సాద్ వారైచ్
న్యూఢిల్లీ: భారత్‌లో ఆరెస్సెస్ ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తోందని పాక్ విమర్శించింది. ఐక్యరాజ్య సమితిలో సుష్మాస్వరాజ్ ప్రసంగానికి పాక్ ప్రతినిధి సాద్ వారైచ్ సమాధానమిస్తూ.. భారత్‌లో ‘ఫాసిస్టు’ ఆరెస్సెస్ కారణంగా మతసామరస్యం దెబ్బతింటోందని.. కేంద్ర ప్రభుత్వం ఇందుకు పూర్తిగా సహకరిస్తోందని విమర్శించారు. ‘మా (ఆసియా) ప్రాంతంలో నియంతృత్వ ఆర్‌ఎస్‌ఎస్ కేంద్రాలు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నాయి.
భారతదేశంలో మైనారిటీలైన ముస్లింలు, క్రైస్తవులపై అత్యాచారాలు జరుగుతున్నాయి. హిందుత్వవాది అయిన యోగి ఆదిత్యనాథ్ యూపీ సీఎంగా ఉన్నారు. భారత్ నుంచి వచ్చే వారు ఇతరులకు సూక్తులు చేప్పాల్సిన పనిలేదు’అని వారైచ్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. అస్సాంలో జాతీయ పౌర రిజిస్టర్ పేరుతో మైనారిటీల ఓట్లను తొలగించారన్నారు. అమిత్ షా వ్యాఖ్యలను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ఓ ముఖ్యనేత వారిని దేశం నుంచి బహిష్కరిస్తామన్నారని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment