రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టిన బాబు | Chandrababu Is A Cheater Says YSRCP Kuwait Committee | Sakshi
Sakshi News home page

రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టిన బాబు

Published Sat, Mar 17 2018 9:09 PM | Last Updated on Sat, Aug 18 2018 6:18 PM

Chandrababu Is A Cheater Says YSRCP Kuwait Committee - Sakshi

కువైట్‌ : జననేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని 2019లో ముఖ్యమంత్రి చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కువైట్‌ కన్వీనర్లు పిలుపునిచ్చారు. ఫర్వానియాలో ఉన్న రాయలసీమ హోటల్‌లో వైకాపా కోశాధికారి పిడుగు సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాకు చెందిన 30 మంది ప్రవాసాంధ్రులు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కువైట్‌ కమిటీలో చేరారు. ఈ సందర్బంగా గల్ఫ్‌, కువైట్‌ కన్వీనర్లు ఇలియాస్‌ బీహెచ్‌, ముమ్మడి బాలిరెడ్డి మాట్లాడుతూ.. అనుభవంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తానని చంద్రబాబు, దేశాన్ని ముందుకు నడిపిస్తానని నరేంద్రమోదీ 2014 ఎన్నికల ప్రచారంలో దరగొట్టారని, తీరా గెలిచిన తర్వాత రాష్ట్రానికి హోదా ఇవ్వకుండా మోదీ, హోదా కోసం పోరాడకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేశారని ఆరోపించారు.

రాష్ట్ర అభివృద్దిని, ప్రజల సంక్షేమాన్ని చంద్రబాబు గాలికోదిలేసి కేంద్ర నిధులను ఏ విధంగా దోచుకోవాలన్న దానిపైనే ఎక్కువ శ్రద్ధ పెట్టారని అన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలందరికి ఉందని, ముఖ్యంగా ప్రవాసాంధ్రుల కుటుంబాలు మీపైనే ఆధారపడి ఉంటాయి కనుక వారికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకే ఓటు వేసేలా సూచించాలని తెలిపారు. పిడుగు సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రాభివృద్ది కేవలం జగన్‌ ద్వారా మాత్రమే సాధ్యమన్నారు. ఈ విషయాన్ని నమ్మి కమిటీలో చేరిన వారందరికి అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కో-కన్వీనర్‌ యం.వి.నరసారెడ్డి, గవర్నింగ్‌ కౌన్సిల్‌ సభ్యుడు పి. రెహామాన్‌ ఖాన్‌, యూత్‌ ఇంచార్జ్‌ మర్రి కళ్యాణ్‌, సోషల్‌ మీడియా ఇంచార్జ్‌ ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి, సలహాదారులు నాగిరెడ్డి చంద్రశేఖర్‌ రెడ్డి, లలితరాజ్‌, సాంస్కృతిక విభాగం ఇంచార్జ్‌ కె.వాసుదేవ రెడ్డి, సేవాదళ్‌ వైస్‌ ఇంచార్జ్‌ కె. నాగసుబ్బా రెడ్డి, సభ్యులు షేక్‌. రహెమతుల్లా, షేక్‌. సర్దార్‌, మోహన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement