‘ఇఫ్తార్’ ఖర్చు వివరాలు చెప్పండి
జీవోల్లో ఆ వివరాలను ప్రస్తావించట్లేదని తెలిపా రు. మైనారిటీలకు ఈ విందు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోందని, అయితే ఇందులో మైనా రిటీయేతరులూ పాల్గొంటున్నారని వివరించారు. సీఎం కూడా ఈ విందులో పాల్గొంటున్నారని తెలిపారు. ధర్మాసనం జీవోను పరిశీలించి, ఇందులో 420 మసీదుల్లో 500 మందికి చొప్పున విందు ఇవ్వాలని ఉందని, మరి మైనారిటీయేతరులు విందులో పాల్గొన్నారని ఎలా గుర్తించాలని ప్రశ్నించింది. ప్రభుత్వాలు అనేక పథకాలకు రాయితీలు ఇస్తుంటాయని, ప్రతీ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని ధర్మాసనం పేర్కొంది.
మైనారిటీ నిధులను అవసరమైన మైనా రిటీల కోసం వినియోగించడాన్ని తాము వ్యతిరేకించట్లేదని సమీర్ తెలిపారు. ఇఫ్తార్ పేరుతో నిధుల దుర్వినియోగం జరుగుతోంది కాబట్టే జోక్యం కోరుతున్నట్లు పేర్కొన్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఇఫ్తార్ విందు జీవో అమలుపై స్టే ఇవ్వాలని కోరారు. ఇఫ్తార్ విందుకు అయ్యే వ్యయాలకు సంబంధించిన వివరాలు తమ ముందుంచాలని మైనారిటీ సంక్షేమ శాఖ తరఫు న్యాయవాదికి స్పష్టం చేస్తూ విచారణను గురువారానికి వాయిదా వేసింది