ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకున్నట్లు ఏపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ ఎన్ రఘువీరారెడ్డి చెప్పారు. 13 జిల్లాలకు కొత్త ఇన్ చార్జీల నియామకం చేసినట్లు చెప్పారు.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకున్నట్లు ఏపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ ఎన్ రఘువీరారెడ్డి చెప్పారు. 13 జిల్లాలకు కొత్త ఇన్ చార్జీల నియామకం చేసినట్లు చెప్పారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ముగ్గురు చొప్పున 13 జిల్లాలలకు 39మందిని నియమించినట్లు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీకి ప్రజాసమస్యలే ఎజెండా అని జిల్లాలో పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసే లక్ష్యంతోపాటు ప్రజాసమస్యలపై రాజీ లేని పోరాటం చేస్తామని ఆయన ఆ ప్రకటనలో తెలిపారు. మరోపక్క, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విశాఖ జిల్లా చింతపల్లి పర్యటన ఆగస్టు 17కు వాయిదా పడినట్లు రఘువీరా రెడ్డి చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా బిల్లు ఆగస్టు 5న ఓటింగ్ కు వస్తున్న నేపథ్యంలో వాయిదా పడిందని చెప్పారు.