
సంగీత, శ్రీకాంత్
శ్రీకాంత్ , సంగీత, జిషాన్ ఉస్మాన్ హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘తెలంగాణ దేవుడు’. వడత్యా హరీష్ దర్శకత్వంలో మహ్మద్ జాకీర్ ఉస్మాన్ నిర్మించారు. చిత్రీకరణ పూర్తయింది. హరీష్ మాట్లాడుతూ– ‘‘1969 నుండి 2014 వరకు తెలంగాణలో ప్రజలు పడుతున్న కష్టాలను తీర్చిన ఉద్యమ ధీరుడి చరిత్రే ‘తెలంగాణ దేవుడు’. కమర్షియల్ ఎలిమెంట్స్, ఎమోషన్స్‌తో అన్ని వర్గాలవారికీ నచ్చేలా చిత్రీకరించాం. ఈ చిత్రాన్ని నిర్మించడానికి ధైర్యం ఇచ్చిన మహ్మద్ జాకీర్‌గారికి కృతజ్ఞతలు’’ అన్నారు. ‘మాక్స్ ల్యాబ్’ సీఈవో మహ్మద్ ఇంతెహాజ్ అహ్మద్ మాట్లాడుతూ– ‘‘తెలంగాణ సాధించాక ఏర్పడిన పరిణామాలను మా చిత్రం ద్వారా తెలియజేశాం. ఈ నెలాఖరులో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్: మహ్మద్ ఖాన్.
Comments
Please login to add a commentAdd a comment