కుషాయిగూడ: రంగారెడ్డి జిల్లా కుషాయిగూడలోని చర్లపల్లి సెంట్రల్ జైలులో ధూమపాన నిషేధాన్ని విధించారు. ఈ విషయాన్ని చర్లపల్లి జైలు పర్యవేక్షణాధికారి కొలను వెంకటేశ్వర్‌రెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ములాఖత్ ద్వారా ఖైదీలను కలిసేందుకు వచ్చే వారు ఇకముందు బీడీలు, సిగరెట్లు వెంట తీసుకురావడం పూర్తిగా నిషేధించినట్లు ఆయన పేర్కొన్నారు. నింబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు.