
'మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు ఇవ్వాలి'
ఒక్కొక్కరికి రూ. 25 లక్షల పరిహారం ఇవ్వాలని పీసీసీ అధ్యక్షులు ఎన్.రఘువీరెడ్డి కోరారు.
ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ఆయన సానుభూతిని తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్సను అందించాలన్నారు. క్షతగాత్రులకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ప్రభుత్వ సాయం అందించాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి రఘవీరా సూచించారు. కృష్ణాజిల్లాలో దివాకర్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడిన ఘటనలో 11 మంది మృతి చెందగా.. మరో 20 మందికి పైగా గాయాలైన విషయం తెలిసిందే.