నందిపేట, న్యూస్‌లైన్ : మండలంలోని వెల్మల్ చైరస్తా వ ద్ద ఎన్నికల అధికారులు 10 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. వెల్మల్ గ్రా మంలోని దక్కన్ గ్రామీణ బ్యాంకు నుం చి 10 లక్షల నగదుతో సిబ్బంది రవీంద్ర జిల్లా కేంద్ర బ్యాంకుకు వెళుతున్నాడు. మార్గమధ్యలో ఎన్నికల అధికారులు తనఖీలు చేశారు. నగదుకు సంబంధిం చిన సరైన పత్రాలు లేవు. దీంతో అధికారులు నగదును స్వాధీనం చేసుకున్నా రు. అనంతరం ఆర్మూర్ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి గజ్జన్నకు న గదును ముట్టజెప్పారు. ఈ తనిఖీల్లో ఇ రిగేషన్ ఏఈ అనంతయ్య, రెవెన్యూ అధికారి రామకృష్ణ పాల్గొన్నారు.
ఎస్‌ఎన్‌ఏ రహదారిపై *2.78లక్షలు..
నిజాంసాగర్(పిట్లం) : పిట్లం మండల కేంద్రానికి సమీపంలో ఎస్‌ఎన్‌ఎ ప్రధాన రహదారిపై వాహనాల తనిఖీ చేపట్టిన ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు శనివారం * 2.78 లక్షల నగదును పట్టుకున్నారు. నాందేడ్ నుంచి హైదరాబాద్‌కు కారును వారు తనిఖీ చేశారు. వ్యాపారం నిమిత్తం కారులో తీసుకువెళ్తున్న నగదు అధికారులు పట్టుకున్నారు. తనిఖీలో స్థానిక డిప్యూటీ తహశీల్దార్ సాయాగౌడ్, హెడ్‌కానిస్టేబుల్ వెంక య్య, ఆర్‌ఐ క్రాంతికుమార్ ఉన్నారు.
రేకుల్‌పల్లి చౌరస్తాలో 1.55 లక్షలు..
సిరికొండ : మండలంలోని రేకుల్‌పల్లి చౌరస్తాలో నిర్వహించిన వాహనాల తనిఖీల్లో లభించిన *1.55 లక్షల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డిప్యూటీ తహశీల్దార్ విక్రం వాహనాలను తనిఖీ చేశారు. సికింద్రాబాద్‌కు చెందిన పైపుల వ్యాపారి టక్కరి విజయ్ తన కారులో భీమ్‌గల్ నుంచి సికింద్రాబాద్‌కు నగదును తరలిస్తుండగా పట్టుకున్నారు. తనిఖీల్లో లభించిన నగదును సీజ్ చేసినట్లు విక్రం తెలిపారు. నగదును జిల్లా అధికారులకు అప్పగించనున్నట్లు తెలిపారు. తనిఖీల్లో హెడ్ కానిస్టేబుల్ సత్యానందం, సునీల్ పాల్గొన్నారు.
నగర సమీపంలో 2 లక్షలు..
నిజామాబాద్‌క్రైం : ఎన్నికల నిబంధనల్లో భాగంగా వాహనాల తనిఖీల్లో 2 లక్షలు పట్టుకుని సీజ్ చేసినట్లు శనివారం నాల్గో టౌన్ ఎస్సై నరేశ్ తెలిపారు. కరీంనగర్ జిల్లా కోణారావుపేట్‌కు చెందిన ఎండీ బషీర్, ఎండీ అజీమ్ నిజామాబాద్ జిల్లా నవీపేటలో శనివారం జరిగే మేకల సంతకు 2 లక్షలు పెట్టుకుని బయలు దేరారు. వీరు నగర సమీపంలోని బోర్గాం(పి) బ్రిడ్జి వద్దకు రాగానే అక్కడ పోలీసులు ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద వాహనాలు తనిఖీలు చేశారు. తనిఖీలో డబ్బులు బయటపడ్డాయి. దీంతో వాటి లెక్కలను పోలీసులు అడిగారు. వారు లెక్కలు చూపకపోవటంతో డబ్బులను సీజ్ చేశామన్నారు.
ముమ్మరంగా వాహనాల తనిఖీలు.. భారీగా నగదు పట్టివేత
Published Sun, Mar 30 2014 2:37 AM | Last Updated on Tue, Aug 14 2018 4:44 PM
Advertisement