Kuwait YSRCP supporters
-
కువైట్‌లో మహానేత వైఎస్ఆర్కు ఘన నివాళి
కువైట్: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా కువైట్ వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు, అభిమానులు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కువైట్ చరిత్రలోనే మొట్టమొదటి సారిగా దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డిపైనా క్రియేటివ్ మాస్ మస్తాన్ గారి డైరెక్షన్ లో వై.యస్.ఆర్ జిల్లా పెనగలూరు మండలంకు చెందిన పెడమల్లి మోహన్ రెడ్డి రచించి గానం చేసిన తొలి తెలుగు పాటను కువైట్ కన్వీనర్ ముమ్మడి బాలి రెడ్డి, సీనియర్ నాయకులు దుర్గ రెడ్డి గార్ల చేతుల మీదుగా ఈ పాటను విడుదుల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డిపైనా ఇంతటి మంచి పాట చేసినందుకు మస్తాన్, మోహన్ రెడ్డిని అభినందించారు. కో-కన్వీనర్లు గోవిందు నాగరాజు యం.వి నరసా రెడ్డి మాట్లాడుతూ.. సూర్య చంద్రలు ఉన్నంత వరకు భూమి ఆకాశం ఉన్నంత వరకు మహా నాయకులు దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి ప్రతి తెలుగు వారి గుండెల్లో శాశ్వతముగా ఉంటారని ఆయన ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు అన్ని వర్గాల వారికి కుల, మత, పేద, ధనిక, పార్టీలకు అతీతంగా అందాయని అన్నారు. ఆ జనహృదయ నేతకు గల్ఫ్ ప్రవాసాంధ్రుల తరపున నివాళిలు అర్పించారు. తదుపరి కోకన్వీనర్ యం.వి నరసారెడ్డి గారి ఆధ్వర్యంలో అన్న దానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కమిటి ప్రధాన కోశాధికారి నాయిని మహేశ్వర రెడ్డి, పులపుత్తూరు సురేష్ రెడ్డి, యువజన విభాగం లీడర్ మర్రి కల్యాణ్, బీసీ సంఘం లీడర్ రమణ యాదవ్, మైనారిటీ విభాగం సభ్యులు రహంతుల్లా, యువజన విభాగం సభ్యులు షేక్ సబ్దర్, హరినాథ్ చౌదరి, జగనన్న యూత్ ఫోర్స్ అధ్యక్షలు లక్ష్మి ప్రసాద్ పాల్గొన్నారు. -
కువైట్‌లో మేము సైతం జగన్ కోసం
ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 3000 కిలోమీటర్లు దాటుతున్న సందర్భంగా కువైట్‌లో పార్టీ అభిమానులు కేట్ కట్‌చేసి సంఘీభావం తెలిపారు. ‘మేము సైతం జగన్ కోసం’ కమిటీ కార్యవర్గ సభ్యులు 30 కేజీల కేట్ కట్‌చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. కువైట్ వైఎస్సార్సీపీ బీసీ ఇంఛార్జ్ కే రమణ మాట్లాడుతూ.. వైఎస్ జగన్‌పై ఉన్న అభిమానంతో యాదవ సామాజిక వర్గానికి చెందిన కొందరు యువకులతో మేము సైతం జగనన్న కోసం అనే సంస్థను ఏర్పాటు చేశామని తెలిపారు. దీని ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. సీఎం చంద్రబాబు నాయుడు మోసపూరిత వాగ్ధానాలను ఎండగడుతూ.. ప్రజలకోసం చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయవంతం కావాలని కువైట్ ప్రతినిధులు అకాంక్షించారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్ సీఎం అయితే తమ సామాజిక వర్గానికి న్యాయం జరుగుతుందని.. ఎన్నికల సమయంలో తమ స్వస్థలాలకు వచ్చి జగన్ విజయం కొరకు పనిచేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న గల్ఫ్, కువైట్ కన్వీనర్లు ఇలియాస్ చిహెచ్ ముమ్మడి బాలిరెడ్డి మాట్లాడుతూ.. నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతున్న ఏకైక నేత వైస్ జగన్ అని కోనియాడారు. ఈ కార్యక్రమంలో మణి యాదవ్, వెంటకేష్, ఎస్ గంగాధర్, సుబ్రహ్మణ్య స్వామి, బాబు యాదవ్ తదితరులు పాల్గోని విజయవంతం చేశారు. -
రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టిన బాబు
కువైట్ : జననేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని 2019లో ముఖ్యమంత్రి చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కువైట్ కన్వీనర్లు పిలుపునిచ్చారు. ఫర్వానియాలో ఉన్న రాయలసీమ హోటల్లో వైకాపా కోశాధికారి పిడుగు సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాకు చెందిన 30 మంది ప్రవాసాంధ్రులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కువైట్ కమిటీలో చేరారు. ఈ సందర్బంగా గల్ఫ్, కువైట్ కన్వీనర్లు ఇలియాస్ బీహెచ్, ముమ్మడి బాలిరెడ్డి మాట్లాడుతూ.. అనుభవంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తానని చంద్రబాబు, దేశాన్ని ముందుకు నడిపిస్తానని నరేంద్రమోదీ 2014 ఎన్నికల ప్రచారంలో దరగొట్టారని, తీరా గెలిచిన తర్వాత రాష్ట్రానికి హోదా ఇవ్వకుండా మోదీ, హోదా కోసం పోరాడకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేశారని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్దిని, ప్రజల సంక్షేమాన్ని చంద్రబాబు గాలికోదిలేసి కేంద్ర నిధులను ఏ విధంగా దోచుకోవాలన్న దానిపైనే ఎక్కువ శ్రద్ధ పెట్టారని అన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలందరికి ఉందని, ముఖ్యంగా ప్రవాసాంధ్రుల కుటుంబాలు మీపైనే ఆధారపడి ఉంటాయి కనుక వారికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే ఓటు వేసేలా సూచించాలని తెలిపారు. పిడుగు సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రాభివృద్ది కేవలం జగన్ ద్వారా మాత్రమే సాధ్యమన్నారు. ఈ విషయాన్ని నమ్మి కమిటీలో చేరిన వారందరికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కో-కన్వీనర్ యం.వి.నరసారెడ్డి, గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు పి. రెహామాన్ ఖాన్, యూత్ ఇంచార్జ్ మర్రి కళ్యాణ్, సోషల్ మీడియా ఇంచార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి, సలహాదారులు నాగిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, లలితరాజ్, సాంస్కృతిక విభాగం ఇంచార్జ్ కె.వాసుదేవ రెడ్డి, సేవాదళ్ వైస్ ఇంచార్జ్ కె. నాగసుబ్బా రెడ్డి, సభ్యులు షేక్. రహెమతుల్లా, షేక్. సర్దార్, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నీతి మాటలు ఎక్కడికి పోయాయి చంద్రబాబు
కువైట్ : రాజ్యాంగాన్ని కాపాడవలసిన గవర్నర్ నరసింహన్ వైఎస్ఆర్సీపీ టికెట్ మీద గెలిచిన వారిని టీడీపీలో మంత్రి పదవులకు ప్రమాణస్వీకారం చేయించడం దారుణమని వైఎస్ఆర్సీపీ కువైట్ కమిటీ నాయకులు అన్నారు. ఈ పరిణామాలను చూస్తూంటే ఆయన గవర్నరా..? లేక టీడీపీ పార్టీ కార్యకర్తా..? అనే అనుమానం ప్రజలకు కలుగుతోందని తెలిపారు. వైఎస్ఆర్సీపీ టికెట్‌పై గెలిచిన 21 మంది ఎమ్మెల్యేలతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ ఫిరాయింపజేశారని మండిపడ్డారు. 21మంది ఎమ్మెల్యేలను రాజ్యాంగం ప్రకారం ఎమ్మెల్యే పదవులకు స్పీకర్ అనర్హులుగా ప్రకటించాలి. కానీ, ఆలా జరగకుండా స్పీకర్ ఆ 21 మంది ఎమ్మెల్యేలను కాపాడుకుంటూ వస్తున్నారని ధ్వజమెత్తారు. ఇలా రాజ్యాంగాన్ని అవమానించే వ్వక్తి స్పీకర్‌గా ఉండటం అసెంబ్లీకే అవమానమని పేర్కొన్నారు. తెలంగాణాలో తెలుగుదేశం ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లోకి తీసుకుపోయి మంత్రి పదవి ఇస్తే సత్యహరిచంద్రుడికే తాతలా చంద్రబాబు ప్రజాస్వామ్యం గురించి నీతులు మాట్లాడారని వైఎస్ఆర్సీపీ కువైట్ కమిటీ నాయకులు గుర్తు చేశారు. మరి ఈ రోజు చంద్రబాబు నీతి మాటలు ఎక్కడికి పోయాయని నిలదీశారు. అంటే మీరు పక్కవాడికి చెప్పుకోడానికే నీతులా..? మీరు చేయడానికి కాదా..? అని మండిపడ్డారు. చంద్రబాబు రాజకీయ జీవితమంతా వెన్నుపోటు రాజకీయాలేనని వైఎస్ఆర్సీపీ కువైట్ కమిటీ నాయకులు నిప్పులు చెరిగారు. అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం.. దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. చంద్రబాబుకు దమ్ము, దైర్యం ఉంటే తమ పార్టీ చేసిన సవాల్ స్వీకరించాలని సవాలు విసిరారు. వైఎస్ఆర్సీపీ టికెట్ పై గెలిచిన 21మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లి ఎవరి సత్తా ఏమిటో తేల్చుకోవాలన్నారు. రాజ్యాంగానికి విరుద్దంగా టీడీపీ నడుచుకోవడంతో దీన్ని ప్రజాస్వామ్యంలో బ్లాక్ డేగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారని తెలిపారు. రాజ్యాంగ విరుద్దమైన పనులను వ్యతిరేకిస్తూ చంద్రబాబు మెడలు వంచేదుకు వైఎస్ఆర్సీపీ కువైట్ కమిటీ నాయకులు నిరసన ధర్నాచేపట్టారు. కువైట్ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి, కో కన్వీనర్లు గోవిందు నాగరాజు, యం.వి నరసారెడ్డి, ట్రేజరర్ నాయని మహేష్ రెడ్డి, ఆకుల చలపతి, షేక్ కలామ్, యూత్ టీం ఇంచార్జీ, మర్రి కళ్యాణ్, యూత్ నాయకులు సయ్యద్ సజ్జాద్, రఫీక్ ఖాన్, షేక్ సర్దార్, రావురి రమణ, హనుమంత్ రెడ్డి, కల్లూరి వాసు, బి.యన్.సింహ రెడ్డి, ఓబులపు మోహన్ రెడ్డి, పిడుగు సుబ్బారెడ్డి, గోవిందు రాజు, శివ బాల, రవి శంకర్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.