![Marshal movie Audio launch by ysrcp mla Ambati Rambabu - Sakshi](/styles/webp/s3/article_images/2019/08/27/Marshal.jpg.webp?itok=LRYt4y86)
శ్రీకాంత్, అభయ్ అడకా
‘‘అభయ్ కథానాయకుడిగా నటించి, నిర్మించిన చిత్రం ‘మార్షల్’. తన జన్మస్థలమైన గుంటూరులోనే ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ వేడుక జరపడం ఎంతో సంతోషం. ఈ సినిమా ఘన విజయం సాధించాలి’’ అని ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. అభయ్ అడకా, మేఘా చౌదరి జంటగా నటించిన చిత్రం ‘మార్షల్’. హీరో శ్రీకాంత్ ముఖ్య పాత్రలో నటించారు. జై రాజాసింగ్ దర్శకత్వం వహించారు. అభయ్ హీరోగా నటించి, నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 19న విడుదలకానుంది.
ఈ చిత్రం ఆడియో, టీజర్‌ని గుంటూరులో విడుదల చేశారు. అభయ్ అడకా మాట్లాడుతూ– ‘‘నేను పుట్టి, పెరిగిన గుంటూరులో నా తొలి చిత్రం ఆడియో ఫంక్షన్‌ను ఇంత మంది పెద్దల సమక్షంలో చేయడం ఆనందంగా ఉంది. ఇదో వైవిధ్యభరితమైన చిత్రం. సమాజానికి ఓ మంచి సందేశం ఇవ్వబోతున్నాం’’ అన్నారు. ‘‘మా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది.
మా సినిమా కథ నచ్చడంతో ‘కేజీఎఫ్’ మ్యూజిక్ డైరెక్టర్ రవిబసురి మా సినిమాకి రీ రికార్డింగ్‌తో పాటు 2 పాటలకు స్వరాలు సమకూర్చారు’’ అని జై రాజాసింగ్ అన్నారు. శ్రీకాంత్, షేక్ మహమ్మద్ ముస్తఫా, మద్దాలి గిరి, వైఎస్‌ఆర్‌సీపీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు అప్పిరెడ్డి, పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త చంద్రగిరి ఏసురత్నం, నిర్మాత వెంకటేశ్వర రావు, మేఘనా చౌదరి, సంగీత దర్శకుడు యాదగిరి తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఆర్.యం.స్వామి.
Comments
Please login to add a commentAdd a comment