ఇఫ్తార్కు మోదీ వెళ్లడం లేదు | Modi not to attend President's Iftar: BJP | Sakshi
Sakshi News home page

ఇఫ్తార్కు మోదీ వెళ్లడం లేదు

Published Wed, Jul 15 2015 2:42 PM | Last Updated on Fri, Aug 24 2018 2:17 PM

ఇఫ్తార్కు మోదీ వెళ్లడం లేదు - Sakshi

ఇఫ్తార్కు మోదీ వెళ్లడం లేదు

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు ఇచ్చే ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ హాజరుకావడం లేదని బీజేపీ తెలిపింది. ఆయనకు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నందున ఆయన ఇఫ్తార్ కార్యక్రమానికి హాజరుకాలేకపోతున్నారని బీజేపీ అధికార ప్రతనిధి సుదాన్షు త్రివేది తెలిపారు.

బుధవారం సాయంత్ర రాష్ట్రపతి ఈ ఇఫ్తార్ కార్యక్రమాన్ని ఏర్పాటుచేస్తున్నారు. అయితే, అదే సమయంలో ఉత్తరాధి ప్రాంతాల ముఖ్యమంత్రులతో ప్రత్యేక సమావేశ కార్యక్రమాలు ఉన్నాయని త్రివేది తెలిపారు. దీంతోపాటు 'స్కిల్ ఇండియా' కార్యక్రమాన్ని మోదీ ప్రారంభిస్తున్నారని స్పష్టం చేశారు. ఉత్తరాధి రాష్ట్రాల్లోని పలు అభివృద్ధి ప్రాజెక్టుల గురించి చర్చా కార్యక్రమాలు ఉన్నాయని తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement