని ఆశిస్తున్నా’ అని సందర్శకుల పుస్తకంలో రాశారు. రాజ్‌ఘాట్ వద్ద బోధి మొక్కను నాటారు. అక్కడి అధికారులు ఒబామాకు చరఖాను బహూకరించారు.