సాక్షి,హైదరాబాద్: రైతుల పక్షపాతి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అని తాజా మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. అమెరికాలోని ఫిలడెల్ఫియా నగరంలో జరుగుతున్న నాటా ఉత్సవాల్లో వైఎస్సార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా వైఎస్సార్ జయంతి నిర్వహించారు. అనంతరం వైఎస్సార్ ఫౌండేషన్ అధ్యక్షుడు ఆళ్ల రామిరెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ జీవితాంతం పేద, బడుగు బలహీన వర్గాల కోసం బతికిన మహానాయకుడని కొనియాడారు. వైఎస్సార్ మాదిరిగానే ఆయన కుమారుడు, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల కోసం నిరంతరం పోరాటాలు చేస్తూ గొప్ప నాయకుడిగా ఎదిగారని తెలిపారు. తాజా మాజీ ఎంపీ పి.మిథున్‌రెడ్డి మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకం పెట్టి పేదప్రజల ప్రాణాలను కాపాడిన దేవుడు వైఎస్సార్ అని కీర్తించారు.
ముఖ్యఅతిథిగా హాజరయిన వైఎస్సార్ చిరకాల మిత్రుడు డాక్టర్ ప్రేమసాగర్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ దేశ చరిత్రలోనే గొప్ప పరిపాలనాధ్యక్షుడిగా పేరు తెచ్చుకున్నారని, భారతరత్న బిరుదు పొందేందుకు పూర్తిగా అర్హుడని చెప్పారు. వైఎస్సార్‌కు భారతరత్న ఇవ్వాలనే విజ్ఞప్తితో అమెరికా గడ్డ మీదనుంచే కోటి సంతకాల ఉద్యమం మొదలు పెడుతున్నామని ప్రేమసాగర్‌రెడ్డి తెలిపారు. వచ్చే నాటా ఉత్సవాల్లో వైఎస్ జగన్ సీఎం హోదాలో పాల్గొంటారని సభికుల హర్షధ్వానాల మధ్య ఆయన ప్రకటించారు. మిమిక్రీ కళాకారుడు రమేష్ మిమిక్రీ హైలెట్‌గా నిలిచింది. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రవీంంద్రనాథ్‌రెడ్డి, గౌరు చరితారెడ్డి, కోన రఘుపతి, అనిల్‌కుమార్ యాదవ్, రాంరెడ్డి ప్రతాపరెడ్డి, కోరుముట్ల శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి, నేతలు లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎన్.లక్ష్మీపార్వతి, గౌరు వెంకటరెడ్డి, పద్మజ నారమల్లి, నదీమ్ అహ్మద్, హఫీజ్‌ఖాన్, అబ్బయ్యచౌదరి, కారుమూరి నాగేశ్వరరావు, బియ్యపు మధుసూదనరెడ్డి, అరిమండ వరప్రసాదరెడ్డి, శివభరత్, చల్లా మధు, హర్షవర్దన్, అమెరికా వైఎస్సార్‌సీపీ కన్వీనర్లు పండుగాయల రత్నాకర్, వాసుదేవ, కొర్సపాటి, మధులిక, నాటా నాయకులు రాజేశ్వరరెడ్డి, రాఘవరెడ్డి గోశాల, శరత్ మందపాటి పాల్గొన్నారు.
కువైట్, ఖతార్‌లలో..
కడప కార్పొరేషన్: దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి వేడుకలు కువైట్‌లోని మాలియా ప్రాంతంలో ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ సీపీ కువైట్ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో ముందుగా కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. కార్యక్రమంలో కో కన్వీనర్ గోవిందు నాగరాజు, గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు రెహమాన్‌ఖాన్, కోశాధికారి ఎన్.మహేశ్వర్‌రెడ్డి, వైఎస్సార్ సీపీ కువైట్ కమిటీ నాయకులు ఎ.ప్రభాకర్‌రెడ్డి, బీఎన్ సింహా, జి.ప్రవీణ్‌రెడ్డి, ఎన్.చంద్రశేఖర్‌రెడ్డి, పి.సుబ్బారెడ్డి, ఎస్.రహమతుల్లా, కె.నాగసుబ్బారెడ్డి, హరినాథ్, గౌస్, ప్రభాకర్, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఖతార్ రాజధాని దోహాలో..
వైఎస్సార్ జయంతి వేడుకల్ని ఖతార్ రాజధాని దోహాలో ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ సీపీ మైనార్టీ సేవా సమితి అధ్యక్షుడు దర్బార్‌బాషా ఆధ్వర్యంలో కో కన్వీనర్ జాఫర్ హుస్సేన్ కార్యాలయంలో నిర్వహించిన ఈ వేడుకల్లో పార్టీ దోహా కన్వీనర్ దొండపాటి శశికిరణ్, కో కన్వీనర్ జాఫర్ హుస్సేన్ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. కార్యక్రమంలో యూత్ ఇన్‌చార్జి మనీష్, స్పోర్ట్స్ మెంబర్ జయరాజు, మహాసేన ఖతార్ సభ్యులు జి.అశోక్‌కుమార్, వైఎస్సార్ అభిమానులు మహమ్మద్ అలీ, మోహన్‌రెడ్డి, నరేంద్ర, శ్రీను, రాజు, వసంత్, పవన్‌రెడ్డి, చిరంజీవి, గోపాల్‌రెడ్డి, రమేష్‌రెడ్డి, సుభానీ, వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు.
మహానేతకు భారతరత్న ఇవ్వాలి
Published Tue, Jul 10 2018 2:12 AM | Last Updated on Tue, Jul 10 2018 2:12 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment