'ఫ్యాక్షనిజాన్ని మళ్లీ రెచ్చగొడుతున్నారు' | raghuveera reddy comments on chandrababu | Sakshi
Sakshi News home page

'ఫ్యాక్షనిజాన్ని మళ్లీ రెచ్చగొడుతున్నారు'

Published Thu, Aug 24 2017 3:54 PM | Last Updated on Tue, Sep 12 2017 12:56 AM

ఫ్యాక‌్షనిజాన్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నిస్తున్నాయని రఘువీరా రెడ్డి అన్నారు.

విజయవాడ: నంద్యాలలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రతపక్ష నేత జగన్‌ మోహన్‌ రెడ్డే కారణమని ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్‌. రఘువీరారెడ్డి విమర్శించారు. ఈ మేరకు ఆయన గురువారం ఏపీసీసీ రాష్ట్ర కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. సీమలో తగ్గుముఖం పడుతున్న ఫ్యాక్షనిజాన్ని తిరిగి రెచ్చగొట్టేలా ఇరు పార్టీలు వ్యవహరిస్తున్నాయన్నారు.
 
టీడీపీ, వైఎస్సార్సీపీ నేతలు బాహాబాహీకి దిగి కాల్పులు జరపడంతో ప్రశాంతంగా ఉన్న సీమ ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని తెలిపారు. నాయకులే ‘నరికేయండి’ అంటూ అరుస్తూ రెచ్చిపోతుంటే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి? ఫ్యాక‌్షనిజాన్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నిస్తున్నాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement