
మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్న కేవీపీ, రఘువీరారెడ్డి
వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమంలో కేవీపీ, రఘువీరా
సాక్షి, అమరావతి: రైతులకు రైతుగా.. కూలీలకు కూలీగా.. రోగులకు డాక్టర్‌గా మహానేత, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి పేదల హృదయాల్లో నిలిచిపోయారని రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు పేర్కొన్నారు. వైఎస్ 8వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి, కేవీపీ తదితర నేతలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం కేవీపీ మాట్లాడుతూ రెండు పూటలా గంజికి లేని కుటుంబాల్లో కూడా వైఎస్ కృషితో నేడు డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యారని గుర్తు చేశారు. రఘువీరా మాట్లాడుతూ రాజకీయంగా వైఎస్ అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నా గట్టిగా నిలబడ్డారని గుర్తు చేశారు. అనంతరం పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు.