
కువైట్‌లో కేక్ కట్ చేస్తున్న వైఎస్సార్‌సీపీ నేతలు
ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 3000 కిలోమీటర్లు దాటుతున్న సందర్భంగా కువైట్‌లో పార్టీ అభిమానులు కేట్ కట్‌చేసి సంఘీభావం తెలిపారు. ‘మేము సైతం జగన్ కోసం’ కమిటీ కార్యవర్గ సభ్యులు 30 కేజీల కేట్ కట్‌చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. కువైట్ వైఎస్సార్‌సీపీ బీసీ ఇంఛార్జ్ కే రమణ మాట్లాడుతూ.. వైఎస్ జగన్‌పై ఉన్న అభిమానంతో యాదవ సామాజిక వర్గానికి చెందిన కొందరు యువకులతో మేము సైతం జగనన్న కోసం అనే సంస్థను ఏర్పాటు చేశామని తెలిపారు. దీని ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
సీఎం చంద్రబాబు నాయుడు మోసపూరిత వాగ్ధానాలను ఎండగడుతూ.. ప్రజలకోసం చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయవంతం కావాలని కువైట్ ప్రతినిధులు అకాంక్షించారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్ సీఎం అయితే తమ సామాజిక వర్గానికి న్యాయం జరుగుతుందని.. ఎన్నికల సమయంలో తమ స్వస్థలాలకు వచ్చి జగన్ విజయం కొరకు పనిచేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న గల్ఫ్, కువైట్ కన్వీనర్లు ఇలియాస్ చిహెచ్ ముమ్మడి బాలిరెడ్డి మాట్లాడుతూ.. నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతున్న ఏకైక నేత వైస్ జగన్ అని కోనియాడారు. ఈ కార్యక్రమంలో మణి యాదవ్, వెంటకేష్, ఎస్ గంగాధర్, సుబ్రహ్మణ్య స్వామి, బాబు యాదవ్ తదితరులు పాల్గోని విజయవంతం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment