ఇఫ్తార్ విందుకు పాక్ ను ఆహ్వానించం: ఆర్ఎస్ఎస్ | RSS-linked Muslim Rashtriya Manch withdraws Iftar invite to Pak envoy after Pampore attack | Sakshi
Sakshi News home page

ఇఫ్తార్ విందుకు పాక్ ను ఆహ్వానించం: ఆర్ఎస్ఎస్

Published Tue, Jun 28 2016 4:47 PM | Last Updated on Sat, Mar 23 2019 8:04 PM

RSS-linked Muslim Rashtriya Manch withdraws Iftar invite to Pak envoy after Pampore attack

న్యూఢిల్లీ: రాష్ట్ర్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ముస్లీం విభాగతమైన ముస్లిం రాష్ట్ర్రీయ మంచ్(ఎమ్ఆర్ఎమ్) దేశ రాజధానిలో ఇస్తున్న ఇఫ్తార్ విందుకు పాకిస్థాన్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ ను ఆహ్వానించకూడదని నిర్ణయించింది. జులై 2 న ఎమ్ఆర్ఎమ్ ప్రపంచ ముస్లిం దేశాల రాయబారులకు ఢిల్లీలో ఇఫ్తార్ విందు ఇవ్వనున్న విషయం తెలిసిందే.

పాకిస్థాన్ హై కమిషనర్ అబ్దుల్ బాసిత్ భారత జవాన్లపై పాక్ ఉగ్రవాద సంస్థ దాడి నేపథ్యంలో ఖండించనందుకు తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ఎమ్ఆర్ఎమ్ కన్వీనర్ మహ్మద్ అఫ్జల్ పేర్కొన్నారు. పాకిస్థాన్ కు చెందిన లష్కరే తోయిబా ఈ నెల 25న జమ్ముకశ్మీర్ లోని పంపొరాలో సీఆర్పీఫ్ పోలీసులపై దాడి చేసిన ఘటనలో ఎనిమిది మంది జవాన్లు మృతి చెందగా మరో22 మంది తీవ్రంగా గాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement