‘మైనార్టీ మంత్రి లేని కేబినెట్ చంద్రబాబుదే’
Published Fri, Jun 23 2017 7:41 PM | Last Updated on Tue, Sep 5 2017 2:18 PM
విజయవాడ: నగరంలోని ఆంధ్రరత్న భవన్‌లో ముస్లిం సోదరులకు కాంగ్రెస్ పార్టీ ఇఫ్తార్ విందు ఇచ్చింది. ఇఫ్తార్ కార్యక్రమంలో పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, పార్టీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘువీరా మాట్లాడుతూ రాష్ట్రంలో రాజ్యాంగానికి విరుద్ధంగా పాలన జరుగుతోందని, కేబినెట్‌లో మైనారిటీ మంత్రి కూడా లేకపోవడం దారుణమని అన్నారు. దేశ చరిత్రలో మైనార్టీ మంత్రి లేని కేబినెట్ ఆంధ్రపద్రేశ్ ప్రభుత్వమేనన్నారు. చంద్రబాబు మైనార్టీలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని, రాష్ట్రంలో మైనార్టీలను రెండవశ్రేణి వారిలా చూస్తున్నారని విమర్శించారు.
Advertisement
Advertisement