హిందూపురం: అనంతపురం జిల్లా పర్యటన నిమిత్తం రాహుల్ గాంధీ శుక్రవారం ఉదయం చిలమత్తూరు చేరుకున్నారు. చిలమత్తూరు చెక్‌పోస్ట్ (కొడికొండ) వద్ద ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి ఏపీ పీసీసీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. బెంగళూరు నుంచి రోడ్డు మార్గంలో చిలమత్తూరు చెక్‌పోస్ట్‌కు రాహుల్ చేరుకోగా ఆయనకు పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, కేవీపీ రామచందర్‌రావు, సి.రామచంద్రయ్య, కనుమూరి బాపిరాజు తదితరులు పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు.
అనంతరం రాహుల్ ఓబులదేవు చెరువుకు బయల్దేరి వెళ్లారు. అక్కడ గతంలో ఇందిరాగాంధీ సభ జరిగిన ప్రదేశంలో రాహుల్ మొక్కలు నాటనున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాలకు పూల మాలలు వేసి పాదయాత్ర ప్రారంభిస్తారు. ఓబులదేవు చెరువు నుంచి కొండకమర్ల వరకు పది కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర ఉంటుంది.