పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం సోదరుల కోసం తలపెట్టిన దావత్-ఎ-ఇఫ్తార్ విందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం సాయంత్రం రాష్ట్రంలోని 195 మసీదుల్లో సుమారు 2 నుంచి 3 లక్షల మందికి ఇఫ్తార్, డిన్నర్ ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్‌లో 100 మసీదులు, 9 జిల్లాల్లో నియోజకవర్గ కేంద్రానికి ఒకటి చొప్పున 95 మసీదులను ఎంపిక చేశారు. ఇందుకోసం మసీదు కమిటీలకు రూ. 2 లక్షల చొప్పున ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఇప్పటికే రాజధాని నగరంలోని మసీదులకు ఆన్‌లైన్ ద్వారా, జిల్లాల్లోని మసీదులకు కలెక్టర్ల ద్వారా నిధులు అందించారు. ప్రతి మసీదులో కనీసం వెయ్యి మందికి తగ్గకుండా ఇఫ్తార్‌లో పండ్లు, డిన్నర్‌లో బిర్యానీ, స్వీట్లు ఏర్పాట్లు చేయాలని మసీదు కమిటీలకు అధికారులు ఆదేశించారు. ప్రభుత్వం అందించిన నిధుల్లోనే 2 వేల మంది వరకు కూడా ఇఫ్తార్, విందు ఏర్పాటు చేసేందుకు కొన్ని మసీదు కమిటీలు ముందుకొచ్చాయి