డల్లాస్లో ఘనంగా యోగా డే | International Day of Yoga in Dallas | Sakshi
Sakshi News home page

డల్లాస్లో ఘనంగా యోగా డే

Published Sun, Jun 28 2015 7:27 PM | Last Updated on Mon, Oct 8 2018 7:53 PM

డల్లాస్లో ఘనంగా యోగా డే - Sakshi

డల్లాస్లో ఘనంగా యోగా డే

డల్లాస్: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం డల్లాస్లో తొలి అంతర్జాతీయ యోగా డేను ఘనంగా నిర్వహించారు. ఈ నెల 21న ఇర్వింగ్ సిటీ మహాత్మా గాంధీ మెమోరియల్, థామస్ జెఫర్సన్ పార్క్లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సహకారంతో మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (ఎంజీఎంఎన్టీ) ప్రాజెక్టు యోగా శిబిరాలను నిర్వహించింది.

యోగా శిబిరాల్లో ప్రవాసాంధ్రులు, ఇతర ఔత్సాహికులు 300 మందికిపైగా పాల్గొన్నారు. ఎంజీఎంఎన్టీ కార్యదర్శి రావు కాల్వల స్వాగతోపన్యాసం చేశారు. ప్రతి రోజు యోగా చేయడం వల్ల మానసిక ప్రశాంతత, శారీరక ఆరోగ్యం కలుగుతుందని మహాత్మా గాంధీ  మెమోరియల్ ప్రాజెక్టు చైర్మన్ డాక్టర్ తోటకూర ప్రసాద్ అన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ సభ్యులు యోగా వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు.  ఈ కార్యక్రమంలో ఎంజీఎంఎన్టీ బోర్డు డైరెక్టర్ షబ్నం మోడ్గిల్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ సభ్యులు రాజేష్ గుప్తా, శ్రీధర్, నిక్ ష్రాఫ్, అంకూర్ బోరా, దీప తదితరులు పాల్గొన్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement