టీడీపీ, బీజేపీలకు డబ్బుపిచ్చి పట్టుకుందని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి విమర్శించారు.
కల్యాణదుర్గం: టీడీపీ, బీజేపీలకు డబ్బుపిచ్చి పట్టుకుందని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి విమర్శించారు. శనివారం అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ, బీజేపీ రెండూ దొందూ దొందేనన్నారు. ఈ రెండు పార్టీలు ప్రత్యేక హోదాపై ప్రధాని మోదీని నిలదీయలేకపోతున్నాయని విమర్శించారు. 2019లో ఏపీలో తామే అధికారంలోకి వస్తామని జోస్యం చెప్పారు.