venkateswar reddy
-
సివిల్స్ కోచింగ్ కోసం వచ్చి.. జల్సాల మత్తులో ‘లక్ష్యం చెదిరింది’
సాక్షి, ఎంవీపీ కాలనీ(విశాఖ తూర్పు): ఉన్నత లక్ష్యంతో విశాఖ నగరానికి వచ్చిన ఆ యువతీ యువకుల కల జల్సాల మత్తులో కరిగిపోయింది. అడ్డదారుల వైపు అడుగుల వేయించి చివరికి ప్రాణం తీసుకునేలా చేసింది. ఈ ఘటనపై ఎంవీపీ కాలనీ, ఆరిలోవ పోలీసు స్టేషన్లలో కేసులు నమోదవ్వగా.. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరం జిల్లా తెర్లాం మండలం విజయరాంపురానికి చెందిన దళాయి దివ్య(22) గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అనంతరం విశాఖ వచ్చింది. సివిల్స్ కోచింగ్ కోసం ఎంవీపీ కాలనీలోని ఆర్సీ రెడ్డి కోచింగ్ సెంటర్లో చేరింది. కాలనీలోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ కోచింగ్‌కు వెళుతోంది. ఈ సమయంలో ఉమ్మడి కర్నూలు జిల్లా గంపాడు గ్రామానికి చెందిన ఎరువ వెంకటేశ్వరరెడ్డి ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. తొలుత స్నేహితులుగా వ్యవహరించిన వారి మధ్య ప్రేమ చిగురించింది. అప్పటికే జల్సాలకు అలవాటు పడిన వెంకటేశ్వరరెడ్డి ఊర్లోని, స్నేహితుల వద్ద పెద్ద ఎత్తున అప్పులు చేశారు. కుటుంబ సభ్యులు పట్టించుకోకపోవడంతో ఐదేళ్లుగా కోచింగ్ పేరుతో విశాఖలోనే ఉంటున్నాడు. అతని మాయమాటలు నమ్మిన దివ్య పూర్తిగా అతని ఊబిలో కూరుకుపోయింది. లక్ష్యాన్ని పక్కనపెట్టి జల్సాలకు అలవాటు పడింది. ఈ క్రమంలో కూతురిని ఉన్నతంగా చూడాలని కాంక్షిస్తున్న తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులను మోసగించింది. వివిధ అవసరాల పేరుతో వారి నుంచి భారీగా డబ్బులు తెచ్చి వెంకటేశ్వరరెడ్డితో జల్సాలు చేసింది. దీంతో పాటు స్నేహితులు, కుటుంబ సభ్యుల వద్ద అప్పులు చేసింది. ‘మిమ్మిల్ని తలదించుకునేలా చేశాను క్షమించండి’ వెంకటేశ్వరరెడ్డి మరికొంత డబ్బుల కోసం ఒత్తిడి తేవడంతో దివ్య తన మేనమామకు ఫోన్ చేసి రూ.లక్ష కావాలని కోరింది. అయితే అతనికి అనుమానం రావడంతో ఎందుకూ.. అవసరం ఏంటని ప్రశ్నించాడు. ఉదయం విశాఖ వచ్చి ఇస్తానని బదులిచ్చారు. దీంతో అప్పటికే తల్లిదండ్రులు, బంధువుల వద్ద అప్పులు చేసిన దివ్య తన వ్యవహారం బయట పడుతుందేమోనని ఆందోళనకు గురైంది. బుధవారం ఉదయం తన మేనమామ వస్తానని చెప్పడంతో తెల్లవారుజామున 3 గంటలకే హాస్టల్ నుంచి బయటకు వెళ్లిపోయింది. దీంతో పాటు తనకు వెంకటేశ్వరరెడ్డితో ఉన్న పరిచయం, అప్పుల వ్యవహారం అంతా లెటర్లో రాసి సూసైడ్ చేసుకోనున్నట్లు వెల్లడించి తన కజిన్‌తో పాటు తల్లిదండ్రులకు వాట్సప్ సందేశం పంపించింది. ‘కుటుంబ పరిస్థితి తెలిసి కూడా మిమ్మిల్ని తలదించుకునేలా చేశాను క్షమించండి’ అంటూ సూసైడ్ నోట్లో పేర్కొంది. చదవండి: (పెళ్లి చేయడం లేదని నాన్న, చిన్నాన్నల హత్య) మిస్సింగ్ కేసుతో వెలుగులోకి.. దివ్య రాసిన సూసైడ్ నోట్‌తో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు గురువారం ఎంవీపీ పోలీసు స్టేషన్లో మిస్సింగ్ కేసు పెట్టారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు గురువారం రుషికొండ తీరానికి ఓ గుర్తుతెలియని యువకుడి మృత దేహం కొట్టుకొచ్చిన అంశంపై దృష్టిసారించారు. దీనిపై గురువారం ఆరిలోవ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. దీంతో పోలీసుల దర్యాప్తులో ఆ మృతదేహాన్ని అతని స్నేహితులు గుర్తించడంతో పాటు దివ్యతో సాన్నిహిత్యం ఉన్న వెంకటేశ్వరరెడ్డిగా నిర్ధారించారు. దీంతో దివ్య, వెంకటేశ్వరరెడ్డిలు ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని భావించిన పోలీసులు గురువారం రాత్రి సాగరతీరంలో పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు పోలీసులు ఊహించినట్లుగానే దివ్య మృతదేహం శుక్రవారం ఉదయం భీమిలి పోలీసు స్టేషన్ పరిధిలోని తిమ్మాపురం సముద్రతీరానికి కొట్టుకొచ్చింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. అయితే తొలి నుంచి వెంకటేశ్వరరెడ్డికి జల్సాలు అలవాటు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అతని ప్రవర్తనతో కుటుంబ సభ్యులు విసిగిపోవడంతో పాటు అతని అప్పుల కారణంగా మూడెకరాలు పొలం కూడా అమ్మేసినట్లు తెలిపారు. దీంతో ఐదేళ్లుగా వెంకటేశ్వరరెడ్డి కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే వీరిద్దరూ కలిసి ఆత్మహత్య చేసుకున్నారా? లేక ఇద్దరి మధ్య ఇంకేదైనా ఘర్షణ జరిగి మత్స్యవాత పడ్డారా? అనే అనుమానం కుటుంబ సభ్యుల నుంచి వ్యక్తమవుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చేపలు పట్టిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే
-
మార్కెట్ పీఠం దక్కేదెవరికో?
సాక్షి, మదనాపురం: మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందోననే చర్చ సాగుతోంది. వర్తక, వ్యాపార కేంద్రంగా ఉన్న మదనాపురం మార్కెట్ కమిటీ చైర్మన్ పదివికి అధికార పార్టీలో పలువురు పోటీ పడుతున్నారు. ప్రధానంగా ఉమ్మడి జిల్లాలోనే మొదటిసారిగా 1946 అక్టోబర్ 1న ఇక్కడ మార్కెట్‌యార్డ్ ఏర్పడింది. మొదట్లో తహసీల్దార్‌కు బాధ్యతలు అప్పగించి ప్రారంభించారు. నాటి నుంచి నేటి వరకు ఈ యార్డుకు ఓ ప్రత్యేతక ఉంది. ఏడు నెలల కిందట ముగిసిన పదవీకాలం చెర్మెన్ పదవీకాలం 2018 ఆగస్టు 8న ముగిసింది. బీసీలకు రిజర్వేషన్ కావడంతో చాలామంది ఆశావహులు మార్కెట్ కమిటీ చెర్మెన్ పదవి కోసం పోటీపడుతున్నారు. కొత్తకోట మండలం నుంచి ముగ్గురు నాయకుల పేర్లు వినిపిస్తున్నాయి. స్వంత మండలానికే ఇవ్వాలనీ మదనాపురం అధికార పార్టీ నాయకులు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డికి సూచించినట్లు ఓ సీనియర్ కార్యకర్త తెలిపారు. వ్యాపార పరంగా అభివృద్ధి చెందడంతో చాలా మంది ఆశావాహులు పోటిలో ఉన్నారు. మదనాపురం నుంచి ఐదుగురు పదవిని ఆశిస్తున్నవారిలో ఉన్నారు. ఏడాదికి రూ.కోటి ఆదాయం ప్రతి ఏటా మార్కెట్ కమిటీ ద్వార ప్రభుత్వానికి కోటి రుపాయాల ఆదాయం వస్తోంది. వరిధాన్యం కొనుగోలు, కందులు, పల్లీల ద్వార ఈ ఆదాయం వస్తుంది. మదనాపురం, కొత్తకోట, అడ్డాకల్, మూసాపేట మండలాలకు చెందిన రైతులు ఇక్కడికి వస్తారు. రూ. 9 కోట్ల నాబార్డు నిధులతో కొత్తకోటలో 5వేల మెట్రికల్ టన్నుల బియ్యం నిల్వ చేసే గోదాం, మదనాపురంలో 10వేల మెట్రిక్ టన్నుల బియ్యం గోదాం నిర్మించారు. 305 ఎకరాల భూమి జిల్లాలో ఎక్కడ లేని విధంగా మదనాపురం, దంతనూరు, తిర్మాలయపల్లి శివార్లను కలుపుతూ మార్కెట్‌కు 305 ఎకరాల భూమిని అప్పట్లో కేటాయించారు. అయితే 50 ఎకరాలు కృషి విజ్ఞాన కేంద్రానికి, బీసీల నివాసా లకు 14 ఎకరాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం 2 ఎకరాలు, పశువైద్యం కేంద్రం ఒక్క ఎకరం, విద్యుత్ సబ్ స్టేషన్ ఎకరన్నర, జిల్లా పరిషత్ పాఠశాల రెండు ఎకరాలు, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ రూం ఇళ్లకూ మార్కెట్ స్థలం కేటాయించారు. మొత్తంగా ఆదాయం, ఆస్తులు కలిగిన ఈ కమిటీ చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందో పార్లమెంట్ ఎన్నికల కోడ్ ముగిశాకే తేలే పరిస్థితి కనిపిస్తోంది. -
కేంద్ర క్రీడల మంత్రిని కలిసిన శాట్స్ చైర్మన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ (శాట్స్) చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి మంగళవారం కేంద్ర కీడా శాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్‌ను కలిసి సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ నిర్మాణ ప్రతిపాదన పత్రాలు అందజేశారు. గ్రేటర్ నోయిడాలో నిర్వహించిన నేషనల్ యూత్ ఫెస్టివల్– 2018 ముగింపు కార్యక్రమం సందర్భంగా కేంద్ర మంత్రిని కలిసిన వెంకటేశ్వర్ రెడ్డి వరంగల్ (అర్బన్), సరూర్‌నగర్ స్టేడియాలలో సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ ఏర్పాటుకు నిధులు మం జూరు చేయాలని కోరారు. ‘ఖేలో ఇండియా’ కింద ఉస్మానియా వర్సిటీలో క్రీడా మౌలిక సదుపాయాలు కల్పించాలని విన్నవించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రిని తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ స్కూల్‌ను సందర్శించాలని కోరారు. -
చర్లపల్లి జైలులో ధూమపాన నిషేధం
కుషాయిగూడ: రంగారెడ్డి జిల్లా కుషాయిగూడలోని చర్లపల్లి సెంట్రల్ జైలులో ధూమపాన నిషేధాన్ని విధించారు. ఈ విషయాన్ని చర్లపల్లి జైలు పర్యవేక్షణాధికారి కొలను వెంకటేశ్వర్‌రెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ములాఖత్ ద్వారా ఖైదీలను కలిసేందుకు వచ్చే వారు ఇకముందు బీడీలు, సిగరెట్లు వెంట తీసుకురావడం పూర్తిగా నిషేధించినట్లు ఆయన పేర్కొన్నారు. నింబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. -
సమన్వయంతో పనిచేస్తేనే ‘మార్పు’
ఆదిలాబాద్ టౌన్, న్యూస్‌లైన్ : వివిధ శాఖల ఉద్యోగులు సమన్వయంతో పనిచేస్తేనే ‘మార్పు’ సాధ్యమని కలెక్టర్ అహ్మద్‌బాబు పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని టీటీడీసీలో మార్పు పథకం శిక్షణ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రసంగించారు. పథకాల అమలు ఉద్యోగుల జీతాల కోసం కాదని, ప్రజల అభివృద్ధి కోసమన్నారు. అధికారులు బాధ్యతయుతంగా పనిచేసి ప్రజల్లో మంచిపేరు తెచ్చుకోవాలని సూచించారు. ఉద్యోగులు ఇష్టారాజ్యంగా పనిచేయడంతో పథకాల అమలు నీరుగారిపోతోందన్నారు. అలసత్వం వీడి కలిసికట్టుగా పనిచేయాలని ఆదేశించారు. ఇందిరమ్మ అమృతహస్తం పథకం డీఆర్డీఏ, ఐసీడీఎస్ అధికారుల సమన్వయం లోపంతోనే సక్రమంగా అమలు కావడంలేదన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నెలకు 20 ప్రసవాలు జరగాల్సి ఉండగా ఒక్కటీ జరగకపోవడం మన డాక్టర్ల పనితీరును తెలియజేస్తుందన్నారు. ప్రజలకు ముందుగా ప్రైవేటు కంటే దీటుగా ప్రభుత్వ ఆస్పత్రులు ఉన్నాయనే భరోసా కల్పించాలన్నారు. ‘మార్పు’ లక్ష్యం మాతాశిశు మరణాలు తగ్గించడం, ప్రసవాలు ఆస్పత్రుల్లో జరిగేలా చూడటం, పిల్లల పెరుగుదల, పర్యవేక్షణ, రక్తహీనతను గుర్తించడం, ఆరోగ్యం, పోషక విలువలు, కుటుంబ నియంత్రణ చేయడమన్నారు. ప్రజలకు అవగాహన కల్పించడమే కాకుండా డీఆర్డీఏ, పంచాయత్‌రాజ్, ఐసీడీఎస్, వైద్యశాఖ ఉద్యోగులు కలిసికట్టుగా పనిచేసి విజయవంతంగా మార్పు తేవాలన్నారు. పనిచేయని వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. పనితీరుబాగున్న ఉద్యోగులకు ఇన్సెంటీవ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఎంఅండ్‌హెచ్‌వో బసవేశ్వరీ, అదనపు డీఎం అండ్‌హెచ్‌వో జలపతినాయక్, డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్‌రెడ్డి, ఐసీడీఎస్ పీడీ మీరాబెనర్జీ, మాస్ మీడియా అధికారులు విజయలక్ష్మి, శంకరయ్య పాల్గొన్నారు. -
విఠలాపురంలో ఇరువర్గాల ఘర్షణ
తాళ్లూరు, న్యూస్‌లైన్ : దారి విషయంలో తలెత్తిన వివాదం ఇరువర్గాల ఘర్షణకు దారి తీయడంతో 14 మంది గాయపడ్డారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో ఈ వివాదానికి రాజకీయ రంగు పులుముకుంది. ఈ సంఘటన మండలంలోని విఠలాపురంలో సోమవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. విఠలాపురం- రమణాలవారిపాలెం రోడ్డు అడ్డదారి యానాది బజారులో ఉన్న దిబ్బ విషయమై కొంతకాలంగా ఇరువార్గాల మధ్య వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో అంతర్గత రోడ్లకు మట్టి తోలుకోవాలని గ్రామస్తులు కొందరు నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా దిబ్బలను తొలగించాలని వాటి యజమానులైన కురిచేటి పిచ్చయ్య, ఆయన తమ్ముళ్లను కోరారు. తమకు ఒకరోజు సమయమిస్తే తొలగిస్తామని వారు చెప్పారు. ఇంతలో అంతర్గత రోడ్లకు మట్టి తోలుకుంటున్నారని గ్రామంలోని కొందరు స్థానిక కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. కార్యదర్శి సురేష్ వచ్చి ఎన్నికల సమయంలో మట్టి తోలుకోవద్దని గ్రామస్తులతో చెప్పారు. గ్రామంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని, రోడ్లపైనే దిబ్బలు ఉన్నా ఎందుకు తొలగించలేదని కొందరు మహిళలు కార్యదర్శిని ప్రశ్నించారు. రోడ్ల వెంబడి దిబ్బల తొలగింపునకు చర్యలు తీసుకుంటానని కార్యదర్శి హామీ ఇచ్చారు. ఇంతలో వివాదం చెలరేగి ఇరువర్గాలూ దాడికి దిగాయి. క్షణాల్లో పరిస్థితి అదుపు తప్పింది. దాడిలో ఇరువర్గాలకు చెందిన 14 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులు తాళ్లూరు, దర్శి వైద్యశాలల్లో చికిత్స పొందుతున్నారు. ఎస్సై శ్రీహరిరావు తన సిబ్బందితో అక్కడికి వచ్చి గ్రామంలో శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చారు. పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. వైఎస్సార్ సీపీ నాయకులపై పోలీసు జులుం విషయం తెలుసుకునేందుకు వచ్చిన విఠలాపురం కాలనీకి చెందిన వైఎస్సార్ సీపీ నాయకుడు వెంకటేశ్వరరెడ్డిపై పోలీసులు జులుం ప్రదర్శించారు. గ్రామ నాయకుడు పాలెం సుబ్బారెడ్డి, కొందరు మహిళల పట్ల ఖాకీలు దురుసుగా ప్రవర్తించారు. పోలీసుల తీరును వైఎస్సార్ సీపీ నాయకులు ఖండించారు. -
రుణ లక్ష్యాలను పూర్తి చేయండి
మంచిర్యాల రూరల్, న్యూస్‌లైన్ : ఇందిరా క్రాంతి పథం ద్వారా మహిళా సమాఖ్య సభ్యులకు అందిస్తున్న రుణాల లక్ష్యాలను మార్చి 15లోగా పూర్తి చేయాలని డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక దక్కన్ గ్రామీణ బ్యాంకు ఆవరణలో తూర్పు జిల్లాలోని 20 మండలాలకు చెందిన ఐకేపీ ఏరియా కో ఆర్డినేటర్లు, ఏపీఎంలు, 35 డీజీబీ మేనేజర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ ఈ ఏడాది అన్ని బ్యాంకుల ద్వారా బ్యాంకు లింకేజీ కోసం రూ.317కోట్లు అందించాలని లక్ష్యంగా నిర్ణయించగా.. ఇప్పటివరకు 165కోట్లు మాత్రమే మంజూరు చేశారని తెలిపారు. రుణాలు పొందిన గ్రూపు సభ్యులు ప్రతి నెల వాయిదాలు చెల్లించడం లేదని, ఆర్థికస్థోమత ఉండి డబ్బు కట్టని వారి నుంచి ఈ నెల 28లోగా వసూలు చేయాలని సూచించారు. డబ్బులు కట్టని వారిపై రెవెన్యూ రికవరీ యాక్టు కింద కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. మార్చి 15లోగా అర్హులకు రుణాలు అందించాలని, లక్ష్యం సాధించేందుకు ఐకేపీ సిబ్బంది, బ్యాంకు మేనేజర్లు కృషి చేయాలని తెలిపారు. దక్కన్ గ్రామీణ బ్యాంకు ద్వారా ఈ ఏడాది రూ.221.53 కోట్ల రుణాలు అందించాల్సి ఉండగా.. ఇప్పటికి రూ.117 కోట్లు అందించారని, మిగిలిన రుణాలు సకాలంలో ఇవ్వాలని కోరారు. సకాలంలో వాయిదాలు చెల్లించిన వారికి జీరో వడ్డీ వర్తిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీజీబీ ఆర్ఎం ఎం.రవీందర్‌రెడ్డి, వికలాంగుల సంక్షేమ సంఘం ఏడీ నారాయణరావు, ఎస్సీ కార్పొరేషన్ ఏడీ యాదయ్య, బ్యాంకు లింకేజీ డీపీఎం శోభారాణి, ఏడీ రామ్మోహన్, ఏరియా కోఆర్డినేటర్లు చంద్రకళ, రాజుభాయ్, రమేశ్, యశోద, రవి, ఏపీఎంలు పాల్గొన్నారు.