బాబు భేష్‌ అంటే.. వాళ్లు తుగ్లక్ అంటారా! | BJP slams TDPover demonetisation | Sakshi
Sakshi News home page

బాబు భేష్‌ అంటే.. వాళ్లు తుగ్లక్ అంటారా!

Published Sat, Dec 3 2016 6:41 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

BJP slams TDPover demonetisation

సాక్షి, అమరావతి: పెద్ద నోట్ల రద్దు వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ ద్వంద వైఖరి అవలంభిస్తూ ప్రజానికాన్ని తప్పుదోవ పట్టిస్తున్నదని ఏపీ బీజేపీ విమర్శించింది. పార్టీ యువమెర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు రమేష్‌నాయుడు శనివారం విజయవాడ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. మోదీ నిర్ణయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసిస్తూ, టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ ప్రధాన మంత్రిని తుగ్లక్‌తో పోల్చడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు.

చంద్రబాబే పార్టీ నేతలతో మిత్రపక్షంపైనా, మోదీపైనా విమర్శలు చేయిస్తున్నారన్న అనుమానాలు కలుగుతున్నాయని రమేశ్ వ్యాఖ్యానించారు. భాగస్వామ్య పార్టీగా ఉండి మిత్రపక్షంపై తప్పుడు ప్రచారం చేయడం ఆరోగ్య రాజకీయాలకు మంచిది కాదన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకముందు కాంట్రాక్టు లెక్చరర్లను, ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని రెగ్యులరైజ్ చేస్తామని ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలని రమేష్‌నాయుడు డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement