కర్నూలు: తెలుగుదేశం, బీజేపీ పార్టీలు రెండూ కవల పిల్లలని ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి విమర్శించారు. ఈ రెండు పార్టీలకు పెద్దగా తేడాలేదని... దొందూ దొందేనని వ్యాఖ్యానించారు. కేవలం బీజేపీ మెప్పు పొందేం దుకే టీడీపీ ఒక్క ముస్లిం మైనార్టీకి కూడా మంత్రి పదవి ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. రాజీవ్‌గాంధీ 24వ వర్థంతి సందర్భంగా గురువారం కర్నూలులో మైనార్టీల సమస్యలపై నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొన్నారు.