మహానేత దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్ రాజశేఖర రెడ్డి గారి 74వ జయంతి వేడుకలు కువైట్ మాలియా ప్రాంతంలో పవన్ ఆంధ్ర రెస్టారెంట్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కువైట్ కన్వీనర్ ముమ్మడి బాలి రెడ్డి, ఆధ్వర్యములో ఘనంగా నిర్వహించారు. బాలిరెడ్డి, కమిటీ సభ్యులు స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. గారి చిత్రపటానికి పూలమాల వేసి కేక్ కట్ చేసి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా బాలి రెఢ్డి గారు మాట్లాడుతూ.. అపర భగీరథుడు రాజన్న తన పరిపాలనలోపేద బడుగు బాలహీన వర్గాల, ప్రజల కొరకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేశారన్నారు. పేదలకు ఆరోగ్యశ్రీ, రైతులకు రుణ మాఫీ పథకం, ఉచిత విధ్యుత్ పథకం,పేద విద్యార్ధుల చదువు కోసం ఫీజు రీయింబర్స్మెంట్ పధకం ఇలా ఎన్నో సంక్షేమ పధకాలను కుల మతాలకు అతీతంగా అందించి రాష్ట్ర ప్రజల మనస్సులో సంక్షేమ సారధిగ నిలిచి పోయారని కొనయాడారు.
ప్రస్తుతం రాజన్న భౌతికంగా మన మధ్య లేకపోయిన నింగిన సూర్యచంద్రులు ఉన్నంత వరకు.. భూమిపై జీవరాసులు ఉన్నంత వరకు ప్రపంచం నలుమూలల ఉన్న ప్రతి తెలుగు ప్రజల గుండెలలో స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు శాశ్వతంగా ఉంటారని తెలిపారు. గల్ఫ్ కో కన్వీనర్ గోవిందు నాగరాజు, కువైట్ కో కన్వీనర్ యం వీ నరసారెడ్డి మాట్లాడుతూ.. స్వర్గీయ వైఎస్స్ రాజశేఖర్ రెడ్డి గారు బతికి ఉండుంటే రాష్ట్రం ఉమ్మడిగా ఉండేదన్నారు. ఐనా రాష్ట్రం విడిపోయి లోటు బడ్జెట్ ఉన్నా.. కూడా తండ్రి ఆశయ సాధన కొరకు రాజకీయాలలో వచ్చిన ముఖ్యమంత్రి అయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరింత గొప్పగా సంక్షేమ పథకాలను అందించి ప్రజల మనుసును గెలుచుకున్నారు. ఆయన తన తండ్రి కన్నా పది అడుగు ముందుకేసి కుల మతాలకు, రాజకీయాలకు అతీతంగా పేద ప్రజలకు సంక్షేమ పధకాలు అందించి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేయించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పారిపాలన చూసి.. నేను కన్న కలలు నా వారసుడు.. నా ముద్దు బిడ్డ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెరవేరుస్తున్నాడని స్వర్గంలో ఉన్న మహా నాయకుడు వైఎస్సార్ గారి ఆత్మ సంబరపడి ఉంటుందన్నారు.
మైనారిటీ నాయకులు షేక్ రహమతుల్లా, బీసీ ఇన్చార్జ్ రమణ యాదవ్ మాట్లాడుతూ.. మహా నేత వైఎస్సార్ గారు ముస్లింలకు 4% రిజర్వేషన్ ఇచ్చి విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే,, ఒక అడుగు ముందుకేసి రాజన్న బిడ్డ రాజకీయలలో కూడా 4 శాతం అవకాశం కల్పించి.. ముస్లిం సోదరులు రాజకీయంగా ఎదిగే అవకాశం ఇవ్వడమేగాక ఏకంగా 5 మందికి శాసనసభ టికెట్లు ఇవ్వడం జరిగింది. అందులో నలుగురు గెలవడం.. ఒకరికి ఏకంగా ఉప ముఖ్యంత్రిగా అవకాశం కల్పించి.. తాను తన తండ్రిలాగే మైనారిటీ ముస్లింల పక్షపాతి అని నిరూపించుకున్నారన్నారు.
ఈ కార్యక్రమంలో గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు మన్నూరు చంద్ర శేఖర్ రెడ్డి, యువజన విభాగం ఇన్చార్జ్ మర్రి కల్యాణ్, సలహాదారులు నాగిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, అబ్ తురబ్, అన్నాజీ శేఖర్, ఎస్సీ ఎస్టీ విభాగం ఇన్చార్జ్ బీబియన్ సింహ, వైనార్టీ నాయకులు షా హుస్సేన్, మహుబ్ బాషా, సీనియర్ నాయకులు వైఎస్ లాజరస్, ఏవీ సుబ్బా రెడ్డి, యువజన విభాగం సభ్యులు సయ్యద్ సజ్జాద్, షేక్ సబ్దర్, జగనన్న యూత్ ఫోర్స్ అధ్యక్షులు లక్ష్మి ప్రసాద్, యన్.వీ సుబ్బారెడ్డి, జగనన్న సైన్యం అధ్యక్షుల బాషా, అరవ సుబ్బారెడ్డి, గజ్జల నరసా రెడ్డి,మణి, ప్రభాకర్ యాదవ్, నాధముణి, రామచంద్రారెడ్డి, తదితరులు పాల్గోన్నారు.
(చదవండి: లండన్‌లో ఘనంగా వైఎస్‌ఆర్ జయంతి వేడుకలు )
Comments
Please login to add a commentAdd a comment