
ఇఫ్తార్ విందులో పాల్గొన్న వైఎస్ జగన్
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మోహదీపట్నంలో జరిగిన ఇఫ్తార్ విందుకు ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు వైఎస్ జగన్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.