ఎన్నికలు దగ్గర పడుతు న్నాయ్. వ్యూహ ప్రతివ్యూహా లతో అన్ని పార్టీలు సిద్ధం అవు తున్నాయ్. మరీ ముఖ్యంగా రాష్ట్రాన్ని వీసంకూడా ముందుకు తీసుకువెళ్లని చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరుగెత్తుతూ ఉంటాయ్. వారిలో వారే తమకి అనుకూలంగా పిచ్చి లెక్కలు వేసుకుని ధైర్యం తెచ్చు కుంటూ ఉంటారు. ఇలాంటప్పుడు ఏ టెక్నాలజీ వారికి వెన్నుదన్నుగా నిలవదు. పవర్‌లో ఉన్న వర్గానికి అన్నీ మైనస్ పాయింట్లే ఉంటాయ్. జరిగిన టరమ్‌లో చెప్పి నవేవీ చెయ్యలేదు. కాబట్టి అదొక మైనస్. తన వర్గాన్ని మినహా మిగతా వర్గాల్ని పూర్తిగా మర్చిపోవడం మరో పెద్ద మైనస్. అవినీతి, బంధుప్రీతి సాగేటప్పుడు ఏలిన వారికి తెలియదు. పిల్లి కుండ లోపలికి మెడపెట్టి తాగినట్టే ఒక దశలో నడుంమీద ఒకే ఒక దెబ్బ పడ్డప్పుడు పిల్లికి తెలుస్తుంది.
మన పవర్ పాలిటిక్స్ కూడా అంతే. ‘జనం లోంచి ఒక జెండా గుర్తు మీద గెలిచివచ్చిన ఎమ్మెల్యేలని గుంపుగా కొనేసి పార్టీలో వేసుకోవడం చాలా దారుణం. పైగా ఆ బలంతో పని కూడా ఆ పార్టీకి లేదు. ఈ అప్రజాస్వామిక చర్యని, నైతిక విలువల్ని గౌరవించే వారంతా గమనించారు. ముక్కున వేలేసుకున్నారు. అమ్ముడుబోయిన కొందరికి మంత్రి పదవులు కూడా దక్కినప్పుడు, కొందరు సన్మార్గులు ఈ లోకంలో దేవుడు లేడేమోననే సందేహంలో పడ్డారు. ఆ చర్యకి పాల్పడ్డవారే ఇప్పుడు సాక్షాత్తూ ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడి, మైకులు పగుల గొడుతుంటే ప్రజలు అవాక్క యిపోతున్నారు. ‘జగన్‌మోహన్‌రెడ్డికి పదవీకాంక్ష ఉందని పదే పదే అంటున్న టీడీపీ తమ్ముళ్లు మనకున్నదేవిటో చెబితే తెలుసుకు ఆనందిస్తామని సామాన్య ఓటర్లు అడుగుతున్నారు. దయచేసి చెప్పరా? మనలో తెలుగుతల్లి ముద్దుబిడ్డలు, దేశభక్తులు ఎవరో చేతులెత్తండి. తెలు సుకుని వారికి పాదాభివందనం చేస్తాం’ అంటున్నారు పాతకాలపు పెద్దమనుషులు.
ప్రజాధనంతో ప్రజలకు మంజూరు చేసే ధన స్థల వస్తు వాహనాలను ‘చంద్రన్న కానుకలుగా’ ఇవ్వడం సబబేనా? కనీసం ముఖ్యమంత్రి కానుకగా, ప్రభుత్వ కానుకగా చెప్పవచ్చు. ‘జనం సొమ్ము తిన్నంత తిని జనా నికి పంచడం కూడా గొప్పేనా?’’ అని ఓ స్వాతంత్య్ర సమ రయోధుడు నోరు చేసుకున్నాడు. ఇది చాలా దారుణం అంటూ పళ్లుకొరికాడు. రచ్చబండమీద కూచుని వింటున్న ఓ కొత్త ఓటరు, ‘‘అసలామాటకొస్తే చంద్రబాబు ప్రక టించే పథకాలకి, పింఛన్లకి డబ్బు సిద్ధం చేస్తోంది మన ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు. రాష్ట్రం కటకట లాడుతున్నా యనమల ఎట్లానో డబ్బు పుట్టిస్తున్నాడు. మాకాపు బిడ్డ! నిజానికి కిరీటం ఆయనకి పెట్టాల. ‘యన మల బాబాయ్‌సారె’ పేరుతో కొన్నైనా ముట్టజెప్పాలి. లేదంటే ఉద్యమిస్తా’’ అన్నాడు ఆవేశంగా. ‘ఊరుకోరా అబ్బాయ్. అసలే చంద్రబాబు ఎక్కడ ఏ చిన్న అలికిడైనా కంగారు పడుతున్నాడు. ఇప్పుడీమాట తెలిసిందంటే ఇంత చలిలోనూ చెమట్లు పడతాయ్’. ఆ గొంతుతో రచ్చ బండ వంత పలికింది. ‘.... లేకపోతే జగన్ హత్యా ప్రయత్నం కేసు విచారణ ఏ సంస్థకి అప్పగిస్తే చంద్ర బాబుకెందుకు? అసలు ఆయనకేమాత్రం సంబంధంలేని సంగతి కదా? ‘జగన్ పాదయాత్ర సంవత్సరంపైగా సాగి, మనిషి మనిషిని ఆత్మీయంగా పలకరించింది.
ప్రజా సంకల్పయాత్రని పవర్ నేతలు దిగజార్చే ప్రయత్నం చేశారు. కానీ అది మరింతగా ప్రతిష్ట పెంచుకుంది. అక్కణ్ణించి బాబు ఆకు కదిలినా ఉలికి ఉలికి పడుతున్నారు’ అని ఓ స్టూడెంట్ కుర్రాడు అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టు చెప్పాడు.‘జగన్‌మోహన్‌రెడ్డి ఎప్పుడూ రాష్ట్ర పగ్గాలు పట్టుకో లేదు. పెద్దలనించి సంక్రమించిన వ్యాపారాలని, వ్యాపకా లని నిర్వహించుకుంటున్నారు. ఆయనమీద వీళ్లంతా వేయినోళ్లతో అవినీతి ఆరోపణలు చేయడంలో లాజిక్ ఎక్కడుంది?’ అని వేష్ట పడ్డాడు ఒకాయన. మరొకాయన ఏదో గుర్తొచ్చినవాడిలా నవ్వి, అసలు చంద్రబాబు ఓ నలుగురు పెద్ద మంత్రుల్ని పాదయాత్రకి పంపాల్సింది. వదిలిపోయేది’ అనేసరికి నవ్వులు శ్రుతి కలిపారు. ‘అమ్మో.. ఆయనకి చచ్చే భయం. వాళ్లు నలుగురూ రోడ్డున పడి స్పీచ్‌లిచ్చుకుంటూ జనం మధ్య తిరిగితే ఇంకే మన్నా ఉందీ.. కొంప కొల్లేరైపోదూ... మీరీ నాలుగేళ్లలో బాబు కాకుండా చినబాబు కాకుండా ఏ మంత్రి అయినా గొంతెత్తి ఒక్కమాట మాట్లాడటం ఎవరైనా విన్నారా?’ ‘కొందరున్నారులే... వాళ్లచేత పనికిమాలిన ప్రకటనలి ప్పిస్తూ, తిట్లు తిట్టిస్తూ ఉంటాడు. పాపం, వాళ్లు దానికే పరిమితం’ అని ముక్తాయించిందో గొంతు. ఓ పెద్దాయన లాల్చీ చేతులు విదిల్చి, మీరెరుగరు గానీ మునుపు దేశంలో ఏ సమస్య వచ్చినా– ‘దీనిలో విదేశీ హస్తం ఉంది’ అని ఆరోపించేవారు. చివరికదొక హాస్యోక్తిగా మారింది. ప్రస్తుతం చంద్రబాబు సంక్రాంతి కోడి పందేల బెట్టింగు లలో ఒక వర్గం యాభై కోట్లు పోగొట్టుకుందంటే ఇదంతా మోదీ కుట్ర అని తేల్చిచెబుతున్నారు. జనం నవ్వు తున్నారు.
శ్రీరమణ
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)
Comments
Please login to add a commentAdd a comment