శుక్రవారం కువైట్‌లోని మాలియా ప్రాంతంలో ఉన్న ఆంధ్రా మ్యాక్స్ హోటల్‌లో వైఎస్‌ఆర్‌సీపీ కువైట్ కమిటీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు జరిగింది.
రంజాన్ మాసం శుభప్రదమైనదని ఉపవాసం ద్వారా పేదవారి ఆకలి తెలుస్తుందని, తద్వారా వారి ఆకలి తీర్చేందుకు సహాయం చేయాలనే అవకాశం భావన కలుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ కువైట్ కమిటీ కో కన్వీనర్లు గోవిందు నాగరాజు, ఎంవీ నరసారెడ్డి, రెహమాన్ ఖాన్, నాయని మహేష్‌రెడ్డి, గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు పి. రెహమాన్ ఖాన్, సభ్యులు సయీద్ నజర్, గఫార్, మన్నూరు చంద్రశేఖర్‌రెడ్డి, రమణ యాదవ్, సురేష్‌రెడ్డి, శ్రీనివాసులరెడ్డి, నాగిరెడ్డి చంద్ర పాల్గొన్నారు.