Deccan Grameen Bank
-
ముమ్మరంగా వాహనాల తనిఖీలు.. భారీగా నగదు పట్టివేత
నందిపేట, న్యూస్‌లైన్ : మండలంలోని వెల్మల్ చైరస్తా వ ద్ద ఎన్నికల అధికారులు 10 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. వెల్మల్ గ్రా మంలోని దక్కన్ గ్రామీణ బ్యాంకు నుం చి 10 లక్షల నగదుతో సిబ్బంది రవీంద్ర జిల్లా కేంద్ర బ్యాంకుకు వెళుతున్నాడు. మార్గమధ్యలో ఎన్నికల అధికారులు తనఖీలు చేశారు. నగదుకు సంబంధిం చిన సరైన పత్రాలు లేవు. దీంతో అధికారులు నగదును స్వాధీనం చేసుకున్నా రు. అనంతరం ఆర్మూర్ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి గజ్జన్నకు న గదును ముట్టజెప్పారు. ఈ తనిఖీల్లో ఇ రిగేషన్ ఏఈ అనంతయ్య, రెవెన్యూ అధికారి రామకృష్ణ పాల్గొన్నారు. ఎస్ఎన్ఏ రహదారిపై *2.78లక్షలు.. నిజాంసాగర్(పిట్లం) : పిట్లం మండల కేంద్రానికి సమీపంలో ఎస్ఎన్ఎ ప్రధాన రహదారిపై వాహనాల తనిఖీ చేపట్టిన ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు శనివారం * 2.78 లక్షల నగదును పట్టుకున్నారు. నాందేడ్ నుంచి హైదరాబాద్‌కు కారును వారు తనిఖీ చేశారు. వ్యాపారం నిమిత్తం కారులో తీసుకువెళ్తున్న నగదు అధికారులు పట్టుకున్నారు. తనిఖీలో స్థానిక డిప్యూటీ తహశీల్దార్ సాయాగౌడ్, హెడ్‌కానిస్టేబుల్ వెంక య్య, ఆర్ఐ క్రాంతికుమార్ ఉన్నారు. రేకుల్‌పల్లి చౌరస్తాలో 1.55 లక్షలు.. సిరికొండ : మండలంలోని రేకుల్‌పల్లి చౌరస్తాలో నిర్వహించిన వాహనాల తనిఖీల్లో లభించిన *1.55 లక్షల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డిప్యూటీ తహశీల్దార్ విక్రం వాహనాలను తనిఖీ చేశారు. సికింద్రాబాద్‌కు చెందిన పైపుల వ్యాపారి టక్కరి విజయ్ తన కారులో భీమ్‌గల్ నుంచి సికింద్రాబాద్‌కు నగదును తరలిస్తుండగా పట్టుకున్నారు. తనిఖీల్లో లభించిన నగదును సీజ్ చేసినట్లు విక్రం తెలిపారు. నగదును జిల్లా అధికారులకు అప్పగించనున్నట్లు తెలిపారు. తనిఖీల్లో హెడ్ కానిస్టేబుల్ సత్యానందం, సునీల్ పాల్గొన్నారు. నగర సమీపంలో 2 లక్షలు.. నిజామాబాద్క్రైం : ఎన్నికల నిబంధనల్లో భాగంగా వాహనాల తనిఖీల్లో 2 లక్షలు పట్టుకుని సీజ్ చేసినట్లు శనివారం నాల్గో టౌన్ ఎస్సై నరేశ్ తెలిపారు. కరీంనగర్ జిల్లా కోణారావుపేట్కు చెందిన ఎండీ బషీర్, ఎండీ అజీమ్ నిజామాబాద్ జిల్లా నవీపేటలో శనివారం జరిగే మేకల సంతకు 2 లక్షలు పెట్టుకుని బయలు దేరారు. వీరు నగర సమీపంలోని బోర్గాం(పి) బ్రిడ్జి వద్దకు రాగానే అక్కడ పోలీసులు ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద వాహనాలు తనిఖీలు చేశారు. తనిఖీలో డబ్బులు బయటపడ్డాయి. దీంతో వాటి లెక్కలను పోలీసులు అడిగారు. వారు లెక్కలు చూపకపోవటంతో డబ్బులను సీజ్ చేశామన్నారు. -
