Iftar
-
శిథిలాల మధ్యే ఇఫ్తార్
ఖాన్ యూనిస్: ఏడాదికి పైగా సాగుతున్న యుద్ధం నేపథ్యంలో ఎటు చూసినా శిథిలాల నడుమే గాజావాసులకు రంజాన్ పవిత్ర మాసం మొదలైంది. చాలామంది ఆత్మియులను కోల్పోయారు. ఇళ్లు లేవు. సరైన తిండి లేదు. బతకుపై భరోసాయే లేదు. అయినా వారిలో ఆశ మాత్రం ఉంది.సగం కూలిన ఇళ్లలో, తాత్కాలిక గుడారాల్లోనే రంజాన్(Ramadan)ఉపవాసాలు పాటిస్తున్నారు. ఎన్నటికీ తిరిగిరాని తమ ఆత్మియులను పదేపదే తలచుకుంటూ ఇఫ్తార్(Iftar) టేబుళ్ల వద్ద కన్నీటి పర్యంతమవుతున్నారు. కూలగా మిగిలిన ఇళ్లకే దీపకాంతుల తోరణాలు కట్టి కోల్పోయిన వెలుగులను తిరిగి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.గాజాలో చరిత్రాత్మక ప్రార్థనా స్థలం గ్రేట్ ఒమారీ మసీదు శిథిలావస్థకు చేరింది. దాంతో మతపరమైన ప్రార్థనలకు కేంద్ర స్థలమంటూ కూడా లేకుండా పోయింది. చాలాచోట్ల ప్రార్థనా స్థలాలన్నీ విధ్వంసమయ్యాయి. అయినా కూలిన భవనాలు, శిథిలాల మధ్యే పాలస్తీనావాసులు ఎన్నో ఆశలతో జీవితాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. పండుగ అంటే ప్రార్థనలు. రంజాన్ షాపింగ్. బంధువులతో వేడుక. ఈసారి అవన్నీ లేకపోయినా గతేడాదితో పోలిస్తే కాస్త మెరుగ్గా ఉందని గాజావాసులు అంటున్నారు! ‘‘తరువాత ఏం జరుగుతుందోనన్న భయం ఇంకా ఉంది. అయినా గతేడాది కంటే ఈసారి మెరుగే’’అని చెబుతున్నారు కొన్ని ప్రాంతాల్లో దుకాణాలు, వీధి వ్యాపారులు అడపాదడపా కనిపిస్తున్నా ఎవరిని చూసినా ఆర్థిక ఇబ్బందులే! నుసిరాత్‌లో హైపర్ మాల్ వంటి సూపర్ మార్కెట్లు తిరిగి తెరుచుకున్నాయి. కానీ దీర్ఘకాలంగా జీవనోపాధే కోల్పోయిన వారిలో కనీసం నిత్యావసర వస్తువులు కూడా కొనే సామర్థ్యం కూడా కన్పించడం లేదు! రంజాన్ ఏకం చేస్తోంది ధైర్యంగా మళ్లీ పాలస్తీనా గడ్డపై కాలు పెట్టగలిగినందుకే గర్వపడుతున్నామని గాజావాసులు చెబుతున్నారు. ప్రపంచంలోని అందరు పిల్లల్లాగే తమ చిన్నారులూ సగర్వంగా, ఆనందంగా జీవించాలని ఆశిస్తున్నారు. ‘‘ఈ రంజాన్ మాసం మా అందరినీ ఏకం చేసింది. ఇంతటి యుద్ధం మధ్య కూడా మాకు ఆనందాన్ని, ఆశను అందిస్తోంది. దాడుల్లేకుండా సురక్షితంగా జీవించడమే మా ఏకైక ఆకాంక్ష’’అని ఖాన్ యూనిస్‌కు చెందిన అబూ ముస్తఫా చెప్పుకొచ్చాడు.కువైట్ సాయం... దక్షిణ గాజా నగరం రఫాలో రంజాన్ ఉపవాసాలుంటున్న 5,000 మంది పాలస్తీనియన్లకు కువైట్ ఇఫ్తార్ భోజనాలు అందించింది. సూర్యాస్తమయం ప్రార్థన పిలుపుతో వారంతా మైళ్ల పొడవున శిధిలాల మధ్య ఏర్పాటు చేసిన బల్ల వద్ద గుమిగూడి అన్నం, చికెన్‌తో ఉపవాస దీక్షను విరమిస్తున్నారు. యుద్ధానికి ముందు ఆ వీధి రంజాన్ రోజుల్లో ఎంతగా కళకళలాడుతూ ఉండేదో ఇఫ్తార్ ఏర్పాట్లకు సహకరిస్తున్న మలక్ ఫదా భారంగా గుర్తు చేసుకున్నారు.‘‘నాటి రోజులే నాకిప్పటికీ స్ఫూర్తి! ఈ వీధికి యుద్ధానికి ముందు మాదిరిగా మళ్లీ జీవం పోయడమే నా లక్ష్యం’’అన్నారామె. ఇటు వ్యక్తిగతంగా, అటు సామూహిక నష్టాల నుంచి, యుద్ధం చేసిన గాయాల నుంచి కోలుకునేందుకు పాలస్తీనియన్లు ప్రయత్నిస్తున్నారు. ఏదేమైనా గాజాను వీడేదే లేదని రఫా వాసి మమ్దౌ అరాబ్ అబూ ఒడే కుండబద్దలు కొట్టాడు. ఏం జరిగినా తామంతా ఐక్యంగా ఉన్నామని, ఉంటామని, తమ దేశాన్ని విడిచి వెళ్లబోమని స్పష్టం చేశాడు. -
బంజారాహిల్స్ : ముస్లింలకు ఘనంగా ఇఫ్తార్ విందు (ఫొటోలు)
-
మీడియా కథనాలపై కాంగ్రెస్ స్పందన
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ బుధవారం ఢిల్లీలోని తాజ్ప్యాలెస్ హోటల్లో ఇఫ్తార్ విందు ఇవ్వనున్నారు. అయితే ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఆహ్వానం పంపలేదన్న వార్తలు నిన్నంతా మీడియాలో హల్ చల్ చేశాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా స్పందిస్తూ ఆ పుకార్లను తోసిపుచ్చారు. ‘ప్రణబ్‌కు ఆహ్వానం పంపాం. ఆయన దానిని అంగీకరించారు. మీడియా ఇకనైనా అత్యుత్సాహం ప్రదర్శించటం ఆపితే మంచిది’ అని ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. ఇటీవల నాగపూర్‌లో ఆరెస్సెస్ నిర్వహించిన ఓ కార్యక్రమానికి వెళ్లిన ప్రణబ్‌పై కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఇస్తున్న ఇఫ్తార్ విందుకు ప్రణబ్‌కు ఆహ్వానం అందలేదని వార్తలొచ్చాయి. ఈ విందులో పాల్గొనేందుకు ఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం, జేడీయూ తిరుగుబాటు నేత శరద్‌యాదవ్, ఎన్సీపీ అధినేత పవార్, సీపీఎం ప్రధాన కార్యదర్శి ఏచూరి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తదితరులకు ఆహ్వానాలు అందినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. దాదాపు మూడేళ్ల తర్వాత కాంగ్రెస్ నిర్వహిస్తున్న ఇఫ్తార్ కావటం, పైగా రాహుల్ అధ్యక్షుడు అయ్యాక నిర్వహిస్తున్నది కావటంతో ఈ ఇఫ్తార్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎన్డీఏ వ్యతిరేక శక్తులను కూడగలుపుకుని 2019 ఎన్నికల్లో ముందుకెళ్లేందుకు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. 1/2 Multiple media houses have raised questions on Iftaar invite to @CitiznMukherjee on behalf of Congress President. Congress President has extended an invite to Sh. Pranab Mukherjee & he has graciously accepted. Hope this will set to rest unwarranted speculation. — Randeep Singh Surjewala (@rssurjewala) 11 June 2018 2/2 To set the record straight, May I point out that Pranab Dada had attended the last Iftar get together organised by then Congress President, Smt. Sonia Gandhi too. Bereft of unwarranted issues, let compassion & friendship for all guide us in the holy month of Ramadan. — Randeep Singh Surjewala (@rssurjewala) 11 June 2018 -
దిల్ దిల్ రమజాన్
రమజాన్ చివరి పదిరోజులు ఎంతో కీలకం. ఖుర్ఆన్ గ్రంథ సందేశాలు దివి నుంచి భువికి వచ్చింది ఈ చివరి పదిరోజుల్లోని ఒక బేసి రాత్రిలోనేనన్నది ప్రవక్త సూచన. అందుకే ఆ రాత్రిని అన్వేషించడం, ఆ రాత్రిలో దైవచింతనలో గడపడం వెయ్యి నెలలపాటు చేసిన పుణ్యకార్యాలతో సమానంగా ముస్లిముల విశ్వాసం. నేల నేలంతా ఒక్కటే పాట..షానే రమజాన్... జానే రమజాన్... దిల్ దిల్ రమజాన్ప్రేమ, కరుణ, క్షమ, ఆరాధనల పవిత్ర నెల, ఒకరినొకరు క్షమించుకుని చూసుకునే ప్రేమపూర్వక చూపులు, ఆకలి బాధానుభూతులు, ఇఫ్తార్ ఆనందాలు సహెరీ శుభాలు, జకాత్, ఫిత్రా దానాలు, ఖుర్ఆన్ పారాయణ చైతన్యం, తరావీహ్ ఆరాధనలు, మది నిండా రమజాన్ వెలుగులే!మాటల్లో, చేతల్లో దైవాదేశాల పరిమళాలే. నలుదిశలా ప్రేమ పవనాల సుమగంధాలే. ఇదంతా అల్లాహ్ రాసిన వరాల వీలునామా. రమజాన్ వరాలు లెక్కకట్ట తరమా! రమజాన్ అంటే కాల్చివేయడం, దహించి వేయడం అని నిఘంటువు అర్థం చెబుతుంది. మంటల్లో ఏమి వేసినా భస్మీపటలం కావాల్సిందే. ఉపవాసంతో కలిగే ఆకలి మంటలో రోజేదార్ల పాపాలు, చెడుగులన్నీ దహించుకుపోతాయి. ఇలా ముఫ్పై రోజులూ గత ఏడాదిపాటు చేసిన పాపాలన్నీ దగ్ధం అవుతాయి. పాపాలన్నీ కాల్చివేసి రోజేదార్ను పునీతుడిని చేస్తాడు అల్లాహ్. ఈద్ వరకూ రోజేదార్లు తమ పాపాల నుంచి విముక్తి పొంది పవిత్రంగా రూపు దాల్చుతారు. ఇలాంటి పునీతులకు అల్లాహ్ ఈద్ రోజు ప్రసన్నమవుతాడు. అదే ఈద్ కానుక. అల్లాహ్ పట్ల ఎనలేని ప్రేమతో ఆకలి బాధతో వచ్చే ‘యా అల్లాహ్’ అనే ఒక్క పిలుపు సప్తాకాశాలపైన కొలువుదీరిన అల్లాహ్ సింహాసనం వరకు వెళుతుంది. సప్తాకాశాలన్నీ రోజేదార్ల పిలుపుతో మార్మోగుతాయి. రమజాన్ నెల సాంతం సప్తాకాశాలల్లో ఉన్న దైవదూతలంతా రోజేదార్ల మేలు కోసం, యోగక్షేమాల కోసం అల్లాహ్‌ను వేడుకుంటారు. రోజేదార్ల వేడుకోళ్లకు తథాస్తు పలకండని అల్లాహ్ దైవదూతలను పురమాయిస్తాడు. ఇంతటి మహత్తరమైన రమజాన్ వసంతం ముప్ఫై రోజుల పండువలా జరుపుకుంటున్నారు ముస్లిములు. ఇఫ్తార్ ఆనందాలు, సహెరీ శుభాలు తనివితీరా ఆస్వాదిస్తున్నారు. ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవడాలు, ఒకరినొకరు క్షమించుకోవడం, క్షమ, దాతృత్వం వంటి శుభలక్షణాలు, సుగుణాలు పాలలా ప్రవహిస్తాయి. మది నిండా ప్రేమ, దయ, క్షమతో పొంగిపొర్లుతుంది. ఘడియ ఘడియను అల్లాహ్‌ను మెప్పించేందుకే ప్రయత్నాలన్నీ. ఆ పరమ ప్రభువును ప్రసన్నం చేసుకుంటే చాలు భూమ్యాకాశాల కంటే కూడా విశాలమైన స్వర్గలోకానికి అర్హత సాధించవచ్చన్నదే రోజేదార్ల ఆరాటం. దురలవాట్లకు దూరంగా ఉంటూ నిర్మల మనస్సుతో అల్లాహ్ మెప్పుపొందడమే రోజేదర్ల తపనంతా. ప్రతివారూ తమతమ మనసు తరచి చూసుకుంటారు. మానవాళి సన్మార్గాన్ని పొందడమే రమజాన్ ఉద్దేశం. ఐహిక సుఖాల పిపాసను ఉపవాసం అంతమొందిస్తుంది. ఆధ్యాత్మిక వికాసం సొంతమవుతుంది. అపరిమిత ధనార్జన మనిషిని వినాశనంపాలు చేస్తే జకాత్, దానాలు ప్రేమభావాన్ని జనింపచేస్తాయి. మనసును జయించాలి.. మనసు చాలా విచిత్రమైనది. కోరికలు కళ్లెంలేని గుర్రాలు. మనసును జయించిన వారే ఆధ్యాత్మిక విజయాన్ని సాధిస్తారు. మనస్సును నిగ్రహించుకోవడంలో ఉపవాసం కీలకపాత్ర పోషిస్తుంది. లేవలేని సమయంలో లేచి అన్నపానీయాలు భుజించడం, తినే తాగే పగటి వేళలో పస్తులుండటం, హాయిగా పడుకునే వేళలో దైవం ముందు ఆరాధన చేయడం ఇవన్నీ మనోనిగ్రహానికి సాధనాలుగా పనిచేస్తాయి. ఈ నిగ్రహం లేకపోతే మనసు ప్రపంచ తళుకుబెళుకుల వెంట పరుగెడుతుంది. ఆకర్షణలకు బానిసవుతుంది. పతనానికి కారణమవుతుంది. అదే మనసును అదుపులో ఉంచుకుంటే ఎన్నో విజయాలు సాధించవచ్చు. ఆ పనే చేయిస్తుంది ఉపవాసదీక్ష. దైవభీతిని, ధర్మనిష్ఠను పెంపొందించడమే ఉపవాసం ఉద్దేశం అంటోంది ఖుర్ఆన్. రోజంతా ఆకలి దప్పులతో ఇఫ్తార్ వేళలో తన ముందు ఉన్న రుచికరమైన అన్నపానీయాలను ఇఫ్తార్ ఘడియకు క్షణం ముందు కూడా నోట్లో వేసుకోకపోవడానికి కారణం రోజేదార్లలో కలిగే పాపభీతి, వివేకవిచక్షణలే. అందుకే ముస్లిముల హృదయాలు నెలసాంతం ధర్మనిష్ఠతో, మంచి పనులతో పులకించిపోతారు. ప్రేమ, కరుణ, క్షమ, దానగుణం అనే సుగుణాలను పెంపొందించుకుంటారు.ఇఫ్తార్ చేసి నమాజ్ చేసుకుని ఇంటికొచ్చిన సగటు ముస్లిమ్ కాస్సేపు మేను వాల్చాడో లేదో ఇషా నమాజ్ కోసం మస్జిదు నుంచి పిలుపు వస్తుంది. ఆపై తరావీహ్ నమాజులో ఖుర్ఆన్ వినడం జరుగుతుంది. సుమారు 2గంటల నిడివితో మస్జిదులో అల్లాహ్ ముందు నిలబడి దైవారాధన చేస్తాడు. నిద్ర ముంచుకొస్తున్నా అల్లాహ్ మెప్పు పొందేందుకు హాయి నిద్రను త్యాగం చేస్తాడు. ఈ వాతావరణం ఒక్క రమజాన్ లోనే మనకు కనిపిస్తుంది. రాత్రి దైవారాధనలో గడిపి రాత్రి చాలా పొద్దుపోయాక నిద్రకు ఉపక్రమిస్తారు. తెల్లవారు జామున మూడున్నర గంటలవుతుంది. వేళకాని వేళ నిద్రమత్తు వదలదు. ఆ వేళలో మస్జిద్ నుంచి మోగే సైరన్‌కు ఠంచనుగా లేస్తాడు ఉపవాసి. పడుకునే వేళలో బ్రష్ చేసి భోజనం చేయాలి. కేవలం పరిమిత సమయంలోగా భోజనం ముగించాలి. ఇలా తెల్లవారు జామున భోజనం చేయడాన్నే సహెరీ అంటారు. సహెరీ తరువాత నిద్రపోదామంటే కుదరదు. వెంటనే పెందలకడ చదివే ఫజర్ నమాజ్ కోసం అజాన్ వాణి పిలుస్తుంటుంది. వేళకాని వేళలో లేవడం, సహెరీ భుజించడం, సహెరీ వంటలు ఇరుగు పొరుగు వారికి పంపడం, నమాజ్ కోసం వెళ్లడం ఈ దృశ్యాలు కేవలం మనకు రమజాన్ నెలలోనే ప్రత్యేకం. ఈ ఆధ్యాత్మిక వాతావరణం కేవలం మనకు రమజాన్ నెలలోనే కనపడుతుంది. సహెరీ, ఇఫ్తార్, నమాజులు, ఖుర్ఆన్ పారాయణం, జకాత్, సదకా దానాలతో ముస్లిముల మోములు మురిసిపోతుంటాయి. ఉదయం నుంచి సాయంత్రం దాకా పద్నాలుగు గంటల దాకా ఆకలిదప్పులతో గడుపుతాడు. మనిషిని మహోన్నతంగా తీర్చిదిద్దడమే రమజాన్ శిక్షణ ఉద్దేశం. ఇఫ్తార్ లో త్యాగభావం... ఇఫ్తార్‌లో నలువైపులా ప్రేమ, త్యాగభావం నిండిన వాతావరణమే కనిపిస్తుంది. స్వార్థం, ప్రలోభం అన్నీ ఇఫ్తార్‌లో చాప చుట్టేస్తాయి. ఉచ్ఛనీచాలు అస్సలే ఉండవు. పేదలు, ధనికులు ఇద్దరూ పక్కపక్కనే కూర్చునే ఆహ్లాదకరమైన వాతావరణం ఇఫ్తార్ వేళలో కనబడుతుంది. తమ పక్కన కూర్చున్న వ్యక్తి పరిచయస్తుడా కాదా అన్నది ఎవరూ పట్టించుకోరు. తన వద్ద ఉన్న తినుబండారాలు, ఆహార పదార్థాలను ఏమీలేని వ్యక్తికి ఎంతో ప్రేమతో అందించే అందమైన దృశ్యాలు రమజాన్‌లో కనపడతాయి. ఇఫ్తార్‌లో తినే ప్రతి వ్యక్తి మిగిలిన వారికి సరిపోతుందో లేదో అన్న ధ్యాసతోనే తింటారు. సామాజికంగా అందరం ఒక్కటే అనే అద్భుతమైన అందమైన భావన ఆచరణాత్మకంగా కనిపిస్తుంది. వీలయినంత ఎక్కువగా ఎదుటివారికి ప్రాధాన్యమివ్వాలనే త్యాగభావం జనిస్తుంది. దాదాపు పధ్నాలుగు గంటల పాటు అన్నపానీయాలకు దూరంగా ఉండడం వల్ల ఎంత సంపన్నుడైనా ఆకలి బాధ, దప్పిక బాధేమిటో అనుభవపూర్వకంగా తెలుసుకుంటాడు. పేదల కష్టాలను అర్థం చేసుకుని ఆదుకుంటాడు. ఆహారాన్ని పంచుకు తినే అద్భుతమైన అందమైన దృశ్యాలు రమజాన్ మాసంలో కనువిందు చేస్తాయి. చివరి పదిరోజులు కీలకం రమజాన్ చివరి పదిరోజులు ఎంతో కీలకం. ఖుర్ఆన్ గ్రంథ సందేశాలు దివి నుంచి భువికి వచ్చింది ఈ చివరి పదిరోజుల్లోని ఒక బేసి రాత్రిలోనేనన్నది ప్రవక్త సూచన. అందుకే ఆ రాత్రిని అన్వేషించడం, ఆ రాత్రిలో దైవచింతనలో గడపడం వెయ్యి నెలలపాటు చేసిన పుణ్యకార్యాలతో సమానంగా ముస్లిముల విశ్వాసం. చివరి పది రోజులూ ఏతేకాఫ్ అనే ప్రత్యేక ఆరాధనను పాటిస్తారు. అల్ విదా రమజాన్.. రమజాన్ వసంతానికి బాధతో, ఆర్ద్రతతో వీడ్కోలు పలుకుతారు. దిల్ దిల్ రమజాన్ అని పాడుకున్న ముస్లిములు నెలరోజుల అతిథిని ఎంతో గౌరవ ప్రపత్తులతో చూసుకున్న ముస్లిములు 30 రోజుల ఉపవాసాలు ముగింపు దశకు చేరుకునే సరికి బాధతో వీడ్కోలు పలుకుతారు. అల్ విదా.. అల్ విదా.. కారుణ్యాన్ని కురిపించిన వసంతమా అల్ విదా అని ఆర్ద్రతతో పాడుకుంటారు. ప్రేమను కుండపోతలా కురిపింపచేసిన మాసమా నీకు మా వీడ్కోలు అని పాడుకుంటారు. షవ్వాల్ నెలవంక కనపడగానే ఈదుల్ ఫిత్ర్ రమజాన్ పండుగను ఆనందోహాత్సాహలతో జరుపుకుంటారు. ఈద్ రోజు ముస్లిముల çహృదయాల్లో, చేతల్లో కారుణ్య ఛాయలు రెట్టింపవుతాయి. అల్లాహ్ చూపిన కరుణా కటాక్షాలతో నెలరోజుల ఉపవాసాలు దిగ్విజయంగా పూర్తి చేసినందుకు, ముప్ఫై రోజుల పాటు దేవుని సమక్షంలో తరావీహ్ నమాజు చేసినందుకుగాను పేదలకు ఫిత్రా దానం చేస్తారు. పండుగ నమాజ్‌కు వెళ్లేముందు ఫిత్రా దానం చేసి పేదలకు చేయూతనిస్తారు. ఈద్గాహ్కు వెళ్లి ఈద్ నమాజ్ చేస్తారు. అందరి ముఖాల్లో చిరునవ్వు తొణికిసలాడేలా చేయడమే ఈదుల్ ఫిత్ర్ ఉద్దేశం. ఈద్ రోజు చిన్నా పెద్దా, ఆడా మగా అందరిలోనూ అనంత సంతోషంతో హృదయాలు ఓలలాడుతాయి. వచ్చే ఏడాది వరకూ ఇదే స్ఫూర్తిని కొనసాగించేవారే నిజమైన సౌభాగ్యవంతులు. అప్పుడే నెలరోజుల రమజాన్ శిక్షణకు సార్థకత. – ముహమ్మద్ ముజాహిద్ -
మైనారిటీ విద్యకు పెద్దపీట
సాక్షి, హైదరాబాద్ : తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రాబోయే పది పన్నెండేళ్లలో మైనారిటీ వర్గాల్లో విద్యాపరంగా విప్లవాత్మక మార్పులు వస్తాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన దావత్–ఏ–ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ.. మైనారిటీ వర్గాలకు పెద్దపీట వేసి గురుకులాల్లో ఉచిత విద్య, వసతి అందిస్తున్నామన్నారు. తెలంగాణ మైనారిటీ గురుకులాల విద్యార్థులు నాసా వరకు వెళ్లి వచ్చారని పేర్కొన్నారు. అన్ని అంశాల్లో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్‌గా ఉందని, ప్రగతిపథంలో దూసుకెళ్తోందని చెప్పారు. ‘‘దేశమంతా తెలంగాణ వైపు చూస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా మైనారిటీ సంక్షేమానికి పెద్దపీట వేశాం. దేశం మొత్తమ్మీద మైనారిటీల సంక్షేమానికి బడ్జెట్లో రూ.4 వేల కోట్లు కేటాయిస్తే.. తెలంగాణలో రూ.2 వేల కోట్లు కేటాయించాం. ఈ బడ్జెట్‌ను పూర్తి స్థాయిలో ఖర్చు చేస్తాం’’అని అన్నారు. రాజస్తాన్‌లో హైదరాబాద్ రుబాత్ అల్లా కృపతో తెలంగాణ సాధించగలిగామని సీఎం అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అల్లాను వేడుకున్నామని, అజ్మీర్ షరీఫ్ దర్గాకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు జరిపామన్నారు. దేవుడు న్యాయమైన కోరికను కరుణించడంతో రాష్ట్రం సిద్ధించిందన్నారు. మక్కా మదీనాలో మాదిరిగా రాజస్తాన్‌లోని అజ్మీర్ షరీఫ్‌లో సుమారు రూ.5 కోట్ల వ్యయంతో హైదరాబాద్ రుబాత్ భవన సముదాయాన్ని నిర్మిస్తామన్నారు. ఇందుకు రాజస్తాన్ ప్రభుత్వం 8 ఎకరాల భూమి కేటాయించిందని, త్వరలో శంకుస్థాపన చేస్తామని తెలిపారు. తెలంగాణ నుంచి ప్రత్యేక రైలు వేసి 31 జిల్లాల నుంచి ముస్లింలను శంకుస్థాపన కార్యక్రమానికి తీసుకెళ్తామన్నారు. హైదరాబాద్‌లో సుమారు 10 ఎకరాల్లో ఇస్లామిక్ సెంటర్‌ను నిర్మించేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఎస్సీ, ఎస్టీలతో సమానంగా మైనారిటీ వర్గాలకు కూడా అన్ని పథకాలు వర్తింపచేసినట్లు వివరించారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ మాట్లాడుతూ.. కేసీఆర్ నాయకత్వంలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ రాష్ట్రంగా నిలిచిందన్నారు. దేశంలో మైనారిటీ వర్గాలు సంక్షేమానికి బడ్జెట్లో పెద్దపీట వేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదేనన్నారు. ఈ ఇఫ్తార్ విందులో మండలి చైర్మన్ స్వామి గౌడ్, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
ఆరెస్సెస్, బీజేపీపై పవార్ వ్యంగ్యాస్త్రాలు!
ముంబై : హిందుత్వ వాదులుగా చెప్పుకునే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్), భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లు ముస్లిం సోదరుల కోసం ఇఫ్తార్ విందులు నిర్వహించడం హాస్యాస్పదంగా ఉందని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ అన్నారు. నాగ్‌పూర్‌కు చెందిన ఓ సంస్థ, ఓ రాజకీయ పార్టీకి చెందిన నేతలు సామాజిక దృక్పథం నేపథ్యంలో ఇఫ్తార్లు ఏర్పాటు చేశారని తనకు తెలిసిందన్నారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా బుధవారం హజ్ హౌస్‌లో ముస్లిం సోదరులకు శరద్ పవార్ ఇఫ్తార్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇతర నెలల్లో వారికి ఇష్టం వచ్చినట్లుగా ఉండే పార్టీ, సంఘాలు.. ఈ నెలలో మాత్రం ముస్లిం సోదరులపై కపట ప్రేమ చూపుతున్నాయంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కానీ వారి ఉద్దేశం కచ్చితంగా వేరే ఉంటుందని పరోక్షంగా బీజేపీపై వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర ఎన్సీపీ చీఫ్ జయంత్ పాటిల్ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో ప్రధాని పదవికి శరద్ పవార్ అన్ని విధాలా అర్హుడని వ్యాఖ్యానించారు. ఎన్సీపీ నేతలు అజిత్ పవార్, మాజిద్ మెమన్, సచిన్ అహిర్, డీపీ త్రిపాఠి, ధనంజయ్ ముండే, తదితరులు ఈ ఇఫ్తార్ విందుకు హాజరయ్యారు. కాగా, ఈ నెల 4న ఆరెస్సెస్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందును ముస్లిం సంఘాలు తిరస్కరించిన విషయం తెలిసిందే. వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసమే ఆరెస్సెస్ తమపై కపట ప్రేమ చూపుతోందని ఆరోపించాయి. ముస్లింలపై దాడులు చేస్తూ రంజాన్ మాసంలో మాత్రం ఇంత ప్రేమ ఎలా కురిపిస్తున్నారంటూ ముస్లిం సంఘాల నేతలు మండిపడ్డారు. -
ఆరెస్సెస్ ఇఫ్తార్.. నో చెప్పిన ముస్లింలు!
ముంబై : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) ఈ నెల 4న ఏర్పాటు చేయనున్న ఇఫ్తార్ విందును ముస్లిం సంఘాలు తిరస్కరించాయి. వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసమే ఆరెస్సెస్ తమపై కపట ప్రేమ చూపుతోందని ఆరోపించాయి. సోమవారం జరగనున్న ఆ ఇఫ్తార్ విందుకు తాము హాజరు కాబోమని ముస్లీం సంఘాలు తేల్చిచెప్పాయి. కాగా ఆరెస్సెస్ అనుబంధ సంస్థ ముస్లిం రాష్ట్రీయ మంచ్( ఎమ్‌ఆర్‌ఎమ్) ఈ ఇఫ్తార్‌ను ముంబైలో నిర్వహించనుంది. ఈ విందుకు దాదాపు 30 ముస్లిం దేశాలనుంచి 200మంది ముస్లిం ప్రముఖులను ఆహ్వానించింది. ఎమ్‌ఆర్‌ఎమ్ జాతీయ కన్వీనర్ విరాగ్ పాచ్‌పోర్ మాట్లాడుతూ..ఆరెస్సెస్ పట్ల మైనారీటీలకు ఉన్న దురభిప్రాయాలను తొలగించడానికే ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ‘ఆరెస్సెస్ ఇతర మతాలను గౌరవిస్తుంది. దేశంలో శాంతి చేకూర్చడానికే సంఘ్ కృషి చేస్తుంది. సోదర భావంతో ఇతర మతస్థులను గౌరవిస్తుంది’ అని తెలిపారు. కాగా 2019 ఎన్నికల్లో బీజేపీని గెలిపించడానికే ఆరెస్సెస్ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తుందని ముస్లిం సంఘాలు ఆరోపించాయి. ముస్లింలపై దాడులు చేస్తూ కపట ప్రేమ చూపుతున్నారని మండిపడ్డాయి. ఆరెస్సెస్ ఇఫ్తార్‌ను కపటనాటకంగా భావించి విందును బహిష్కరిస్తున్నామని పలు ముస్లిం సంఘాలు పేర్కొన్నాయి. -
సహర్, ఇఫ్తార్ సమయం చెప్పింది మనమే
సాక్షి, సిటీబ్యూరో: రంజాన్ మాసంలోముస్లింలు సూర్యోదయం ముందు నుంచి సూర్యాస్తమయం వరకు ఉపవాసం పాటిస్తారు. అయితే అప్పట్లో సహర్, ఇఫ్తార్ సమయాలనిర్ధారణ సరిగా లేకపోవడంతో ఇబ్బందులుఎదురయ్యాయి. దీన్ని గ్రహించిన నిజాం సమయ నిర్ధారణకు ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్లతో భూగోళ, ఖగోళ పరిశోధనలు చేయించారు.అనంతర ప్రొఫెసర్లు ఒక సమయ పట్టికను రూపొందించారు. ప్రపంచవ్యాప్తంగా నేటికీ దీన్నే ఉపయోగిస్తున్నారు. సహర్, ఇఫ్తార్ సమయాల నిర్ధారణకు 1930లో అప్పటి ఓయూ ప్రొఫెసర్ మహ్మద్ అబ్దుల్ వాసే ఆధ్వర్యంలోని బృందం వివిధ పరిశోధనలు చేసింది. పదేళ్లు భూగోళ, ఖగోళ పరిశోధనలు చేసిన బృందం 290 పేజీలతో ఒక పుస్తకాన్ని రూపొందించింది. దీనిని మియారుల్ అవుకాత్(సమయ నిర్ధారణ) అంటారు. ఈ పుస్తకం ఆధారంగానే ప్రపంచవ్యాప్తంగా సహర్, ఇఫ్తార్ సమయాలను పాటిస్తున్నారు. ఈ పుస్తకం ఇప్పటికీ ఓయూలో అందుబాటులో ఉంది. 1970 నుంచి ప్రచురణ.. అప్పట్లో దిన, వార, మాస పత్రికల్లో రంజాన్ మాసానికి ముందే ఉపవాస పట్టికను ప్రచురించేవారు. 1970 నుంచి ఉపవాస సమయ పట్టిక ప్రచురణకు ఆదరణ లభించింది. తర్వాత 1994 నుంచి దీన్ని అన్ని హంగులతో మల్టీ కలర్లో ప్రింట్ చేయడం ప్రారంభించారు. ప్రస్తుతం చెత్తబజార్ మార్కెట్లో ప్రచురించి తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటకకు తీసుకెళ్తున్నారు. ఇందులో సహర్, ఇఫ్తార్ సమయాలు, ఆ సమయాల్లో చదివే దువాలు, ఖురాన్ సూక్తులు, ప్రవక్త ప్రత్యేక ప్రారర్థనలు కూడా ప్రచురిస్తున్నారు. ఈ ఏడాది దాదాపు 10 కోట్ల కార్డులు ప్రింట్ చేయించారు. చాలా మంది వీటిని ప్రింట్ చేయించి ఉచితంగా పంపినీ చేస్తారు. ఇలా చేస్తే పుణ్యం లభిస్తుందని నమ్మకం. -
మైనార్టీ మంత్రి లేని కేబినెట్ చంద్రబాబుదే
విజయవాడ: నగరంలోని ఆంధ్రరత్న భవన్లో ముస్లిం సోదరులకు కాంగ్రెస్ పార్టీ ఇఫ్తార్ విందు ఇచ్చింది. ఇఫ్తార్ కార్యక్రమంలో పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, పార్టీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘువీరా మాట్లాడుతూ రాష్ట్రంలో రాజ్యాంగానికి విరుద్ధంగా పాలన జరుగుతోందని, కేబినెట్లో మైనారిటీ మంత్రి కూడా లేకపోవడం దారుణమని అన్నారు. దేశ చరిత్రలో మైనార్టీ మంత్రి లేని కేబినెట్ ఆంధ్రపద్రేశ్ ప్రభుత్వమేనన్నారు. చంద్రబాబు మైనార్టీలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని, రాష్ట్రంలో మైనార్టీలను రెండవశ్రేణి వారిలా చూస్తున్నారని విమర్శించారు. -
నంద్యాల ఇఫ్తార్‌కు రూ.90 లక్షలు
– ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం కర్నూలు(అగ్రికల్చర్): నంద్యాలలో ఈ నెల 21న నిర్వహించే రాష్ట్రస్థాయి ఇఫ్తార్ విందుకు ప్రభుత్వం రూ.90 లక్షలు కేటాయిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. 21న సాయంత్రం 6 గంటలకు మార్కెట్‌యార్డులో నిర్వహించనున్న ఇఫ్తార్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. ఇక్కడి ఇఫ్తార్‌ను రాష్ట్రస్థాయి కార్యక్రమంగా ప్రభుత్వం నిర్వహిస్తోంది. -
‘ఇఫ్తార్’ ఖర్చు వివరాలు చెప్పండి
మైనారిటీ సంక్షేమ శాఖకు హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఈ నెల 18న రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు ఖర్చుల వివరాలు తమ ముందుంచాలని బుధవారం మైనారిటీ సంక్షేమ శాఖను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ తెల్లప్రోలు రజనీలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం ఇఫ్తార్ విందు పేరుతో వక్ఫ్‌బోర్డ్ నిధులను దుర్వినియోగం చేస్తోందంటూ, ఇఫ్తార్ విందుకు 2015, 2016, 2017ల్లో జారీ చేసిన జీవోలను సవాల్ చేస్తూ సామాజిక కార్యకర్త లుబ్నాసార్వత్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. బుధవారం విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది రజా సమీర్ అహ్మద్ వాదనలు వినిపిస్తూ ఇఫ్తార్ విందు ఖర్చుల వివరాలను ప్రభుత్వం ఎక్కడా బయటపెట్టడం లేదని పేర్కొన్నారు. జీవోల్లో ఆ వివరాలను ప్రస్తావించట్లేదని తెలిపా రు. మైనారిటీలకు ఈ విందు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోందని, అయితే ఇందులో మైనా రిటీయేతరులూ పాల్గొంటున్నారని వివరించారు. సీఎం కూడా ఈ విందులో పాల్గొంటున్నారని తెలిపారు. ధర్మాసనం జీవోను పరిశీలించి, ఇందులో 420 మసీదుల్లో 500 మందికి చొప్పున విందు ఇవ్వాలని ఉందని, మరి మైనారిటీయేతరులు విందులో పాల్గొన్నారని ఎలా గుర్తించాలని ప్రశ్నించింది. ప్రభుత్వాలు అనేక పథకాలకు రాయితీలు ఇస్తుంటాయని, ప్రతీ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని ధర్మాసనం పేర్కొంది. మైనారిటీ నిధులను అవసరమైన మైనా రిటీల కోసం వినియోగించడాన్ని తాము వ్యతిరేకించట్లేదని సమీర్ తెలిపారు. ఇఫ్తార్ పేరుతో నిధుల దుర్వినియోగం జరుగుతోంది కాబట్టే జోక్యం కోరుతున్నట్లు పేర్కొన్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఇఫ్తార్ విందు జీవో అమలుపై స్టే ఇవ్వాలని కోరారు. ఇఫ్తార్ విందుకు అయ్యే వ్యయాలకు సంబంధించిన వివరాలు తమ ముందుంచాలని మైనారిటీ సంక్షేమ శాఖ తరఫు న్యాయవాదికి స్పష్టం చేస్తూ విచారణను గురువారానికి వాయిదా వేసింది -
ఉప రాష్ట్రపతి పోటీలో లేను
సాక్షి, హైదరాబాద్: ఉప రాష్ట్రపతి పదవికి పోటీకి నిర్ణయం తీసుకోలేదు.. అదంతా మీడియా సృష్టి.. దేవుడు ఏదీ తలిస్తే అదే జరుగుతుందని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ పేర్కొన్నారు. రంజాన్ ఉపవాసాల సందర్భంగా రాజ్‌భవన్‌లో బుధవారం ఆయన ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా గవర్నర్ ముస్లిం సమాజాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ముందస్తుగా రంజాన్ శుభాకాంక్షాలు తెలిపారు. ‘‘ఇదీ చాలా మంచి మాసం..మనుసులోని చెడు భావాలను దూరం చేసి, మలీనం లేకుండా పవిత్రంగా ఉంచే మాసం..ముస్లిలంతా ద్వేష భావాన్ని వీడాలి..చెడు గురించి ఆలోచించ వద్దు..ఉపవాసంతో మంచితనం అలవడుతుంది..సంస్కారం అలవడుతుంది..అందరితో కలిసి సమైక్యంగా జీవించండి’ అని గవర్నర్ కోరారు. ఎవరికీ కీడు చేయవద్దు..దేవుడిని ప్రార్థిస్తూ మంచితనంతో మసలుకోవాలి కోరారు. పరస్పర సోదర భావం పెంపొందించుకొని, మంచి నడవడికతో జీవించాలన్నారు. జీవితంలో పది మందికి మేలు చేయాలని, సత్ప్రవర్తన, మంచితనం అలవర్చుకోవాలన్నారు. ఈ విందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు , మాజీ ముఖ్యమంత్రులు నాదెళ్ల భాస్కరరావు, కె.రోశయ్య, ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కె.మధుసూదన చారి, మండలి చైర్మెన్ స్వామి గౌడ్, విపక్ష నేత కె.జానారెడ్డి, మండలి విపక్ష నేత మహమ్మద్ అలీ షబ్బీర్, ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, ఎండీ మహమూద్ అలీ, మంత్రులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, కేటీఆర్, ఈటల రాజేందర్, ఇంద్రకరణ్ రెడ్డి, మహేందర్ రెడ్డి, చందూలాల్, నాయిని నరసింహా రెడ్డి, ఎంపీ కే కేశవరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, డీజీపీ అనురాగ్ శర్మ, నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి, ఈఆర్సీ చైర్మెన్ ఇస్మాయిల్ అలీఖాన్, ఎమ్మెల్యేలు చింతల రామంచంద్రారెడ్డి, వివేకానంద, సోమారపు సత్యనారాయణ, ఎమ్మెల్సీలు సయ్యద్ అమీనుల్ జాఫ్రీ, పల్లారాజేశ్వర్ రెడ్డి, కర్నె ప్రభాకర్, శ్రీనివాస్ రెడ్డి, ఫారూఖ్ హుస్సేన్, మహమ్మద్ సలీం హాజరయ్యారు. వైజాగ్‌లో ఉన్నందుకే చంద్రబాబు రాలేకపోయారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వైజాగ్‌లో ఉండడం వల్ల ఇఫ్తార్ విందుకు రాలేకపోయారని, ఆయన ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తిని పంపించారని గవర్నర్ నరసింహన్ తెలిపారు. ఇఫ్తార్ విందు ముగింపు సందర్భంగా ఆయన మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడుతూ పలు ప్రశ్నలకు బదులిచ్చారు. గవర్నర్ ఎవరికీ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. మంగళవారం టీడీపీ నేతలు వచ్చి తనను కలిశారని, గురువారం కాంగ్రెస్ నేతలు వచ్చి కలవనున్నారన్నారు. టీఎస్పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఇఫ్తార్ విందుకు ఎందుకు హాజరు కాలేదో గురువారం ఆయన కలవడానికి వచ్చిప్పుడు ప్రశ్నిస్తానని సరదాగా వ్యాఖ్యానించారు. అంతకు ముందు ముస్లింలు ఒక పొద్డు విడిచే సమయంలో గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్‌లు ముస్లిం సోదరులకు ఖజ్జూర పండ్లు, పళ్లు తినిపించారు. రోశయ్యకు ప్రత్యేక పలకరింపు గవర్నర్ ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కె.రోశయ్య దగ్గరికి వెళ్లి ప్రత్యేకంగా పలకరించారు. రోశయ్య పక్కన కూర్చొని కొద్ది నిమిషాలు మాట్లాడారు. రోశయ్య ఆరోగ్యం గురించి కుశల ప్రశ్నలు వేశారు. -
కువైట్‌లో వైఎస్సార్సీపీ ఇఫ్తార్ విందు
కువైట్ : భారత దేశం మతసామరస్యానికి ప్రతీక అని వైఎస్ఆర్సీపీ కువైట్ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి అన్నారు. శుక్రవారం కువైట్‌లోని మాలియా ప్రాంతంలో ఉన్న ఆంధ్రా మ్యాక్స్ హోటల్లో వైఎస్ఆర్సీపీ కువైట్ కమిటీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు జరిగింది. ఈ సందర్భంగా బాలిరెడ్డి మాట్లాడుతూ.. పవిత్ర రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందుకు ప్రత్యేకత ఉందన్నారు. భారత దేశంలో అనేక కులాలు, మతాలు ఉన్నాయని, భారతీయులంతా ఒక్కటేనని చాటి చెప్పేందుకు ఇఫ్తార్ విందు ఒక మంచి అవకాశమన్నారు. రంజాన్ మాసం శుభప్రదమైనదని ఉపవాసం ద్వారా పేదవారి ఆకలి తెలుస్తుందని, తద్వారా వారి ఆకలి తీర్చేందుకు సహాయం చేయాలనే అవకాశం భావన కలుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కువైట్ కమిటీ కో కన్వీనర్లు గోవిందు నాగరాజు, ఎంవీ నరసారెడ్డి, రెహమాన్ ఖాన్, నాయని మహేష్‌రెడ్డి, గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు పి. రెహమాన్ ఖాన్, సభ్యులు సయీద్ నజర్, గఫార్, మన్నూరు చంద్రశేఖర్‌రెడ్డి, రమణ యాదవ్, సురేష్‌రెడ్డి, శ్రీనివాసులరెడ్డి, నాగిరెడ్డి చంద్ర పాల్గొన్నారు. -
ఇఫ్తార్ విందులో పాల్గొన్న వైఎస్ జగన్
-
ఇఫ్తార్ విందులో పాల్గొన్న వైఎస్ జగన్
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మోహదీపట్నంలో జరిగిన ఇఫ్తార్ విందుకు ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు వైఎస్ జగన్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. -
ఇఫ్తార్ విందుకు పాక్ ను ఆహ్వానించం: ఆర్ఎస్ఎస్
న్యూఢిల్లీ: రాష్ట్ర్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ముస్లీం విభాగతమైన ముస్లిం రాష్ట్ర్రీయ మంచ్(ఎమ్‌ఆర్‌ఎమ్) దేశ రాజధానిలో ఇస్తున్న ఇఫ్తార్ విందుకు పాకిస్థాన్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ ను ఆహ్వానించకూడదని నిర్ణయించింది. జులై 2 న ఎమ్‌ఆర్‌ఎమ్ ప్రపంచ ముస్లిం దేశాల రాయబారులకు ఢిల్లీలో ఇఫ్తార్ విందు ఇవ్వనున్న విషయం తెలిసిందే. పాకిస్థాన్ హై కమిషనర్ అబ్దుల్ బాసిత్ భారత జవాన్లపై పాక్ ఉగ్రవాద సంస్థ దాడి నేపథ్యంలో ఖండించనందుకు తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ఎమ్‌ఆర్‌ఎమ్ కన్వీనర్ మహ్మద్ అఫ్జల్ పేర్కొన్నారు. పాకిస్థాన్ కు చెందిన లష్కరే తోయిబా ఈ నెల 25న జమ్ముకశ్మీర్ లోని పంపొరాలో సీఆర్పీఫ్ పోలీసులపై దాడి చేసిన ఘటనలో ఎనిమిది మంది జవాన్లు మృతి చెందగా మరో22 మంది తీవ్రంగా గాయపడ్డారు. -
టోపీలు జిందాబాద్!
న్యూఢిల్లీ: ఇఫ్తార్ విందు....ఇది ముస్లిం మతస్థులు రోజంతా అన్న పానీయాలు లేకుండా ఉపవాసం ఉండి...దాని ముగింపుగా స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలసి ఖుషీగా విందారగించే సాధారణ సంఘటన. ఇంతకుముందు కుటుంబం, స్నేహితుల వరకే పరిమితమైన ఈ విందును కుహనా సామ్యవాద పార్టీలు (సూడో సెక్యులరిస్ట్ పార్టీలు) కాస్తా ఇఫ్తార్ పార్టీగా మార్చాయి. వీటికి హంగామాను జోడించి అట్టాహాసంగా జరుపుకునే పార్టీలుగా తీర్చిదిద్దాయి. ఓట్ల రాజకీయాల్లో భాగంగా ముస్లిం మిత్రులను పిలుస్తూ ఇఫ్తార్ పార్టీలను ఏర్పాటు చేయడం రాజకీయ పార్టీలకు ప్రహసనంగా మారిపోయాయి. ముస్లిం పెద్దలు ఏర్పాటు చేసే ఇఫ్తార్ పార్టీలకు అనుగుణంగా పర్షియన్ లేదా అరబ్ సంస్కృతులను ప్రతిబింబించేలా దుస్తులను ధరించి వెళ్లడం కూడా రాజకీయ నేతల రీతిగా మారింది. ఈసారి ఇఫ్తార్ విందులకు హాజరైన వివిధ రాజకీయ నేత ల్లో ఎవరి గెటప్ బాగుందో తేల్చుకునేందుకు పోటీ పెట్టి ఉన్నట్టయితే బహూశ సమాజ్‌వాది అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్‌కు దక్కేదేమో. నవతరం రాజకీయవాదిగా రంగప్రవేశంచేసి ఢిల్లీ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇలాంటి రాజకీయాలకు అతీతుడు కాడేమో! ఇటీవల ఢిల్లీలో జరిగిన ఓ ఇఫ్తార్ పార్టీలో కేజ్రివాల్ బుద్ధిగా తెల్లటి రూమీ టోపీ ధరించగా, ఆయన పక్కనేవున్న ముస్లిం సోదరులు ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, భారత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ మాత్రం ఎలాంటి టోపీలు ధరించకపోవడం గమనార్హం. ఎక్కువ హిందువుల ఓట్లపై ఆధారపడే బీజేపీ మాత్రం ఇఫ్తార్ పార్టీలకు కొంత దూరంగానే ఉంటోందని చెప్పవచ్చు. విదేశీ పర్యటనలో బిజీబిజీగా గడపివచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇఫ్తార్ విందులకు దూరంగానే ఉన్నారు. ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ముస్లింలు తమ సంప్రదాయం ప్రకారం రూమీ టోపీని పెట్టబోతే బహిరంగంగానే ఆయన వారించారు. కారణం హిందువుల ఓట్లు పోతాయన్న భయమే. ప్రముఖ ఉర్దూ కథల రచయిత సాదత్ హసన్ మాంటో ‘బాతే’ పేరిట రాసిన కథ గురించి ఇక్కడ ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. భారత స్వాతంత్య్రానికి ముందు 1942లో ముంబైలో జరిగిన హిందూ, ముస్లిం అల్లర్లను వర్ణిస్తూ ‘మనం ఏదో పని మీద బయటకు వెళ్లాలనుకున్నప్పుడు మనం రెండు టోపీలు దగ్గర పెట్టుకోవాలి. ఒకటి హిందూ టోపీ. మరొకటి రూమీ టోపి. హిందువుల కాలనీ నుంచి వెళుతున్నప్పుడు హిందువుల టోపీ పెట్టుకుందాం. ముస్లింల కాలనీ నుంచి వెళుతుంటే రెండోది పెట్టుకుందాం. ఎందుకైనా మంచిది గాంధీ టోపీని కూడా దగ్గర పెట్టుకుందాం. అది అవసరమని అనిపించినప్పుడు దాన్నీ ధరిద్దాం. ఇంతకుముందు విశ్వాసాలు హృదయాల్లో ఉండేవి. ఇప్పుడు టోపీల్లో ఉంటున్నాయి. టోపీలు జిందాబాద్!’. -
నేడు రంజాన్ పండుగ
-
ఈద్ ముబారక్
మనలో ప్రతి ఒక్కరం రమజాన్ పండుగ స్ఫూర్తిని గుండెల్లో నింపుకోవాలి.ఆనందంలో అందరినీ భాగస్వాములను చేయాలి. ‘జకాత్’, ‘ఫిత్రా’, ‘సద్ ఖి’ ‘ఖైరాత్’ల పేరుతో సమాజంలోని అభాగ్యుల పట్ల మన బాధ్యతను చిత్తశుద్ధితో నెరవేర్చాలి. కుల, మతాలు, వర్గ, ప్రాంత, భాషాభేదాలకు అతీతంగా సమాజంలో శాంతిస్థాపనకు ప్రయత్నంచేయాలి. దారిద్య్రం, పేదరికం, అసమానత, అణచివేత, దోపిడి, పీడన లాంటి దుర్మార్గాలను దూరం చేసి, శాంతి,సంతోషాలను- సోదర భావాన్ని, సామరస్య వాతావరణాన్ని, సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని ప్రోది చేయాలి. ఇదే ‘ఈదుల్ ఫిత్’్ర (రమజాన్ పండుగ) మానవాళికిస్తున్న మహత్తర సందేశం. అద్భుతమైన ఆదేశం. రమజాన్... పేరు వినగానే మనసు, త నువు తన్మయత్వంతో పులకించిపోతాయి. భక్తిభావంతో శిరస్సు వినమ్రంగా ఒంగిపోతుంది. గుండెల నిండా ఆనందం ఉప్పొంగుతుంది. నిజానికి రమజాన్ నెలరోజుల పండుగ అంటే అతిశయోక్తి కాదు. రమజాన్ నెలవంక కనిపించింది మొదలు షవ్వాల్ నెలవంక దర్శనం దాకా ఏకధాటిగా నెలరోజుల పాటు ముస్లింల ఇళ్లు, వీధులన్నీ ‘సహెరీ’ ‘ఇఫ్తార్’ల సందడిలో వినూత్న శోభను సంతరించుకుంటాయి. మసీదులన్నీ భక్తులతో కిటకిటలాడుతూ ప్రేమామృతాన్ని చిలకరిస్తూ ఉంటాయి. భక్తులు పవిత్ర ఖురాన్ పారాయణా మధురిమను గ్రోలుతూ పొందే వినూత్న అనుభూతులు, ఆనందాలు, ఆహ్లాదాలు, అనుభవాల అపూర్వ సమ్మేళనమే ఈదుల్ ఫిత్ ్రపర్వదినం. నిష్ఠగా ఉపవాసం రమజాన్ మాసంలో ప్రత్యేకంగా ఆచరించే ఆరాధన రోజా. ముస్లింలు అత్యంత నియమ నిష్ఠలతో ‘రోజా’ (ఉపవాసవ్రతం) పాటిస్తారు. అంటే రోజూ పద్నాలుగు గంటలకు పైగా అన్నపానీయాలకు, లైంగిక కోర్కెలకు దూరంగా ఉంటాడు. ఇక్కడ రోజా అనేది కేవలం కొన్ని గంటలపాటు పస్తు మాత్రమే ఉండే ప్రక్రియ కాదు. దీని ద్వారా మానవుల్లో మానవీయ సుగుణాలు పెంపొందించడం, ప్రేమ, కరుణ, జాలి, త్యాగం, సహనం, పరోపకారం లాంటి గుణాలను జనింపజేసి, సత్కార్యాల వైపు మనిషిని ప్రేరేపించడం అసలు ఉద్దేశ్యం. మానవ ఆత్మను పవిత్రతతో, పరిశుద్ధతతో నింపడం అసలు ధ్యేయం. ఉపవాసం వల్ల సహన