
డల్లాస్‌లో ఘనంగా యోగా దినోత్సవం
డల్లాస్: టెక్సాస్‌లో గల మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్(ఎమ్‌జీఎమ్‌ఎన్‌టీ) వద్ద మూడో అంతర్జాతీయ యోగా డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్‌జీఎమ్‌ఎన్‌టీ, కన్సూలెట్ జనరల్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. 300 మంది ఔత్సాహికులు యోగా డే వేడుకల్లో పాల్గొని ఆసనాలు వేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసుకున్న కార్యక్రమంలో రావు కల్వల మాట్లాడుతూ.. భారత్ ప్రధానమంత్రి నరేంద్రమోదీ యోగా డే ప్రపోజల్‌ను పెట్టిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. టెక్సాస్ స్టేట్ రిప్రజెంటేటివ్ మ్యాట్ రినాల్డి మాట్లాడుతూ.. అమెరికాలో అతి పెద్ద గాంధీ విగ్రహాన్ని నెలకొల్పడానికి డా.తోటకూర ప్రసాద్ చేసిన కృషిని కొనియాడారు.
ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. దాదాపు 5000 సంవత్సరాల క్రితం రిషీకేష్‌లో యోగా ప్రారంభమైందని తెలిపారు. మూడో అంతర్జాతీయ యోగా వేడుకలు గాంధీజి విగ్రహం ముందు జరుపుకోవడం శుభసూచకమని అన్నారు. గాంధీ ప్రతి రోజు మెడిటేషన్, యోగా సాధన చేసే వారని చెప్పారు.