రుణ లక్ష్యాలను పూర్తి చేయండి
మంచిర్యాల రూరల్, న్యూస్‌లైన్ : ఇందిరా క్రాంతి పథం ద్వారా మహిళా సమాఖ్య సభ్యులకు అందిస్తున్న రుణాల లక్ష్యాలను మార్చి 15లోగా పూర్తి చేయాలని డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక దక్కన్ గ్రామీణ బ్యాంకు ఆవరణలో తూర్పు జిల్లాలోని 20 మండలాలకు చెందిన ఐకేపీ ఏరియా కో ఆర్డినేటర్లు, ఏపీఎంలు, 35 డీజీబీ మేనేజర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ ఈ ఏడాది అన్ని బ్యాంకుల ద్వారా బ్యాంకు లింకేజీ కోసం రూ.317కోట్లు అందించాలని లక్ష్యంగా నిర్ణయించగా.. ఇప్పటివరకు 165కోట్లు మాత్రమే మంజూరు చేశారని తెలిపారు. రుణాలు పొందిన గ్రూపు సభ్యులు ప్రతి నెల వాయిదాలు చెల్లించడం లేదని, ఆర్థికస్థోమత ఉండి డబ్బు కట్టని వారి నుంచి ఈ నెల 28లోగా వసూలు చేయాలని సూచించారు. డబ్బులు కట్టని వారిపై రెవెన్యూ రికవరీ యాక్టు కింద కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. మార్చి 15లోగా అర్హులకు రుణాలు అందించాలని, లక్ష్యం సాధించేందుకు ఐకేపీ సిబ్బంది, బ్యాంకు మేనేజర్లు కృషి చేయాలని తెలిపారు. దక్కన్ గ్రామీణ బ్యాంకు ద్వారా ఈ ఏడాది రూ.221.53 కోట్ల రుణాలు అందించాల్సి ఉండగా.. ఇప్పటికి రూ.117 కోట్లు అందించారని, మిగిలిన రుణాలు సకాలంలో ఇవ్వాలని కోరారు. సకాలంలో వాయిదాలు చెల్లించిన వారికి జీరో వడ్డీ వర్తిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీజీబీ ఆర్ఎం ఎం.రవీందర్‌రెడ్డి, వికలాంగుల సంక్షేమ సంఘం ఏడీ నారాయణరావు, ఎస్సీ కార్పొరేషన్ ఏడీ యాదయ్య, బ్యాంకు లింకేజీ డీపీఎం శోభారాణి, ఏడీ రామ్మోహన్, ఏరియా కోఆర్డినేటర్లు చంద్రకళ, రాజుభాయ్, రమేశ్, యశోద, రవి, ఏపీఎంలు పాల్గొన్నారు. -
దారుణం!
సాక్షి, నిజామాబాద్: పంట రుణాల మంజూరులో బ్యాంకర్లు తమ నైజాన్ని కొనసాగిస్తున్నారు. ఖరీఫ్‌లో అంతంత మాత్రం గానే రుణాలిచ్చిన బ్యాంకులు ఈ రబీలోనూ అదే తీరుగా వ్యవహరిస్తున్నాయి. రైతులు పంటలు సాగు చేసుకుని రెండు నెలలు దగ్గర పడుతున్నప్పటికీ బ్యాంకర్లు మాత్రం నిర్దేశిత లక్ష్యంలో కనీసం సగం మందికి కూడా అప్పులివ్వలేదు. అప్పు కోసం చెప్పులరిగేలా తిరగాల్సిన పరి స్థితి రైతన్నలకు ఎదురవుతోంది. ఈ రబీలో జిల్లా వ్యాప్తంగా రూ. 768.40 కోట్ల మేరకు రుణాలివ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు. కానీ నవంబర్ నెలాఖరు వరకు బ్యాంకులు కేవలం రూ. 312.58 కోట్లు మాత్రమే విది ల్చాయి. ఈ నెలలో కూడా నామమాత్రంగానే రుణ మంజూరు జరిగింది. మొత్తం మీద రబీ నిర్దేశిత లక్ష్యంలో ఇప్పటి వరకు కనీసం 50 శాతం కూడా రుణాలివ్వలేదు. జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశం శుక్రవారం స్థానిక ప్రగతిభవన్‌లో జరగనుంది.గతంలో జరిగిన జిల్లా స్థాయి సమావేశాల్లో పలువురు ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్ హెచ్చరించినా బ్యాంకర్ల తీరు మాత్రం మారడం లేదు. ఈసారి కూడా ప్రజాప్రతినిధులు బ్యాంకర్ల తీరుపై మండిపడే అవకాశాలున్నాయి. కీలక సమయంలో అప్పుపుట్టక.. సాధారణంగా పంటలు విత్తుకునే సమయంలోనే రైతులకు పెట్టుబడులు అవసరపడుతాయి. దుక్కిదున్నుకోవడానికి, విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లు, కూలీల ఖర్చులు ఇలా ఎకరానికి సుమారు రూ.పది వేల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. బ్యాంకర్లు మాత్రం ఈ కీలక సమయంలో అప్పులివ్వకపోవడంతో రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. దీంతో వడ్డీల భారం మీద పడి ఆర్థికసంక్షోభంలో కూరుకుపోతున్నపరిస్థితి ఏర్పడుతోంది. బ్యాంకర్లు మాత్రం రబీ రుణాల మం జూరుకు మార్చి వరకు గడువుందనే సాకుతో దాటవేత ధోరణిని అవలంభిస్తున్నారు. దీంతో రైతులు సంస్థేతర రుణ ఊబిలో కూరుకుపోతున్నారు. అన్ని బ్యాంకులదీ ఇదే తీరు.. జిల్లాలో 30 బ్యాంకులకు సంబంధించి 293 శాఖల ద్వారా పంట రుణాలు ఇవ్వాలని ఈ ఏడాది రుణ ప్రణాళిక నిర్దేశించారు. నవంబర్ నెలాఖరు నాటికి ఆయా బ్యాంకులు ఇచ్చిన రబీ రుణాల తీరును పరిశీలిస్తే.. 65 ఎస్బీహెచ్ శాఖల ద్వారా రూ.175.86 కోట్ల రుణాలివ్వాలని లక్ష్యంగా నిర్దేశిస్తే, ఈ బ్యాంకు కేవలం రూ. 73 కోట్లు మాత్రమే ఇవ్వగలిగింది. ఆంధ్రాబ్యాంకు రుణ మంజూరు అధ్వానంగా తయారైంది. 29 శాఖల ద్వారా రూ.130 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, రూ.49.68 కోట్లు మాత్రమే విదిల్చింది. 25 సిండికేట్ బ్యాంకు శాఖల ద్వారా రూ. 93.71 కోట్ల అప్పులివ్వాల్సి ఉండగా, రూ. 36 కోట్లు మాత్రమే ఇచ్చింది. ఎస్బీఐ 18 శాఖల ద్వారా రూ. 14.97 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, కేవలం రూ. 6.23 కోట్లతో సరిపెట్టింది. సహకార బ్యాంకుల తీరు ఇలాగే ఉంది. దక్కన్ గ్రామీణ బ్యాంక్, ఎన్డీసీసీబీ కలిపి 85 శాఖల ద్వారా రూ.282.67 కోట్లు రుణాలివ్వాలని లక్ష్యంగా పెట్టుకుంటే, కేవలం రూ.117.76 కోట్లు మాత్రమే ఇవ్వగలిగాయి. ఇక ప్రైవేటు సెక్టార్లో ఉన్న పది బ్యాంకుల తీరు మరీ దారుణంగా ఉంది. వీటికి నిర్దేశించిన నామమాత్ర లక్ష్యం మేరకు కూడా రుణాలివ్వలేదు. హెచ్డీఎఫ్సీ, ఇంగ్వైశ్య, ఐసీఐసీఐ, యాక్సిస్, ధనలక్ష్మి, కరూర్‌వైశ్య, సిటీయూనియన్, కర్నాటక బ్యాంకులకు చెందిన 32 శాఖల ద్వారా రూ. 15.78 కోట్లు రుణాలివ్వాలని నిర్ణయించగా, కేవలం రూ. 6.52 కోట్లు మాత్రమే ఇచ్చాయి.