నోట్ల రద్దు వ్యవహారంపై కేంద్రం తీరు సర్కస్ కంపెనీని తలపిస్తోందని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి విమర్శించారు.
సాక్షి, హైదరాబాద్: నోట్ల రద్దు వ్యవహారంపై కేంద్రం తీరు సర్కస్ కంపెనీని తలపిస్తోందని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి విమర్శించారు. బుధవారం ఇందిరభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్రం రోజుకో మాట, పూటకో ఉత్తర్వు, గంటకో మార్పు, నిమిషానికో ప్రకటన చేస్తూ సర్కస్ పాలన సాగిస్తుందని ధ్వజమెత్తారు.
23న నిర్వహించే ‘చలో వెలగపూడి–ప్రశ్నిద్దాం రండి’అనే పేరుతో చేపట్టనున్న ప్రజా ధర్నాకు టీడీపీ, బీజేపీలు మినహా మిగిలిన అన్ని పార్టీలను ఆహ్వానించినట్లు తెలిపారు.