న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మూడేళ్ల తరువాత ఇఫ్తార్ విందు ఇచ్చారు. యూపీఏ మిత్రపక్షాల నేతలు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఈ విందుకు హాజరయ్యారు. ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, జేడీయూ అధ్యక్షుడు శరద్ యాదవ్‌లు ఈ విందులో సోనియా పక్కనే కూచున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మాజీ ఎన్నికల ప్రధానాధికారి ఖురేషీ పక్కన ఆసీనులు కాగా, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ దౌత్యవేత్తల దగ్గర కనిపించారు. ఎన్సీపీ నాయకుడు తారీఖ్ అన్వర్, సినీ నటి షర్మిలా ఠాగోర్ తదితరులు సోనియా ఇచ్చిన ఇఫ్తార్‌కు హాజరయ్యారు.