మంచిర్యాల రూరల్, న్యూస్‌లైన్ : ఇందిరా క్రాంతి పథం ద్వారా మహిళా సమాఖ్య సభ్యులకు అందిస్తున్న రుణాల లక్ష్యాలను మార్చి 15లోగా పూర్తి చేయాలని డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక దక్కన్ గ్రామీణ బ్యాంకు ఆవరణలో తూర్పు జిల్లాలోని 20 మండలాలకు చెందిన ఐకేపీ ఏరియా కో ఆర్డినేటర్లు, ఏపీఎంలు, 35 డీజీబీ మేనేజర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ ఈ ఏడాది అన్ని బ్యాంకుల ద్వారా బ్యాంకు లింకేజీ కోసం రూ.317కోట్లు అందించాలని లక్ష్యంగా నిర్ణయించగా.. ఇప్పటివరకు 165కోట్లు మాత్రమే మంజూరు చేశారని తెలిపారు.
రుణాలు పొందిన గ్రూపు సభ్యులు ప్రతి నెల వాయిదాలు చెల్లించడం లేదని, ఆర్థికస్థోమత ఉండి డబ్బు కట్టని వారి నుంచి ఈ నెల 28లోగా వసూలు చేయాలని సూచించారు. డబ్బులు కట్టని వారిపై రెవెన్యూ రికవరీ యాక్టు కింద కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. మార్చి 15లోగా అర్హులకు రుణాలు అందించాలని, లక్ష్యం సాధించేందుకు ఐకేపీ సిబ్బంది, బ్యాంకు మేనేజర్లు కృషి చేయాలని తెలిపారు. దక్కన్ గ్రామీణ బ్యాంకు ద్వారా ఈ ఏడాది రూ.221.53 కోట్ల రుణాలు అందించాల్సి ఉండగా.. ఇప్పటికి రూ.117 కోట్లు అందించారని, మిగిలిన రుణాలు సకాలంలో ఇవ్వాలని కోరారు. సకాలంలో వాయిదాలు చెల్లించిన వారికి జీరో వడ్డీ వర్తిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీజీబీ ఆర్‌ఎం ఎం.రవీందర్‌రెడ్డి, వికలాంగుల సంక్షేమ సంఘం ఏడీ నారాయణరావు, ఎస్సీ కార్పొరేషన్ ఏడీ యాదయ్య, బ్యాంకు లింకేజీ డీపీఎం శోభారాణి, ఏడీ రామ్మోహన్, ఏరియా కోఆర్డినేటర్లు చంద్రకళ, రాజుభాయ్, రమేశ్, యశోద, రవి, ఏపీఎంలు పాల్గొన్నారు.
రుణ లక్ష్యాలను పూర్తి చేయండి
Published Sat, Feb 22 2014 2:29 AM | Last Updated on Sat, Sep 2 2017 3:57 AM
Advertisement
Advertisement