శక్తి పెరుగుతుంది. ఉద్రేకాలు, ఆవేశకావేశాలు తగ్గి పోతాయి. భావాల్లో, ఆలోచనల్లో సమతూకం నెలకొంటుంది. బాధ్యతా భావం పెరుగుతుంది. మంచీచెడు విచక్షణ అలవడుతుంది. ఉపవాసం పాటించడం వల్ల పేదసాదల ఆకలి బాధ అనుభవపూర్వకంగా తెలిసి వస్తుంది. కడుపు నిండా తిండికి నోచుకోని అభాగ్యజీవులను ఆదుకోవాలన్న భావన వారిలో పెల్లుబుకుతుంది. ఆ తర్వాత ఈ మాసంలో మరో ముఖ్యమైన నియమం భక్తిశ్రద్ధలతో రోజూ ఐదుసార్లు నమాజు ఆచరించడం. నమాజు దైవభక్తితోపాటు సమానత్వ భావనను నేర్పుతుంది. ధనిక, బీద, ఎక్కువ, తక్కువ, అధికారి- సేవకుడు అనే తారతమ్యం లేకుండా అందరినీ ఏకం చేస్తుంది. ఎలాంటి అసమానతా దొంతరలు లేకుండా ఒకే పంక్తిలో, భుజాలు కలిపి దైవారాధన చేస్తారు. దానం కనీసం ధర్మం అలాగే ‘ఫిత్రా’దాన ం. ఆర్థిక ఇబ్బందుల కారణంగా పండుగ కూడా జరుపుకోలేని స్థోమత లేని వారికి ‘ఫిత్రా’ దానాల వల్ల ఎంతో కొంత ఊరట లభిస్తుంది. పేదసాదలు ఈ పైకంతో పండగ కు కావలసిన వస్తుసామగ్రి కొనుక్కొని పండుగ సంతోషంలో పాలు పంచుకోగలుగుతారు. ఫిత్రా దానాలకు ప్రతి పేదవాడూ అర్హుడే. ముస్లిములు, ముస్లిమేతరులు అన్న తారతమ్యం లేనే లేదు. సమాజంలోని పేదసాదల పట్ల సంపన్నులు తమ బాధ్యతను గుర్తెరిగి మసలుకోవాలి. అనవసర ఖర్చులు తగ్గించుకుని ఆగత్యపరులను ఆదుకోవాలి. ఇస్లామీయ ఆరాధనల్లో నమాజ్, రోజాలతోపాటు ‘జకాత్’ కూడా ముఖ్యమైనదే. ప్రతి కలిగిన వారు తమ సంపాదనలోని మిగులు ధనంపై రెండున్నర శాతం పేదసాదల కోసం అప్పగించాలి. ఇదేదో సంపన్నులు దయదలచి చేసే దానం కాదు. ‘జకాత్’ పేదల హక్కు. సమాజంలోని సంపన్నులంతా ఎలాంటి లోభత్వానికి, పిసినారి తనానికి పాల్పడకుండా నిజాయితీగా ‘జకాత్’ చెల్లిస్తే సమాజంలో పేదరికానికి, దారిద్య్రానికి అవకాశమే ఉండదని ఆర్థిక నిపుణుల అభిప్రాయం. ఏ ఆరాధన తీసుకున్నా, ప్రతిదానిలో ప్రేమ, కరుణ, జాలి, సహనం, త్యాగం, పరోపకారం, మానవ సమానత్వం, సర్వమానవ సౌభ్రాతృత్వం, చెడుల నిర్మూలన, మంచి, మానవీయ సుగుణాల విస్తరణ లాంటి అనేక అంశాల బోధనలే మనకు కనపడతాయి. ఒక పేదవాని మోముపై చిరునవ్వులు చూడలేని భక్తితత్వం, నిరర్థకం, నిర్హేతుకం. పండుగలు మనకిస్తున్న సందేశం ఇదే. - ఎండీ ఉస్మాన్ ఖాన్ నమాజును తాత్కాలికంగా వాయిదా వేసుకున్న ప్రవక్త! ఒకసారి ముహమ్మద్ ప్రవక్త మహనీయులు పండుగ నమాజు కోసం ఈద్గాకు వెళుతున్నారు. దారిలో ఒకబ్బాయి ఏడుస్తూ కనిపించాడు. చింపిరిజుట్టు, మాసిన దుస్తులు, కళ్లు పీక్కుపోయి ఒళ్లంతా దుమ్ముకొట్టుకునిపోయి దీనంగా ఉన్నాడు. నమాజుకు వెళుతున్న ప్రవక్త మహనీయులు అతడిని సమీపించి, ‘‘బాబూ! ఎందుకేడుస్తున్నావు? ఈ రోజు పండగ కదా! నీ ఈడు పిల్లలంతా శుభ్రంగా స్నానం చేసి, కొత్తబట్టలు తొడుక్కొని ఆనందంతో కేరింతలు కొడుతూ పండగ సంబరాల్లో మునిగిపోతే, నువ్వెందుకిలా బాధపడుతున్నావు?’’ అంటూ ఆరా తీశారు అనునయిస్తూ. అప్పుడా అబ్బాయి, ‘‘అయ్యా! నేనొక అనాథను. తల్లిదండ్రులు లేరు. ఈ రోజు పండుగ. నాతోటి పిల్లలంతా ఆనందంతో ఆడుతూ పాడుతూ ఈద్గాకు వెళుతున్నారు. వాళ్ల తలిదండ్రులు వారికవన్నీ సమకూర్చారు. మరి నాకెవరున్నారు? అమ్మానాన్నలుంటే నాక్కూడా అన్నీ సమకూర్చేవారు. కాని తలిదండ్రులు లేని అభాగ్యుణ్ణి నేను. ఏం చేయాలో పాలుపోక దుఃఖం పొంగుకొస్తోంది...’’ అంటూ ఇక మాట్లాడలేక భోరుమన్నాడు. ఈ మాటలు విన్న మమతల మూర్తి కారుణ్య హృదయం ద్రవించిపోయింది. పండుగ నమాజు కోసం వెళుతున్న ప్రవక్త వారు పండుగ ప్రార్థనను సైతం కాసేపటికోసం వాయిదా వేసుకుని బాబును ఇంటికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న ప్రవక్త సతీమణి హ// ఆయెషా సిద్ధిఖీ బాబును అక్కున చేర్చుకున్నారు. మాతృప్రేమతో గుండెలకు హత్తుకున్నారు. వెంటనే బాబుకు స్నానం చేయించి, మంచి దుస్తులు తొడిగారు. అత్తరు పూశారు. తలకు టోపీ పెట్టారు. తరువాత ప్రవక్త వారు - ‘‘ఈ రోజు నుండి నువ్వు అనాథవు కావు. మేమిద్దరం నీ తలిదండ్రులం. ఏమంటావు?’’ అని నుదుటిని ముద్దాడుతూ ప్రేమగా అడిగారు. అప్పుడా అబ్బాయి ఆనందంతో ‘‘ముహమ్మద్ ప్రవక్త నా తండ్రి, ఆయెషా సిద్ధిఖీ నా తల్లి’’ అంటూ అరిచాడు. ఈ విధంగా ఆ అబ్బాయి మోములో ఆనందం పూసిన తరువాతనే ప్రవక్త మనసు కుదుటపడింది. స్వహస్తాలతో అతడికి ఖర్జూర పాయసం తినిపించి, అప్పుడు బాబును వెంటబెట్టుకుని పండుగ నమాజుకు వెళ్లారు ప్రవక్త (స). పండుగ సంతోషంలో ఈద్ నమాజులాంటి దైవకార్యానికి వెళుతున్నాం కాబట్టి అనాథలు, అభాగ్యుల సంగతి తరువాత అని ప్రవక్త భావించలేదు. అభాగ్యుల మోముపై చిరునవ్వు మెరిసే వరకూ దైవకార్యాన్ని సైతం వాయిదా వేసుకున్నారు. -
ఇఫ్తార్‌కు మోదీ వెళ్లడం లేదు
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు ఇచ్చే ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ హాజరుకావడం లేదని బీజేపీ తెలిపింది. ఆయనకు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నందున ఆయన ఇఫ్తార్ కార్యక్రమానికి హాజరుకాలేకపోతున్నారని బీజేపీ అధికార ప్రతనిధి సుదాన్షు త్రివేది తెలిపారు. బుధవారం సాయంత్ర రాష్ట్రపతి ఈ ఇఫ్తార్ కార్యక్రమాన్ని ఏర్పాటుచేస్తున్నారు. అయితే, అదే సమయంలో ఉత్తరాధి ప్రాంతాల ముఖ్యమంత్రులతో ప్రత్యేక సమావేశ కార్యక్రమాలు ఉన్నాయని త్రివేది తెలిపారు. దీంతోపాటు 'స్కిల్ ఇండియా' కార్యక్రమాన్ని మోదీ ప్రారంభిస్తున్నారని స్పష్టం చేశారు. ఉత్తరాధి రాష్ట్రాల్లోని పలు అభివృద్ధి ప్రాజెక్టుల గురించి చర్చా కార్యక్రమాలు ఉన్నాయని తెలియజేశారు. -
నేడు రాష్ట్ర వ్యాప్తంగా దావత్-ఎ-ఇఫ్తార్
-
గవర్నర్ ఇఫ్తార్ విందుకు కాంగ్రెస్ దూరం
హైదరాబాద్: రాజ్‌భవన్‌లో శుక్రవారం గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఇచ్చిన ఇఫ్తార్ విందుకు కాంగ్రెస్ నాయకులు దూరంగా ఉన్నారు. ఇటీవల రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ హైదరాబాద్ విడిది సందర్భంగా ఆయన గౌరవార్థం రాజ్‌భవన్‌లో గవర్నర్ ఇచ్చిన విందుకు తమను ఆహ్వానించకపోవడాన్ని కాంగ్రెస్ నాయకులు తప్పుబడుతున్నారు. పలు సందర్భాలు, అంశాల్లో అధికారపక్షానికి అనుకూలంగా గవర్నర్ వ్యవహరిస్తున్నారనే అభిప్రాయంతో కాంగ్రెస్ నాయకులున్నారు. అందువల్లే గవర్నర్ ఇచ్చిన ఇఫ్తార్‌విందులో పాల్గొనకూడదని నిర్ణయించినట్లు ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. -
రంజాన్ వేళలు
రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో రంజాన్ వేళలను 'సాక్షి' పాఠకుల కోసం అందిస్తున్నాం.. నగరం ఇఫ్తార్ సహరీ హైదరాబాద్ సా.7.01 ఉ. 4.16 విజయవాడ సా.6.49 ఉ. 4.15 విశాఖపట్నం సా. 6.43 ఉ. 3.57 తిరుపతి సా. 6.48 ఉ. 4.23 నెల్లూరు సా. 6-44 ఉ. 4.17 కాకినాడ సా. 6.50 ఉ. 4.04 రాజమండ్రి సా. 6.50 ఉ. 4.06 కర్నూలు సా. 6.58 ఉ. 4.23 వరంగల్ సా. 7.01 ఉ. 4.16 కరీంనగర్ సా. 7.01 ఉ. 4.16 నిజామాబాద్ సా. 6.59 ఉ. 4.16 నల్లగొండ సా. 7.01 ఉ. 4.16 -
ఇఫ్తార్ వేళ.. గంజి పసందు
ఉపవాస దీక్షాధారులకు చల్లదనం వేలమంది ముస్లింలకు పంపిణీ వన్‌టౌన్ : సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకూ అన్న పానీయాలను పూర్తిగా పక్కన పెట్టి అత్యంత భక్తి శ్రద్ధలతో రంజాన్ ఉపవాస దీక్షలను కొనసాగిస్తున్న ముస్లింలకు ‘గంజి’ పసందునిస్తుంది. దీక్ష చేస్తున్న వారు గంజి తీసుకోవడం ద్వారా వారి కడుపును చల్లబరచడమే కాకుండా బలవర్ధకంగా వారిని తీర్చిదిద్దుతుంది. వన్‌టౌన్‌లోని వివిధ మసీదుల నిర్వాహకులు ప్రతి రోజూ గంజిని పంపిణీ చేస్తున్నారు. మసీదుల ద్వారా వివిధ ప్రాంతాల్లోని సేవాతత్పరులు సైతం నగర వ్యాప్తంగా ఇళ్లలో ఇఫ్తార్లు నిర్వహించే వారికి ఈ గంజి వంటకాన్ని పంపిణీ చే స్తున్నారు. దీక్షల విరమణ సమయంలో గ్లాసు గంజినైనా తాగేందుకు పోటీపడతారు. దశాబ్దాలుగా పంపిణీ నగరంలోని వించిపేట, తారాపేట, భవానీపురం తదితర ప్రాంతాల్లోని మసీదులు నిర్వాహకులు గంజిని ప్రత్యేకంగా తయారు చేయించి పంపిణీ చేస్తున్నారు. రెండు దశాబ్దాలుగా పశ్చి మ నియోజకవర్గంలో గంజి పంపిణీని నిర్వహిస్తున్నారు. వించిపేట షాహీ మసీదు వద్ద వందలాది మందికి గంజి పంపిణీ జరుగుతుంది. ఇక్కడ మధ్యాహ్నం ఒంటి గంటకు వ ందలాదిగా ముస్లింలు బారులు తీరి కనిపిస్తారు. పేదల కోసమే.. పూర్వం నిరుపేదలైన ముస్లింలు అనేక మంది రంజాన్ ఉపవాస దీక్షలుండేవారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసాలున్నాక సాయంత్రానికి సరైన ఆహారాన్ని తీసుకోవడానికి కూడా వారికి ఆర్థిక పరిస్థితి సహకరించేదికాదు. ఉపవాసాలున్నవారు ఇఫ్తార్ వేళకు అన్నం లేకున్నా కనీసం గంజి నీళ్లైనా తీసుకోవాలనే భావనతో దీని పంపిణీని ప్రారంభించారని ముస్లిం పెద్దలు వివరిస్తున్నారు. మొత్తం మీద చాలా కుటుంబాలు ఇఫ్తార్ సమయంలో గంజి తీసుకోవడం ఆనవాయితీగా మారింది. గంజిని ఇలా తయారు చేస్తారు.. గంజి తయారీలో ఉప్మా రవ్వ, లవంగ, యాలుక్కాయలు, మసాలా దినుసులు, ఉల్లిపాయలు, టమాటా, వెల్లులిపాయలను నూనెతో కలిపి గంజిని తయారు చేస్తారు. ముందుగా మసాలా దినుసులను వెల్లుల్లి, ఉల్లిపాయ, టమాటాలను నూనెలో వేయిస్తారు. వేయించడం పూర్తయ్యాక పెద్ద వంట పాత్రల్లో నిండా నీళ్లు పోస్తారు. నీళ్లు బాగా మరిగాక అందులో రవ్వను గడ్డకట్టకుం డా వేస్తూ కలియ తిప్పుతారు. కొద్దిసేపు వంట పాత్రలోనే ఉంచి పంపిణీ చేస్తారు. -
ముస్లింలకు సీఎం రంజాన్ కానుకలు, వరాలు
-
మూడేళ్ల తర్వాత సోనియా ఇఫ్తార్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మూడేళ్ల తరువాత ఇఫ్తార్ విందు ఇచ్చారు. యూపీఏ మిత్రపక్షాల నేతలు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఈ విందుకు హాజరయ్యారు. ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, జేడీయూ అధ్యక్షుడు శరద్ యాదవ్‌లు ఈ విందులో సోనియా పక్కనే కూచున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మాజీ ఎన్నికల ప్రధానాధికారి ఖురేషీ పక్కన ఆసీనులు కాగా, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ దౌత్యవేత్తల దగ్గర కనిపించారు. ఎన్సీపీ నాయకుడు తారీఖ్ అన్వర్, సినీ నటి షర్మిలా ఠాగోర్ తదితరులు సోనియా ఇచ్చిన ఇఫ్తార్‌కు హాజరయ్యారు. -
ఇఫ్తార్ విందుకు హాజరైన వైఎస్ జగన్