
సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో గాంధీకి సంబంధించిన భూముల రికార్డులు పరిశీలిస్తున్న ఏసీబీ డీఎస్పీ శ్రీకృష్ణ గౌడ్
జంగారెడ్డిగూడెం:లేబర్ కోర్టు ప్రిసైడింగ్ అధికారి (జిల్లా జడ్జి హోదా) మల్లంపాటి గాంధీ ఆస్తులపై ఏసీబీ అధికారులు మంగళవారం జంగారెడ్డిగూడెంలో ఆరాతీశారు. స్థానిక సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చి గాంధీ, ఆయన బినామీల పేరున ఆస్తులు ఏమైనా ఉన్నాయా అనేది రికార్డులు తనిఖీ చేశారు. కొయ్యలగూడెం మండలం గవరవరంలో 4.50 ఎకరాలు, దిప్పకాయలపాడులో ఉన్న భూములకు సంబంధించి రికార్డులను పరిశీలించారు. జంగారెడ్డిగూడెంలో కూడా ఏమైనా ఆస్తులు ఉన్నయా, ఆయన బినామీలు ఎవరైనా ఉన్నారా అనేది ఆరా తీస్తున్నారు. ఏసీబీ డీఎస్పీ బి.శ్రీకృష్ణగౌడ్, సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment